fish hunt
-
విశాఖ సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం సముద్రంలో ఆరుగురు మత్య్సకారులు గల్లంతయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు సోమవారం సాయంత్రం విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి దక్షిణ దిశగా గంగవరం వైపు చేపల వేటకు వెళ్లారు. వైజాగ్ హార్బర్ నుంచి V 1-MO -2736 నెంబర్ బోట్లో వేటకు వెళ్లారు. రాత్రి గడిచినా వారు ఇంటికి చేరకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు మంగళవారం కోస్ట్‌గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఫిషింగ్ బోట్లు, కోస్ట్‌గార్డు సాయంతో మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతైన మత్సకారుల స్వస్థలం విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందినవారిగా సమాచారం. చదవండి: చంద్రబాబుకు దెబ్బేసిన ఎల్లో మీడియా! -
Photo Feature: టీకానే రక్షణ.. బస్సు కోసం నిరీక్షణ!
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆయా రాష్ట్రాలు విధించిన ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఆంక్షలు సడలించగా, మరికొన్ని రాష్ట్రాలు ఇదే బాటలో పయనిస్తున్నాయి. మరోవైపు దేశమంతటా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. టీకాలు వేయించుకునేందుకు వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. -
చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడిన ఉపాధ్యాయుడు
కొత్తగూడ : సరదాగా గాలాలతో చేపల వేటకు వెళ్లిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై యాసిర్ అరాఫత్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అందుగులగూడెం గ్రామానికి చెందిన మద్దెల శ్రీను(35) మండలంలోని కర్నెగండి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మండల కేంద్రంలో కిరాయి ఇంట్లో ఉంటూ పాఠశాలకు వెళ్లి వస్తుంటాడు. తన స్నేహితులు మహేష్, సారయ్యతో కలసి సరదాగా పాఖాల సరస్సుకు వెళ్లే బూర్కపల్లి వాగులో గాలాలతో చేపలు వేటాడేందుకు ఆదివారం వెళ్లారు. ముగ్గురు వేర్వేరు చోట్ల గాలాలు వేసుకుని కూర్చున్నారు. సాయంత్రం మహేష్, సారయ్యలు శ్రీను కూర్చున్న స్థలానికి రాగా ఆయన లేకపోవడంతో ఇంటికి వెళ్లి ఉంటాడని భావించి వెళ్లిపోయారు. అయితే, శ్రీను ఇంటికి రాలేదని బార్య సరిత వాకబు చేసే సరికే చీకటి పడింది. ఈ మేరకు చేపల వేటకు వెళ్లిన వాగులో సోమవారం ఉదయం గ్రామస్తులంతా కలిసి వెతకగా శ్రీను మృతదేహం లభించింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు శరణ్య, స్నేహిత ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు ఎస్సై వివరించారు. కాగా, శ్రీను మృతదేహం వద్ద ఆయన భార్య, పిల్లల రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. -
కూలీని కాటేసిన కరెంట్
ఉరవకొండ: పెన్నహోబిళం వద్ద ఏటి గంగవ్ము వద్ద నీటిలో చేపలు పట్టడానికి వెళ్ళిన కూలి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వుృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు స్థానిక లక్ష్మీ నృసింహ కాలనీలో నివాసవుుంటున్న కూలి జోగి అంజినయ్య (40) ఆదివారం సరదాగా చేపలు పట్టడానికి పెన్నహోబిళం సమీపంలోని ఏటి గంగవ్ము వద్దకు వెళ్ళాడు. చేపలు పడుతున్న సమయంలో రైతులు నీటి కోసం వేసిన బోరుకు సంబంధించిన వైరు తెగిపోయింది. దీంతో కాళ్లు నీళ్ళలోకి పెట్టిన వెంటనే అంజినయ్య విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే వుృతి చెందాడు. దీన్ని గవునించి అక్కడే ఉన్న కొందరు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి అంజినయ్యను తరలించగా వైద్యులు అప్పటికే వుృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరిశీలించి తహశీల్దార్ బ్రహ్మయ్యతో వూట్లాడి బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం అందేలా చూడాలని తెలిపారు. -
