Pushkara Ghat
-
రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద భక్తుల రద్దీ
-
అలా అయితే... తప్పెవరిది..? శిక్షెవరికి..?
సాక్షి, తూర్పుగోదావరి,రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాల తొలి రోజున జరిగిన తొక్కిసలాట ఘటనకు బాధ్యులు ఎవరన్నదానిపై ఓ వైపు చర్చ సాగుతున్న సమయంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారుతున్నాయి. శుక్రవారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వీఐపీ ఘాట్‌ను కాదని పుష్కర ఘాట్‌కు తనకు తానుగా వెళ్లలేదని, అప్పటి కలెక్టర్, ఎండోమెంట్ కమిషనర్, కంచికామకోటి పీఠాధిపతుల సూచన మేరకే పుష్కర ఘాట్‌లో స్నానం చేసేందుకు వెళ్లారని చెప్పారు. తొక్కిసలాట ఘటనపై విచారణ కోసం నియమించిన జస్టిస్ సీవై సోమయాజుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో పుష్కర ముహూర్తంపై మీడియా ప్రచారం, భక్తుల మూఢ నమ్మకమే తొక్కిసలాటకు కారణమని పేర్కొంది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలంటూ ఏడాది ముందుగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా చేసిన ప్రచారం కమిషన్ తన నివేదికలో ప్రస్తావించ లేదు. వీఐపీ ఘాట్‌ను వదిలి సీఎం చంద్రబాబు పుష్కరఘాట్‌కు ఎందుకు వెళ్లారన్న విషయం కూడా ఎక్కడా పేర్కొన లేదు. వీఐపీలు స్నానం కోసం గంటల తరబడి పుష్కర ఘాట్‌లో ఉండి, అప్పటి వరకు భక్తులను నిలువరించి ఒక్కసారిగా వదలడంతోనే తొక్కిసలాట జరిగిందని అప్పటి కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదికనూ కమిషన్ పరిగణనలోకి తీసుకోకపోవడంపై నివేదిక విశ్వసనీయతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉంటే ఇతర ఘాట్లకు భక్తులను మళ్లించకపోడంపై ఎవరిది తప్పు? మళ్లించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న అంశాలను విచారణలో అఫిడవిట్‌దారులు ప్రస్తావించినా నివేదికలో ఆయా అంశాలపై కమిషన్ తన వైఖరిని నివేదికలో పేర్కొనలేదు. పైన పేర్కొన్న ఏ విషయాన్నీ నివేదికలో ప్రస్తావించని కమిషనర్ తొక్కిసలాటకు మీడియా, భక్తులునే బాధ్యులుగా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కలెక్టర్‌ను విచారణకు డిమాండ్ చేసినా.. విచారణ సమయంలో అఫిడవిట్‌దారులు ముప్పాళ్ల సుబ్బారావు, శ్రీనివాస్‌లు జిల్లా కలెక్టర్‌ను విచారించాలని పలుమార్లు డిమాండ్ చేశారు. అప్పుడే ఈ ఘటనపై నిజానిజాలు బయటకొస్తాయని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు వీఐపీ ఘాట్‌ను వదిలి పుష్కరఘాట్‌కు ఎలా వెళ్లారు? ఎవరు అనుమతిచ్చారు? అన్న విషయాలు తెల్చాలని విచారణలో కోరారు. రద్దీ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అంబులెన్స్ వెళ్లేందుకు కూడా దారి లేదని, పుష్కరాల నిర్వహణ మార్గదర్శకాలు అడుగడుగునా ఉల్లంఘించారంటూ వాదనలు వినిపించారు. అయినా కమిషన్ ఇవేమీ పట్టించుకోకుండా తొక్కిసలాటకు, సీఎం చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదంటూ తేల్చింది. 29 మంది ప్రాణాలు కోల్పోయి, 51 మంది గాయపడిన ఘటనలో ఎవరినీ బాధ్యులను చేయకపోవడం చరిత్రలో ఇదే ప్రథమమని కమిషన్ విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య వీఐపీలకు కేటాయించిన సరస్వతి ఘాట్‌ను వదిలి సీఎం చంద్రబాబు పుష్కర ఘాట్‌కు కలెక్టర్, ఎండోమెంట్ కమిషనర్, కంచికామకోటి పిఠాధిపతి సూచన మేరకే వెళ్లారని చెప్పడంతో విచారణ కమిషనర్ ఇవేమీ పట్టించుకోకుండా తూ తూ మంత్రంగా నివేదిక ఇచ్చిందన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. భక్తుల ఉసురు ఖచ్చితంగా తగలుతుంది సీఎం చంద్రబాబు ప్రచార యావ వల్లే తొక్కిసలాట జరిగిందని ఎవరిని అడిగినా చెబుతారు. వీఐపీ ఘాటను వదిలి పుష్కరఘాట్‌కు వెళ్లకపోతే భక్తులను ఆపేవారు కాదు. తొక్కిసలాట జరిగేదీ కాదు. గంటల కొద్దీ సీఎం చంద్రబాబు స్నానం, పూజలు చేశారు. ముహూర్తం ఉదయం 6:26కే సీఎం చంద్రబాబు, ఇతర వీఐపీలు స్నానం చేశారు. కమిషనర్ పేర్కొన్నట్లు భక్తులది మూఢనమ్మకమైతే సీఎం చంద్రబాబుది కూడా మూఢ నమ్మకమేనా? కృష్ణా పుష్కరాల్లో ప్రమాదం జరిగి ఒకరు చనిపోతే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇక్కడ 29 మంది చనిపోయి, పదుల సంఖ్యలో గాయపడితే కనీసం చిన్నస్థాయి అధికారిపై కూడా చర్యలు తీసుకోలేదు. తొక్కిసలాట పాపం ఖచ్చితంగా చంద్రబాబుకు తగులుతుంది.– జక్కంపూడి విజయలక్ష్మి,న్యాయవాది, అఫిడవిట్‌దారు, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యురాలు బుచ్చయ్య చౌదరిగారు నివేదికను చదివినట్లు లేదు బుచ్చయ్య చౌదరిగారు నివేదికను చదివినట్లు లేదు. చదివితే ఇది అసంపూర్తిగా ఉన్నట్లు తాను అంచనాకు వస్తారు. విచారణలో వాదనలు నివేదికలో లేవు. నిబంధనలు ఉల్లంఘించారని స్పష్టంగా రాతపూర్వకంగా ఆధారాలు చూపించాం. మార్గదర్శకాలు, ఉల్లంఘనులు స్పష్టంగా పేర్కొన్నాం. అవేమీ పట్టించుకోలేదు. ఏదో నామమాత్రంగా రాసి ఇచ్చేశారు. మీడియా, భక్తుల మూఢనమ్మకాలే కారణం అంటూ చెప్పడం దారుణం. ప్రతిపక్షాలు ప్రచారం కోసం మాట్లాడుతుంటాయనడం సరికాదు. ఫలానా వ్యక్తి ముహూర్తం పెట్టారని బుచ్చయ్య చౌదరి చెబుతున్నారు. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య ప్రకటనలు ఇచ్చింది. మరి ఈ తప్పు ఎవరిది? మీడియా ముహూర్తం పెట్టినట్లు, ప్రచారం చేసినట్లు కమిషన్ పేర్కొంది. నివేదికను బుచ్చయ్య చౌదరి గారికి పంపుతాం. చదవండి, – ముప్పాళ్ల సుబ్బారావు, న్యాయవాది, ఏపీ బార్‌కౌన్సిల్ సభ్యుడు, రాజమహేంద్రవరం. -
గోదావరి కంపు.. కంపు
ధర్మపురి: రాయపట్నం గోదావరిలో అపరిశుభ్రత తాండవిస్తోంది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని రాయపట్నం వంతెనవద్ద గత పుష్కరాల సందర్భంగా ఘాటును ఏర్పాటుచేశారు. ఎల్లంపెల్లి బ్యాక్‌వాటర్ నిండుగా ఉండడంతో భక్తులు పుష్కరఘాట్ వద్దనే స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే గోదావరిలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ఫొటోలు, ప్లాస్టిక్ కవర్లు, కొబ్బరి చిప్పలు, దుస్తులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. పగిలిన గ్లాసుముక్కులు కాళ్లకు గుచ్చి ఇబ్బందులు పడుతున్నామని భక్తులు అంటున్నారు. గోదావరిలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేయాలని కోరుతున్నారు. -
కృష్ణ పుష్కరాల్లో వెల్లివిరిసిన మత సామరస్యం
-
పుష్కర ఏర్పాట్లు ఇలానా! సిగ్గు.. సిగ్గు
కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమంలో కొలువైన సంగమేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్‌లో మహిళా భక్తుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఆదివారం సుమారు 15 వేలకు పైగా భక్తులు ఇక్కడ పుష్కర స్నానాలు చేశారని అంచనా. అయితే, తగిన ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయింది. ప్రధానంగా పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం వస్త్రాలు మార్చుకునేందుకు మహిళలు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. భర్తలు, బంధువులు.. చీరలు, పంచెలు అడ్డుగా పట్టుకుంటే తప్ప దుస్తులు మార్చుకునే పరిస్థితి లేకపోయింది. అధికారులు రోజుకు లక్ష మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించినా.. వేలల్లో వచ్చిన భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి నెలకొంది. - ఆత్మకూరు -
నాగార్జున సాగర్‌కు పెరిగిన భక్తుల రద్దీ
-
అధికార దర్పం!
–అనధికార నెహ్రూనగర్ పుష్కర ఘాట్ నిర్మాణానికి ఎత్తిపోతల పథకం కంకర సరఫరా –శరవేగంగా నిర్మాణ పనులు నెహ్రూనగర్(పగిడ్యాల): అనధికారికంగా నిర్మిస్తున్న నెహ్రూనగర్ పుష్కర ఘాట్‌లో అడుగడుగునా అధికార దర్పం కనిపిస్తోంది. పోలీసు యంత్రాంగంతో పాటు ఇంజినీరింగ్ శాఖ అధికారులు కూడా పరోక్షంగా ఘాట్ నిర్మాణంలో పాలు పంచుకోవడం గమనార్హం. ఇది అధికారిక ఘాట్ కాదని సొంతంగానే నిర్మిస్తున్నామని మాండ్ర ప్రకటించినప్పటికి దీని వెనుక జిల్లా ఇన్చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన ఇచ్చిన మౌఖిక ఆదేశాలతోనే నెహ్రూనగర్ ఘాట్ రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి మెగా ఇంజినీరింగ్ కంపెనీ సిమెంట్ మిశ్రమంతో కూడిన కంకర సరఫరా చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు 200 అడుగులు పొడవు, 30 అడుగులు వెడల్పు ఉండే ప్రదేశంలో సిమెంట్ బెడ్ వేసే పనులను బుధవారం ఉదయం ప్రారంభయ్యాయి. అనధికారికంగా జరుగుతున్న ఈ ఘట్ పనులను మాండ్ర ముఖ్య వర్గీయులు నందికొట్కూరు మార్కెట్‌యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి, నందికొట్కూరు ఎంపీపీ ప్రసాదరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బమ్మ, వైస్‌చైర్మన్ మునాఫ్‌లు ప్రత్యేక పూజలు చేశారు. బ్యాక్‌వాటర్‌కు అతిసమీపంలో జరుగుతున్నా ఈ పనులు నీటి ప్రవాహం పెరిగితే మునిగిపోయే అవకాశం ఉందని మత్య్సకారులు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు. ఘాట్ నిర్మాణానికి ఉపయోగించిన కంకర మిశ్రమంపై ఎత్తిపోతల పథకం మెగా ఇంజినీరింగ్ కంపెనీ సైట్ మేనేజర్ రాముడును సాక్షి వివరణ కోరగా తాను కొన్ని చెప్పేవి ఉంటాయి.. మరికొన్ని చెప్పడానికి వీలుండదన్నారు. కావాలంటే హైదరాబాద్ హెడ్ ఆఫీస్‌కు ఫోన్ చేసి కనుక్కోండని పేర్కొనడం గమనార్హం. -
నీటి ఉధృతికి కొట్టుకుపోయిన ఘాట్
-
నీటి ఉధృతికి కొట్టుకుపోయిన ఘాట్
నల్గొండ: నల్గగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యాం దిగువన నిర్మించిన పుష్కరఘాట్ మంగళవారం రాత్రి నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. సాగర్ డ్యాం నుంచి పుష్కర ఘాట్ల కోసం నీటిని విడుదల చేశారు. దీంతో డ్యాం దిగువన శివాలయం వద్ద పుష్కర ఘాట్ కొంత మేర కూలిపోయింది. అదే విధంగా ఘాట్ కోసం ఏర్పాటు చేసిన కంచె కూడా కొట్టుకుపోయింది. -
