వ్యక్తి మృతదేహం లభ్యం
– మృతుడు షఫీ మాజీ మిస్టర్‌నంద్యాల అవార్డు గ్రహీత
– విషాదంలో నడిగడ్డ వాసులు
నంద్యాల/బండిఆత్మకూరు: చేపల వేటకు వెళ్లి ప్రమాద వశాత్తు నీటిలో కొట్టుకోపోయిన మహమ్మద్‌షఫీ మృతదేహం మంగళవారం సాయంత్రం బండిఆత్మకూరులో లభ్యమైంది. దీంతో నంద్యాల పట్టణంలోని నడిగడ్డలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే. సంతజూటూరు పికప్ ఆనకట్ట వద్ద సోమవారం చేపల వేటకు మహమ్మద్ షఫీ, అతని మిత్రులు వెళ్లారు. షఫీ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకొని పోగా అతని కాపాడటానికి వెళ్లిన స్నేహితుడు అంజాద్ మృత్యువాత పడ్డాడు. షఫీ ఆచూకీ మాత్ర లభ్యం కాలేదు. మంగళవారం తెల్లవారుజాము నుంచి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసీ కెనాల్, కుందూ వెంట వెతికారు. వెలుగోడు నుంచి తెప్పించిన పుట్టిలతో రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, నంద్యాల రూరల్ ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి, షఫీ స్నేహితులు గాలించారు. సాయంత్రం బండిఆత్మకూరు వద్ద అతని మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఆరు అడుగుల పైగా ఉన్న షఫీ పాతికేళ్ల క్రితమే మిస్టర్ నంద్యాలగా అవార్డు పొందారు. చిన్నప్పటి నుంచివ్యాయామంపై ఆసక్తి ఉండటంతో ఎక్కువ సమయం వ్యాయామ శాలలో గడిపేవాడు. తర్వాత వెయిట్ లిఫ్టర్‌గా, బాడీబిల్డర్‌గా పోటీల్లో పాల్గొని పలు బహుమతులను సాధించారు. మృతుదికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం.