
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆయా రాష్ట్రాలు విధించిన ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఆంక్షలు సడలించగా, మరికొన్ని రాష్ట్రాలు ఇదే బాటలో పయనిస్తున్నాయి. మరోవైపు దేశమంతటా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. టీకాలు వేయించుకునేందుకు వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు.

తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఆంక్షల సడలింపు సమయంలో జనం ఒక్కసారిగా బయటకు వస్తుండటంతో రహదారులపై రద్దీ పెరుగుతోంది. చార్మినార్ ప్రాంతంలో జన సంచారం ఇలా కనిపించింది.

సూపర్‌స్ప్రెడర్ల కోసం రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రం వద్ద సోమవారం కనిపించిన దృశ్యమిది.. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచే జనం బారులు తీరారు.

చెరువుల్లో పోసిన చేపపిల్లలు చేతికంది రావడంతో మత్స్యకారులు చేపల వేట ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల చెరువులో 30 మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తెప్పలపై వెళ్తూ చెరువులో వలలు వేశారు. ఈ వేట తెల్లవారుజాము వరకు కొనసాగుతుంది. వలలో చిక్కిన చేపలను ఉదయం బయటకు తీసి విక్రయిస్తామని మత్స్యకారులు తెలిపారు. – చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల చేపల చెరువులో చేపల కోసం కొంగలు అన్వేషిస్తుండగా సాక్షి కెమెరా క్లిక్‌మంది. ప్రతి ఏటా వర్షకాలంలో వివిధ ప్రాంతాల నుంచి ఈ చెరువుకు రకరకాల కొంగలు వలస వచ్చి చేపలను వేటాడుతుంటాయి. దీంతో ఇక్కడ కోలాహలం నెలకొంటుంది. – సాక్షి,ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్

నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో శాశ్వత హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. ఈనెల 12న లేదా 14న సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో అధికారులు కలెక్టరేట్‌ను ముస్తాబు చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్

మహారాష్ట్రలో అన్‌లాక్ ప్రక్రియ దశలవారీగా ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం థానేలోని స్టేషన్ రోడ్ వద్ద అత్యంత రద్దీగా ఉన్న మార్కెట్ ప్రాంతం

మధ్యప్రదేశ్ భోపాల్‌లోని సెంట్రల్ జైలులో ఖైదీలకు కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్న ఆరోగ్య సిబ్బంది

ముంబైలోని బాంద్రాలో సోమవారం ఓ బస్టాప్ వద్ద బస్సు కోసం క్యూలో నిలుచున్న స్థానికులు

మర్మరా సముద్రంలోని జల చరాలు విడుదల చేసిన వ్యర్థాలతో కలుషితంగా మారిన టర్కీలోని కద్దెబోస్తాన్ తీరం

ముంబై తీరం వెంట గస్తీ కోసం పోలీసు శాఖకు రిలయన్స్ ఫౌండేషన్ విరాళంగా అందజేసిన ఆల్ టెరైన్ వెహికిల్స్(ఏటీవీలు)
Comments
Please login to add a commentAdd a comment