పిండ ప్రదానాలకు షెడ్డు నిర్మాణం
గొల్లపూడి(విజయవాడరూరల్) : గొల్లపూడి పుష్కరఘాట్వద్ద యాత్రికుల సౌకర్యార్థం దేవాదాయశాఖ పిండప్రదానాలకు షెడ్డు నిర్మిస్తోంది. కృష్ణానది ఒడ్డున ఈ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించుకునేందుకుగాను రూ.1.70లక్షలతో షెడ్డును నిర్మిస్తోంది. గురువారం షెడ్డునిర్మాణం పనులు ప్రారంభించారు. నిర్మాణం పనుల పర్యవేక్షణ పంచాయతీరాజ్ నిర్వహిస్తోందని పంచాయతీరాజ్ ఏఈ సురేంద్ర తెలిపారు. -
పిండ ప్రదానాలకు షెడ్డు నిర్మాణం
గొల్లపూడి, పుష్కరఘాట్, పిండప్రదానాలు gollapudi, pushkara ghat, pinda pradhanam గొల్లపూడి(విజయవాడరూరల్) : గొల్లపూడి పుష్కరఘాట్వద్ద యాత్రికుల సౌకర్యార్థం దేవాదాయశాఖ పిండప్రదానాలకు షెడ్డు నిర్మిస్తోంది. కృష్ణానది ఒడ్డున ఈ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించుకునేందుకుగాను రూ.1.70లక్షలతో షెడ్డును నిర్మిస్తోంది. గురువారం షెడ్డునిర్మాణం పనులు ప్రారంభించారు. నిర్మాణం పనుల పర్యవేక్షణ పంచాయతీరాజ్ నిర్వహిస్తోందని పంచాయతీరాజ్ ఏఈ సురేంద్ర తెలిపారు. -
పుష్కరాలకు భారీ బందోబస్తు
8,500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది గ్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు పుష్కరఘాట్ల నిర్మాణ పనుల పరిశీలన మట్టపల్లి (మఠంపల్లి): వచ్చే నెల 12 నుంచి 23వ తేదీ వరకు నల్లగొండ జిల్లాలో జరగనున్న కృష్ణా పుష్కరాలకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. 8,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని భద్రతకు ఉపయోగించనున్నట్లు ఆయన వెల్లడించారు. మట్టపల్లి వద్ద కృష్ణా నది తీరంలో నిర్మిస్తున్న ప్రహ్లాద, బాలాజీ, హైలెవల్ వంతెన పక్కన గల పుష్కర ఘాట్లను ఆయన శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భద్రతా చర్యల్లో భాగంగా రెండు రోజులుగా పనులు జరిగే ప్రాంతాలను పరిశీలిస్తున్నామన్నారు. త్వరలోనే కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తామని చెప్పా రు. స్నానఘాట్లు, పార్కింగ్ స్థలాల ఏర్పాటు పూర్తి కాగానే భద్రతా చర్యలను ప్రారంభిస్తామని తెలిపా రు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఒక్క మట్టపల్లిలో 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తుకు ప్రణాళి కలు సిద్ధం చేశామన్నారు. అంతకుముందు ఐజీ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలకవర్గం, అర్చకులు ఐజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వజినేపల్లిలో... వజినేపల్లి(మేళ్లచెర్వు) : మండలంలోని వజినేపల్లి, బుగ్గమాధవరం గ్రామాల వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్ల పనులను శుక్రవారం ఐజీ నాగిరెడ్డి పరిశీలించారు. ఘాట్లు, పార్కింగ్ స్థలాల వద్ద భద్రతాపరమైన చర్యలపై డీఎస్పీ సునీత, సీఐ మధుసూదన్‌రెడ్డితో చర్చించారు. మండంలోని మూడు ఘాట్లకు 972 మంది పోలీసు సిబ్బంది ద్వారా బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట మేళ్లచెర్వు ఎస్ఐ రవికుమార్, సర్పంచ్ ఆవుల నాగలక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు ఫణికుమార్ తదితరులు ఉన్నారు. పుష్కరఘాట్‌ను పరిశీలించిన ఐజీ మహాంకాళీగూడెం (నేరేడుచర్ల) : మండలంలోని మహంకాళీగూడెం పుష్కరఘాట్ పనులను మంగళవారం ఐజీ వై.