హమ్మయ్యా... చంద్రయ్య వచ్చాడు
డొంకూరు(ఇచ్ఛాపురం రూరల్): చేపల వేటకు చెన్నై వెళ్లి గత నెల రోజుల నుంచి ఆచూకీ లేని చీకటి చంద్రయ్య ఎట్టకేలకు ఇంటికి చేరాడు. దీంతో అతని కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. డొంకూరు మత్స్యకార గ్రామానికి చెందిన మూగవాడు చీకటి చంద్రయ్య ఆరు నెలల కిందట పొట్ట కూటికోసం గ్రామస్తులతో కలిసి చేపల వేటకు చెన్నై వెళ్లాడు. కొంత కాలం పనిచేశాడు. నెల రోజుల కిందట చేపల వేట నిషేధం కావడంతో తోటిపనివారు స్వగ్రామాలకు చేరినా చంద్రయ్య మాత్రం ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కలిసి బంధువులు, తెలిసిన వారివద్ద వాకాబు చేసినా చంద్రయ్య జాడలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా ఆచూకీ లేకపోవడంతో మరణించాడని అందరూ అనుకున్న సమయంలో ఒక్కసారి ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆనందపడ్డారు. వేట నిషేధం సమయంలో రోజు కూలీగా ఇతర పనిలో చేరడం వల్ల ఇంటికి రాలేకపోయినట్టు యంద్రయ్య సైగల ద్వారా తెలిపాడు. -
నాటు బాంబులతో చేపల వేట.. వ్యక్తి మృతి
నేరేడుచర్ల: నాటు బాంబులతో చేపల వేట ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలం చిన్నపాడులో నాటు బాంబు పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి పక్కనే ఉన్న మూసి నదిలో చేపలు పట్టే క్రమంలో రమావత్ రమేష్ చేతిలో ఉన్న నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో అతడు నదిలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
గోదావరి పుష్కరఘాట్‌లో విషాదం
రాజమండ్రి: గోదావరి పుష్కరఘాట్‌లో అపశ్రుతి జరిగింది. చేపల వేటకు వెళ్లిన ఒక జాలరి ప్రమాదవశాత్తూ పుష్కరఘాట్‌లో పడి మృతి చెందాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని కోటిలింగాల పుష్కరఘాట్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. రాజమండ్రికి చెందిన కాలపు ధనరాజ్ చేపల వేటకు వెళ్లాడు. అయితే, పుష్కరఘాట్‌లో తవ్విన గుంతలో ప్రమాదవశాత్తూ చిక్కుకుని అతను మృతి చెందాడు. దీంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ధనరాజ్ మృతి చెందాడని, తమకు న్యాయం చేయాలని అతని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. -
వేట లేదు...పూట గడవదు..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చేపలవేటపై నిషేధ వ్యవధిని 45 నుంచి 61 రోజులకు పెంచిన ప్రభుత్వం అందుకు తగ్గట్టు మత్స్యకారులకు సాయం అందించకుండా కాలయాపన చేస్తోంది. దీంతో గంగపుత్రులు ఆకలితో అలమటిస్తున్నారు. చూస్తూండగానే బోట్లకు లంగరేసి 45 రోజులు గడిచిపోయాయి. ‘ఇన్ని రోజులూ అప్పులపై అప్పులు చేసి బతుకుబండి ఈడ్చుకొచ్చాం. మరో 15 రోజులు కుటుంబాలను ఎలా నెట్టుకురావాలో తెలియడంలేదు’ అని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ కోస్తా జిల్లాల్లో ఉన్న మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. వేట నిషేధసమయంలో గతంలో మత్స్యకారులకు