
ధర్మపురి: రాయపట్నం గోదావరిలో అపరిశుభ్రత తాండవిస్తోంది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని రాయపట్నం వంతెనవద్ద గత పుష్కరాల సందర్భంగా ఘాటును ఏర్పాటుచేశారు. ఎల్లంపెల్లి బ్యాక్‌వాటర్ నిండుగా ఉండడంతో భక్తులు పుష్కరఘాట్ వద్దనే స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే గోదావరిలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ఫొటోలు, ప్లాస్టిక్ కవర్లు, కొబ్బరి చిప్పలు, దుస్తులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. పగిలిన గ్లాసుముక్కులు కాళ్లకు గుచ్చి ఇబ్బందులు పడుతున్నామని భక్తులు అంటున్నారు. గోదావరిలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేయాలని కోరుతున్నారు.


Comments
Please login to add a commentAdd a comment