నాగిరెడ్డి పరిశీలించా రు. ఘాట్ వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పోలీసు అధికారులతో చర్చించారు. ఆయన వెంట ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, మిర్యాలగూడ డీ ఎస్పీ రాంమోహన్‌రావు, నేరేడుచర్ల ఎస్ఐ గోపి తదితరులు ఉన్నారు. దర్శేశిపురంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ.. కనగల్ : మండల కేంద్రంలోని వాగులో, దర్వేశిపు రం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ సమీపంలో నిర్మిస్తు న్న పుష్కరఘాట్లు, మరుగుదొడ్ల పనులను శుక్రవా రం ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పాపారావు పరిశీలించా రు. పనులను సకాలంలో పూర్తి చేయూలని సూచిం చారు. ఆయన వెంట కనగల్ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మోజీబ్, ఏఈ షఫి, నాయకులు ఉమారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. -
చేతకాకుంటే వెళ్లిపోండి
ఇరిగేషన్ అధికారులపై తుమ్మల ఫైర్ భద్రాచలం: ఇరిగేషన్ అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అధికారుల సమక్షంలోనే ఆయన తీవ్ర పదజాలం ఉపయోగించారు. పుష్కర ఘాట్లలో బురదను తీసి, మెట్లకు రంగులు వేయాలని ఆదేశించినా చేయరా.. అని ఇరిగేషన్ ఈఈ రాములను నిలదీశారు. ‘ఈయన పెద్ద పుడుంగని జిల్లా మొత్తం అప్పగిస్తున్నావ్’ అంటూ ఎస్ఈ సుధాకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీకు ఇష్టం లేకపోతే వెళ్లిపోండి’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చం ద్రబాబు జేజమ్మ వచ్చి నా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకోలేరని విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. -
పెద్ద ఘాట్లలో వైద్య శిబిరాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14 నుంచి జరిగే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం వైద్య సౌకర్యాలు కల్పిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆయన శుక్రవారమిక్కడ సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఐదారు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. మొత్తం 106 పుష్కర ఘాట్లు ఉండగా, అందులో 17 ఘాట్లు పెద్దవని చెప్పారు. పెద్ద ఘాట్ల వద్ద 24 గంటలూ వైద్య శిబిరాలు పనిచేస్తాయన్నారు. ఆయా శిబిరాల వద్ద స్పెషలాఫీసర్, ముగ్గురు చొప్పున మెడికల్ ఆఫీసర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, అటెండర్లు పనిచేస్తారని వివరించారు. చిన్న ఘాట్లను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)తో అనుసంధానం చేస్తామన్నారు. 