కుటుంబానికి 31 కేజీల బియ్యం ఇవ్వగా, ఇప్పుడు దానికి బదులు రూ.4 వేలు సాయం ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇంతవరకూ ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో 9 జిల్లాల్లో సముద్రంపై ఆధారపడి ఉన్న సుమారు రెండు లక్షల మంది పరిస్థితి దయనీయంగా ఉంది. అలాగే బోటుపై వేటకు వెళ్తే కళాసీ రోజుకు రూ.200, డ్రైవర్ రూ.400 తెచ్చుకునేవారు. నిషేధం అమలుతో వారు ఆ మేరకు ఆదాయం కోల్పోయారు. కూలికి వెళదామన్నా ఏ ఇతర పనీ రాదు. ఎవరూ పనిలో పెట్టుకోని పరిస్థితి. దీంతో ఇంట్లో వస్తువులు తాకట్టుపెట్టి, వడ్డీవ్యాపారులను ఆశ్రయించి పూట గడుపుకోవలసి వస్తోందని వారు వాపోతున్నారు. ముందుగానే తెలిసినా.. సర్కారు అలసత్వం ఏటా నిషేధ సమయం ఏప్రిల్‌లో మొదలవుతుందనే విషయం సర్కార్‌కు తెలియంది కాదు. అలాగే సముద్ర వేటపై ఆధారపడే మత్స్యకార కుటుంబాలు ఎన్ననే విషయం మత్స్యశాఖకూ తెలియంది కాదు. అటువంటప్పుడు ఇంత పెద్ద యంత్రాంగం ఉండి కూడా ముందుగానే తమకు సాయం ఎందుకు అందించలేరని మత్స్యకారులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నిషేధ సమయంలో కాకుండా, వేటకు వెళ్లి నాలుగు డబ్బులు తెచ్చుకునే సమయంలో సాయం అందించి ఉపయోగమేమిటని అంటున్నారు. తమిళనాడులో మాదిరి నిషేధ సమయానికి ముందుగానే సాయం అందించాలని చేసిన విజ్ఞప్తులూ బుట్టదాఖలయ్యాయని వారు ఆవేదన చెందుతున్నారు. తలకు మించిన భారంగా పెట్టుబడి ప్రస్తుతం వలల మరమ్మతులు తప్ప వేరే పనిలేని మత్స్యకారులు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. 15 రోజుల్లో తిరిగి వేటకు వెళ్లాలంటే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ పెట్టుబడి పెట్టాలి. ఇది తలకు మించిన భారమవుతోందని కాకినాడకు చెందిన మత్స్యకార ప్రతినిధి కామాడి మాతరాజు చెప్పారు. ‘అసలు పొట్ట పోసుకోవడమే గగనమైపోతుంటే వలల మరమ్మతులకు డబ్బులు ఎక్కడనుంచి వస్తాయి?’ అని కాకినాడ ఏటిమొగకు చెందిన మత్స్యకారుడు కాటాడి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. వేటకు వెళ్లే మత్స్యకారులకు ఆహారం, ఇతర ఖర్చులు రూ.30 వేలు, డీజిల్‌కు రూ.40 వేలు, ఐస్‌కు రూ.30 వేలు వెచ్చించాల్సి రావడం మోయలేని భారమవుతోందని మత్స్యకారులు వాపోతున్నారు. మా బాధలేం చెప్పాలి వేట లేకపోతే మాపరిస్థితి నరకమే. మాకు వచ్చేదెంత? రోజుకి రెండు, మూడొందలొస్తాయి. వాటితో కుటుంబాన్ని నెట్టుకొస్తాం. దాంట్లోనే మా ఖర్చులు కూడా. రెండు నెలలు వేట లేక అప్పులు చేసి కడుపు నింపుకున్నాం. గతంలో బియ్యం ఇచ్చేవారు. అవి కూడా సక్రమంగా అందేవి కావు. ఇప్పుడు ఒక్కో మత్స్యకారుడికి రూ.4 వేలు ఇస్తామంటున్నారు. అవి ఎప్పుడొస్తాయో? అసలు వస్తాయో రావో తెలియదు. పాండిచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో వేట నిషేధం మొదలవకుండానే ముందుగానే సాయం అందిస్తున్నారు. అలా మాకు కూడా ఇస్తే మా బతుకు మేం బతుకుతాం. - పంతాడి అప్పారావు, మత్స్యకారుడు, కాకినాడ వేట తప్ప వేరే పని రాదు మత్స్యకారులమైన మేం చేపల వేట తప్ప వేరే పని ఏమీ చేయలేం. 45 రోజులు ఉండే వేట నిషేధాన్ని ప్రభుత్వం 61 రోజులకు పెంచింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందక కుటుంబం గడవక అప్పులపాలవుతున్నాం. వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయాన్ని ముందుగానే అందించి ఆదుకోవాలి. - నక్కా పోమయ్య, నాయకర్ కాలనీ, ఉప్పాడ -
వాళ్లు వేటకొస్తున్నారు...
