హమ్మయ్యా... చంద్రయ్య వచ్చాడు | chandraya safe with his family happy moments | Sakshi
Sakshi News home page

హమ్మయ్యా... చంద్రయ్య వచ్చాడు

Published Tue, May 24 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

హమ్మయ్యా... చంద్రయ్య వచ్చాడు

హమ్మయ్యా... చంద్రయ్య వచ్చాడు

డొంకూరు(ఇచ్ఛాపురం రూరల్): చేపల వేటకు చెన్నై వెళ్లి గత నెల రోజుల నుంచి ఆచూకీ లేని చీకటి చంద్రయ్య ఎట్టకేలకు ఇంటికి చేరాడు. దీంతో అతని కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. డొంకూరు మత్స్యకార గ్రామానికి చెందిన మూగవాడు చీకటి చంద్రయ్య ఆరు నెలల కిందట పొట్ట కూటికోసం గ్రామస్తులతో కలిసి చేపల వేటకు చెన్నై వెళ్లాడు. కొంత కాలం పనిచేశాడు. నెల రోజుల కిందట చేపల వేట నిషేధం కావడంతో తోటిపనివారు స్వగ్రామాలకు చేరినా చంద్రయ్య మాత్రం ఇంటికి రాలేదు.

దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కలిసి బంధువులు, తెలిసిన వారివద్ద వాకాబు చేసినా చంద్రయ్య జాడలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా ఆచూకీ లేకపోవడంతో మరణించాడని అందరూ అనుకున్న సమయంలో ఒక్కసారి ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆనందపడ్డారు. వేట నిషేధం సమయంలో రోజు కూలీగా ఇతర పనిలో చేరడం వల్ల ఇంటికి రాలేకపోయినట్టు యంద్రయ్య సైగల ద్వారా తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement