చెన్నయ్ః సముద్ర జలాల్లో చేపల వేటపై తమిళనాడులో 45 రోజుల పాటు విధించిన నిషేధం ముగిసింది. జాలర్లు ఇకపై వేటకు వెళ్ళొచ్చని అధికారులు తెలిపారు. అయితే శ్రీలంక, భారత జాలర్ల సమస్య పరిష్కారానికి నాలుగో విడత సమావేశాలు త్వరలో ప్రారంభించాలని ఈ సందర్భంలో జాలర్లు కోరారు.
తమిళనాడు తూర్పు తీర ప్రాంతంలో ఏప్రిల్ 15 నుంచి మే 29 తేదీవరకూ మొత్తం 45 రోజులపాటు చేపల వేటను నిషేధించిన విషయం తెలిసిందే. మెకనైజ్డ్ బోట్లలో సముద్రంలో చేపలు పట్టే జాలర్లకు ప్రతియేటా చేపల సంతానోత్సత్తి కోసం ఈ నిషేధాన్నిఅధికారులు అమల్లోకి తెస్తారు. నాగపట్నం, రామనాథపురం, తూథుకుడి, పుదుక్కొట్టై, కన్యాకుమారిల్లో ఆదివారం అర్థరాత్రినుంచి నిషేధాన్ని తొలగించడంతో జాలర్లు తిరిగి వేటకు వెళ్ళేందుకు తమ పడవలను చేపలు నిల్వ చేసేందుకు కావలసిన ఐస్ తోనూ, డీజిల్ తోనూ నింపి సిద్ధం చేసుకుంటున్నారు.
తమిళనాడులో ముగిసిన వేట నిషేధం!
Published Mon, May 30 2016 4:24 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM
Advertisement
Advertisement