సాక్షి, విశాఖపట్నం: చేపలవేటపై నిషేధం అమలులో తమిళనాడు ప్రభుత్వ వైఖరి ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల్లో అలజడి రేపుతోంది. మత్స్యసంపద పునరుత్పత్తి, వృద్ధికి వీలుగా ఏటా ఏప్రిల్ 15 నుంచి మే 31 వరకు (45 రోజులు) చేపలవేటపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తోంది. ఈ ఏడాది 45 రోజుల నిషేధాన్ని 61 రోజులకు పెంచింది. దీని ప్రకారం ఈస్ట్‌కోస్ట్ (తూర్పు తీరం) పరిధిలోకి వచ్చే పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, అండమాన్ నికోబార్ దీవుల మత్స్యకారులకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపలవేట నిషేధం అమలవుతోంది. అలాగే వెస్ట్‌కోస్ట్ (పశ్చిమ తీరం)లోకి వచ్చే కేరళ, మహారాష్ట్ర, గోవా, గుజరాత్, లక్షదీప్ ప్రాంతాల వారు జూన్ 1 నుంచి జులై 31 వరకు వేటాడటానికి వీల్లేదు. కాగా, నిషేధం విధించి 45 రోజులు పూర్తవుతున్న తరుణంలో పొరుగున ఉన్న తమిళనాడులో కొంతమంది మత్స్యకారులు చేపలవేటకు బయల్దేరారు. ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి గతంలో మాదిరిగా 45 రోజుల నిషేధం సరిపోతుందని, ఇకపై తమను అనుమతించాలని కోరగా అందుకు అంగీకరించడంతో వేటకు ఉపక్రమించినట్టు ఆంధ్ర మత్స్యకార నాయకులు చెబుతున్నారు. తమిళనాడు మత్స్యకారులు పొరుగున్న ఉన్న ఆంధ్ర సముద్ర జలాల్లో వేటకు వస్తుంటారని, దీనివల్ల తమకు నష్టం వాటిల్లుతుందని వీరు ఆందోళన చెందుతున్నారు. తమిళ జాలర్లు 61 రోజుల నిషేధాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫిషింగ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐఎఫ్ఐ) కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ తదితర ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి నిషేధాన్ని పాటించకుండా చేపలవేట సాగించే బోట్లను సీజ్ చేయాలని, సంబంధిత మత్స్యకారులను అరెస్టు చేయాలని కోస్ట్‌గార్డ్‌కు ఆదేశాలిచ్చిందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫిషింగ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు డాక్టర్ వై.జి.కె.మూర్తి ‘సాక్షి’కి తెలిపారు. తమిళనాడు మత్స్యకారుల మాదిరిగానే పొరుగునే ఉన్న పాండిచ్చేరి మత్స్యకారులు కూడా మూడు రోజుల క్రితం నుంచి చేపలవే ట సాగిస్తున్నారని ఆయన చెప్పారు. దీనిపై తాము రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. -
దొరికినోళ్లకు దొరికినన్ని!
ఆటపాక (కైకలూరు) : అనుకున్నంతా అయ్యింది.. ఆటపాక పక్షుల విహార కేంద్రం చెరువులో చేపలను ప్రజలు సోమవారం లూటీ చేశారు. దీంతో 2012 జూన్ సంఘటన పునరావృతమైంది. ఉదయం నుంచి ఆటపాక, కోమటిలంక గ్రామాలతో పాటు సమీప గ్రామ ప్రజలు వందలాదిగా వచ్చి అటవీశాఖ ఆధీనంలోని చెరువులో ఒక్కసారిగా దిగారు. అందినకాడికి చేపలను ఒడిసి పట్టుకుని పరారయ్యారు. యువకులు, వృద్ధులతో పాటు మహిళలు కూడా చెరువులో దిగి చేపల వేటలో పాల్గొన్నారు. ఆటపాక పక్షుల కేంద్రం చెరువు 300 ఎకరాల్లో విస్తరించి ఉంది. నాలుగు దిక్కుల నుంచి ఒక్కసారిగా చెరువులో దిగి సంచులతో బతికిన చేపలను యథేచ్ఛగా తీసుకెళ్లి విక్రయించారు. కొందరు నాలుగు చేపలను తాళ్లు కట్టి ఈడ్చుకుంటు వెళ్లారు. ఒక్కో చేప రూ.700 నుంచి రూ.1000 పలికింది. పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలను నిలువరించడం అటవీ సిబ్బంది, పోలీసులకు వీలు పడలేదు. అటవీ శాఖ రేంజర్ పర్యావరణ కేంద్రంలో డ్వాక్రా మహిళలతో సమావేశం నిర్వహిస్తుండగానే చేపల చోరీ జరగడం గమనార్హం. చేపల లూటీ పూర్తయిన తర్వాత కైకలూరు టౌన్ ఎస్సై షబ్బీర్ అహ్మద్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికైనా చేపలను పట్టుకునే అవకాశం కల్పించాలని ఆటపాక ప్రజలు అటవీ అధికారులను కోరుతున్నారు. అటవీశాఖ అధికారుల హైడ్రామా... అభయారణ్య పరిధిలోని పక్షుల కేంద్ర చెరువులో చేపలను పట్టుకుంటే కేసులు నమోదు చేస్తామని డాంబికాలు పలికిన అటవీశాఖాధికారులు కళ్లెదుట అభయారణ్యంలో చేపలను తరలిస్తుంటే నిమ్మకునీరెత్తినట్లు మిన్నకున్నారు. అటవీశాఖ రేంజర్ ధన్‌రాజ్ ఈఈసీ కేంద్రం వద్ద ఆటపాక, జాన్పేటలకు చెందిన డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించారు. ఆటపాక గ్రామ పరిధిలో మొత్తం 96 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వాటిలో 44 పర్యావరణ అభివృద్ధి కమిటీ (ఈఈసీ) సభ్యులు కలిగినవే. డ్వాక్రా సంఘాలు, ఈఈసీ సంఘాలు బ్యాంకులో జాయింట్ అకౌంట్ తీసుకోవాలని, చెరువులో అడుగున ఉన్న చేపలను పట్టుకుని వచ్చిన మొత్తంలో సగం గ్రామాభివృద్ధికి, మిగిలిన సగం పక్షుల కేంద్ర అభివృద్ధికి ఉపయోగించాలని రేంజర్ వారికి సూచించారు. ప్రస్తుతం చెరువులో జరుగుతున్న లూటీని పోలీసుల సహకారంతో అడ్డుకుని చేపలు పట్టుకోవడానికి పూర్తిగా సహకరిస్తామన్నారు. ఈ నిర్ణయం ముందే తీసుకుంటే ఈ సమస్య వచ్చేది కాదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. చెరువులో ఇప్పటివరకు నీరు లేక చనిపోయినవి, గ్రామస్తులు తీసుకెళ్లినవి, ఇతరులు రాత్రివేళల్లో తరలించినవి కలిపి దాదాపు కోటి రూపాయల విలువైన చేపలు ఉంటాయని అంచనా. మిగిలినవి కూడా చాలా విలువే చేస్తాయని తెలుస్తోంది. ఇదిలావుంటే డ్వాక్రా మహిళా సంఘాలతో చెరువులో చేపలకు కేవ లం రూ.10 లక్షలు పాట జరిగిందనే వదంతులు వినిపిస్తున్నాయి. బెదిరిన పక్షులు... వందలాదిమంది ప్రజలు ఒక్కసారిగా చెరువులోకి దిగడంతో ఆటపాక పక్షుల కేంద్రంలోని పెలికాన్, పెయింటెడ్ స్టాక్ పక్షులు పరారయ్యాయి. బెదిరి వెళ్లిన పక్షులు తిరిగి రావడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం ఆటపాక పక్షుల కేంద్రం పక్షులు లేక కళావిహీనంగా మారింది. -
మనిషిని చంపిన చేప
గుంటూరు: చేపల వేటకు వెళ్లి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నగరం మండలం మీసాలవారి గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు..మీసాలవారి గ్రామానికి చెందిన సీతరామయ్య(45) పెదమట్లపూడి ఎత్తిపోతల వద్ద చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో కాలువలో దిగి ఒక చేపను పట్టుకొని దానిని నోట్లో పెట్టుకొని రెండో దాని కోసం ప్రయత్నించాడు. అదేసమయంలో నోట్లో ఉన్న చేప జారి గొంతులో పడింది. దీంతో అతన్ని పొన్నూరులోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అపరేషన్ చేసిన అనంతరం అతడు మృతిచెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. (నగరం) -
ధోని ‘చేపల వేట’
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ ధోని ఆస్ట్రేలియాలో చేపల వేట మొదలుపెట్టాడు. అవును... అడిలైడ్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ అడ్వెంచర్ పార్క్‌కు ధోని వెళ్లాడు. ట్రెక్కింగ్, ఫిషింగ్, బోటింగ్‌తో పూర్తిగా క్రికెట్‌కు దూరంగా రెండు రోజులు గడుపుతున్నాడు. ధోనితో పాటు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ కూడా ఈ పార్క్‌కు వెళ్లారు. ఈ నలుగురూ తిరిగి 5వ తేదీన జట్టుతో చేరతారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు స్టువర్ట్ బిన్నీ తన అక్క కుటుంబంతో సమయం గడిపేందుకు సిడ్నీ వెళ్లగా... శిఖర్ ధావన్ మెల్బోర్న్ వెళ్లి తన భార్యాపిల్లలతో సమయం గడుపుతున్నాడు. భారత క్రికెటర్లు ఐదు రోజుల పాటు క్రికెట్‌కు పూర్తి దూరంగా సరదాగా గడపాలని నిశ్చయించుకోవడంతో ఇలా తలా ఓ దారి చూసుకున్నారు. అయితే ఈ ఆరుగురు మినహా మిగిలిన క్రికెటర్లంతా అడిలైడ్‌లోనే ఉన్నారు. కొంతమంది షాపింగ్‌కు వెళ్తే, మరికొంత మంది జిమ్‌లో సమయం గడిపారు.