
నార్వే : జూన్ 3న ఉత్తర నార్వేలో ఒక విషాద సంఘటన చోటు చేసుకున్నది. అనేక ఇళ్లను సముద్రం తనలోకి లాగేసుకున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ వీడియోను అల్టా నివాసి అయిన జాన్ ఫ్రెడ్రిక్ డ్రాబ్లోస్ ట్విటర్‌లో షేర్ చేశాడు. 'అయ్యో ఎంత విషాదం.. చూస్తున్నంతసేపట్లో కొండచరియలతో పాటు అనేక ఇళ్లను సముద్రం తనలో కలిపేసుకుంది' అంటూ క్యాప్షన్ జత చేశాడు.(పానీపూరి ప్రియులను కలవరపరిచే వంటకం)
దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో మొదట్లో వాతావరణం అంతా కూల్‌గా, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆ తర్వాత బాగా గమనించినట్లయితే ఇళ్లన్నీ కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. తీరా కాసేపటికి అవన్నీ నీటిలో కలిసిపోయాయి. అసలు ఇదంతా నిజమా లేక గ్రాఫిక్సా అనే అనుమానం కలిగేలోపే జరగాల్సింది జరిగిపోయింది. అయితే ఇదంతా నిజమే.. ప్రస్తుతం ఈ వీడియోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 1.6 మిలియన్ మందికి పైగా వీక్షించారు.' ఇది నిజంగా భయానకం'.. ' 2020 మనకు ఏ మాత్రం కలిసిరావడం లేదు' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (కోతి, కింగ్ కోబ్రాల ఒళ్లు గగుర్పొడిచే ఫైట్)
Comments
Please login to add a commentAdd a comment