
సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారుడి ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఎదురైంది. ఓ జాతి చేప కోసం వెళ్లిన ఇతగాడికి మరో అరుదైన రకం చేప చిక్కింది. వివరాలు.. ఆస్కార్ లుండాల్ అనే వ్యక్తి నార్వేలోని ఓ ఫిషింగ్ కంపెనీలో అడ్వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను నీలిరంగు హాలిబట్ అనే జాతి చేప కోసం నార్వే కోస్టల్ తీరానికి వేటకు వెళ్లాడు. అయితే ఈ రకం చేపలు తీరానికి 5 మైళ్ళ దూరంలో ఉంటాయని, దాని కోసం గాలం వేయగా 300 వందల మీటర్ల లోతులో ఓ పెద్ద చేప చిక్కందని, తీరా బయటకు తీసి చూడగా డైనోసర్‌లా కనిపించిన అరుదైన రకం చేప చిక్కినట్లు ఆస్కార్ తెలిపాడు. దీంతో ఈ చేప ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. చేపను చూసిన నెటిజన్లంతా ‘బాబోయ్ ఇది చూడటానికి భయంకరంగా ఉంది. దాని కళ్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఇది ఎంత దూరం వరకు చూడగలదు. ఇలాంటి వింత రకం చేపలన్నీ నీటికి అడుగు భాగంలోనే జీవిస్తాయి’ అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
కాగా ఇలాంటి చేపను తానేప్పుడూ చూడలేదని, ఇది చుడటానికి డైనోసర్‌లా ఉండటంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యానంటూ ఆస్కార్ టుండాల్ చెప్పుకొచ్చాడు. మనుషులకు ఎలాంటి హాని కలిగించదని తెలిపాడు. అయితే ఈ అరుదైన రకం చేపను ర్యాట్‌ఫీష్‌గా అక్కడి వారు గుర్తించారు. సింహం, డ్రాగన్ లాంటి తోకను కలిగిన ఈ చేప గ్రీకు పౌరాణిక రాక్షసుడి నుంచి ఉద్భవించిందని అక్కడి వారి నమ్మకం.
Comments
Please login to add a commentAdd a comment