కూలీని కాటేసిన కరెంట్
Published Mon, Jul 18 2016 1:43 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
ఉరవకొండ: పెన్నహోబిళం వద్ద ఏటి గంగవ్ము వద్ద నీటిలో చేపలు పట్టడానికి వెళ్ళిన కూలి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వుృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు స్థానిక లక్ష్మీ నృసింహ కాలనీలో నివాసవుుంటున్న కూలి జోగి అంజినయ్య (40) ఆదివారం సరదాగా చేపలు పట్టడానికి పెన్నహోబిళం సమీపంలోని ఏటి గంగవ్ము వద్దకు వెళ్ళాడు. చేపలు పడుతున్న సమయంలో రైతులు నీటి కోసం వేసిన బోరుకు సంబంధించిన వైరు తెగిపోయింది. దీంతో కాళ్లు నీళ్ళలోకి పెట్టిన వెంటనే అంజినయ్య విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే వుృతి చెందాడు. దీన్ని గవునించి అక్కడే ఉన్న కొందరు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి అంజినయ్యను తరలించగా వైద్యులు అప్పటికే వుృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరిశీలించి తహశీల్దార్ బ్రహ్మయ్యతో వూట్లాడి బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం అందేలా చూడాలని తెలిపారు.
Advertisement
Advertisement