గోదావరి పుష్కరఘాట్‌లో విషాదం | kalapu dhanraj died while he is in fish hunt | Sakshi

గోదావరి పుష్కరఘాట్‌లో విషాదం

Jul 5 2015 5:04 PM | Updated on Sep 3 2017 4:57 AM

గోదావరి పుష్కరఘాట్‌లో అపశ్రుతి జరిగింది. చేపల వేటకు వెళ్లిన ఒక జాలరి ప్రమాదవశాత్తూ పుష్కరఘాట్‌లో పడి మృతి చెందాడు.

రాజమండ్రి: గోదావరి పుష్కరఘాట్‌లో అపశ్రుతి జరిగింది. చేపల వేటకు వెళ్లిన ఒక జాలరి ప్రమాదవశాత్తూ పుష్కరఘాట్‌లో పడి మృతి చెందాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని కోటిలింగాల పుష్కరఘాట్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. రాజమండ్రికి చెందిన కాలపు ధనరాజ్ చేపల వేటకు వెళ్లాడు.

అయితే, పుష్కరఘాట్‌లో తవ్విన గుంతలో ప్రమాదవశాత్తూ చిక్కుకుని అతను మృతి చెందాడు. దీంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ధనరాజ్ మృతి చెందాడని, తమకు న్యాయం చేయాలని అతని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement