Tennesse
-
బుల్లోడా! నువ్వు సామాన్యుడివి కాదు..
న్యూయార్క్ : టేనస్సీకి చెందిన కోయ్ ప్రైజ్ కొద్దిరోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి చేపలు పట్టడానికి స్పెన్సర్ క్రీక్కు వెళ్లాడు. అక్కడి ఓల్డ్ హైకోరీ సరస్సులో కుటుంబసభ్యులందరూ చాకచక్యంగా చేపలు పడుతూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కోయ్ సహోదరిలు కూడా అతడి కంటే పెద్దపెద్ద చేపలు పడుతున్నారు. దీంతో అతడి మనసు కొద్దిగా చివుక్కుమంది. ఎలాగైనా వారికంటే పెద్ద చేపను పట్టాలని, దేవుడ్ని మొక్కి మరీ గాలాన్ని సరస్సులో వేశాడు. కొద్దిసేపటి తర్వాత ఏదో చేప గాలానికి చిక్కుకున్నట్లు తెలిసింది. పైకి ఎంత లాగుతున్నా కానీ, అది రావటం లేదు. కుటుంబసభ్యుల సహాయంతో గట్టిగా లాగగా పెద్ద చేప బయటపడింది. 35 కేజీలు, దాదాపు కోయ్ అంత పొడవు ఉందా చేప. పిల్లాడి ఆనందం, ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. ( సూర్యుడు కూడా ‘లాక్డౌన్’! ) చేపను నీళ్లలో వదిలేసిన దృశ్యం తను కల్లో కూడా ఊహించని ఘటన జరిగేసరికి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. దానితో ఫొటోలు దిగి, మళ్లీ నీళ్లలోనే వదిలేశాడు. టేనస్సీ వైల్డ్ లైఫ్ రీసోర్స్ ఏజెన్సీ ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని తమ ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో కోయ్ సోషల్ మీడియా ఫేమస్ అయిపోయాడు. నెటిజన్లందరూ అతడ్ని శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ( అడవి కుక్క వింత శబ్దం.. భయపడిన పులి ) -
కూలిన బెల్ హెలికాప్టర్: ఐదుగురి దుర్మరణం
సేవియర్ విల్లే: హెలికాప్టర్ లో సరదాగా విహరిద్దామనుకున్న నలుగురు టూరిస్టుల ప్రాణాలు గాలిలోకలిసిపోయాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో హెలికాప్టర్ కుప్పకూలిపోయి, పైలట్ సహా ఐదుగురు దుర్మరణం చెందిన సంఘటన సోమవారం అమెరికాలో చోటుచేసుకుంది. ఫెడరల్ ఏవియేషన్ అధికార ప్రతినిధి కేథలిన్ బెర్గన్ చెప్పిన వివరాల ప్రకారం.. టెన్నెస్సీ రాష్ట్రంలోని గ్రేట్ స్మోకీ పర్వతాల్లో గల జాతీయ పార్కుకు వెళ్లిన నలుగురు టూరిస్టులు హెలికాప్టర్ ద్వారా పరిసర ప్రాంతాలు విహరించేందుకు బయలుదేరారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే హెలికాప్టర్ ఇంజన్ లో మంటలు చెలరేగాయి. పైలట్ హెలికాప్టర్ పై నియంత్రణ కోల్పోయాడు. కొద్ది క్షణాల పాటు గాలిలో చక్కర్లు కొట్టిన విహంగం.. విల్లే ప్రాంతంలో నివాస స్థలాలకు దగ్గరగా కూలిపోయింది. సమాచారం అందిన వెంటనే ఆంబులెన్స్ లు, ఫైరింగజన్లతో ప్రమాద స్థలికి చేరుకున్నామని, దురదృష్టవశాత్తు హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నవారిలో ఎవ్వరూ బతకలేదని టెన్నెస్సీ ఎమర్జెన్సీ డిపార్ట్ మెంట్ ప్రతినిధి డీన్ ఫ్లేజన్ చెప్పారు. నివాస స్థలాలకు కొద్దిగా దూరంగా కూలడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని, నేలపై ఉన్న ఎవరికీ గాయాలు కాలేదని, ఇళ్లకు కూడా నష్టం వాటిల్లలేదని తెలిపారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించి బంధువులకు కబురుపెడతామని పేర్కొన్నారు.