104, 108 వాహనాలు, మందులు, పరికరాలను శిబిరాల వద్ద అందుబాటులో ఉంచుతామన్నారు. ఐదు జిల్లాల్లో పుష్కరాల వద్ద వైద్య సేవలను పర్యవేక్షించేందుకు ఒక్కో జిల్లాకు రాష్ట్రస్థాయి నోడల్ ఆఫీసర్లను నియమిస్తామని, ఆయా జిల్లాల డీఎంహెచ్వోలు పర్యవేక్షిస్తారని చెప్పారు. నీటి కాలుష్యం వల్ల డయేరియా వంటివి వస్తాయని, తొక్కిసలాట, నీళ్లలో మునిగిపోవడం, గుండెపోటు వంటి ఘటనలు సంభవించే అవకాశాలు ఉంటాయని... వీటి బారినపడే వారిని ఇతర ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లనూ అప్రమత్తం చేస్తామని తెలిపారు. 17 పెద్ద పుష్కర ఘాట్లు ఇవే... బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం, కందకుర్తి, సోన్గూడెం, మంచిర్యాల, చెన్నూరు, మల్లూరు, మంగపేట, రాగన్నగూడెం, ముల్లకట్ట, పర్ణశాల, పోచంపాడు, తడపాగులు, కోటి లింగాల, మంథని. వైద్య ఏర్పాట్లపై ప్రణాళిక * తాత్కాలిక బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద వైద్య శిబిరాలు * డీఎంహెచ్‌వో కార్యాలయంలో 24 గంటలూ పనిచేసే జిల్లాస్థాయి పర్యవేక్షణ సెల్ * హైదరాబాద్‌లోని ప్రజారోగ్య కార్యాలయం నుంచి 24 గంటలూ పనిచేసే రాష్ట్రస్థాయి పర్యవేక్షణ సెల్ * వెద్య సేవల కోసం రూ. 2.37 కోట్ల కేటాయింపు. అందులో మందుల కోసం రూ. 1.22 కోట్లు. -
పుష్కర ఘాట్‌ను పరిశీలించిన మంత్రులు
ఏటూరునాగారం: వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెంలో ఉన్న పుష్కరఘాట్‌ను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలు పరిశీలించారు. శుక్రవారం అక్కడికి చేరుకున్న మంత్రులు పుష్కర ఘాట్ పనులపై ఆరా తీశారు. రామన్నగూడెంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగాలమ్మ దేవాస్థానంకు పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో మంత్రులు పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఘాట్ వద్దకు నీటి మళ్లింపు విషయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
గోదావరి పుష్కరఘాట్‌లో విషాదం
రాజమండ్రి: గోదావరి పుష్కరఘాట్‌లో అపశ్రుతి జరిగింది. చేపల వేటకు వెళ్లిన ఒక జాలరి ప్రమాదవశాత్తూ పుష్కరఘాట్‌లో పడి మృతి చెందాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని కోటిలింగాల పుష్కరఘాట్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. రాజమండ్రికి చెందిన కాలపు ధనరాజ్ చేపల వేటకు వెళ్లాడు. అయితే, పుష్కరఘాట్‌లో తవ్విన గుంతలో ప్రమాదవశాత్తూ చిక్కుకుని అతను మృతి చెందాడు. దీంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ధనరాజ్ మృతి చెందాడని, తమకు న్యాయం చేయాలని అతని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. -
జూలై 1 నుంచి గోదావరికి హారతి
* పుష్కరాల కోసం తూ.గోలో 151, ప.గోలో 89 ఘాట్లు * మంత్రి మాణిక్యాలరావు సాక్షి, హైదరాబాద్: గంగా నది తరహాలో గోదావరి నదికీ హరతి ఇచ్చే కార్యక్రమాన్ని జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆరంభించనుంది. పుష్కరాలు ముగిసిన తరువాత కూడా నిత్యం ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు తెలిపారు. హారతి ప్రారంభ కార్యక్రమం రాజమండ్రిలో ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పుష్కర ఏర్పాట్లపై ఆయన శనివారం ‘సాక్షి’ తో మాట్లాడారు. పుష్కరాలకు సంబంధించిన పనులు జూలై ఐదో లోగా పూర్తవుతాయని చెప్పారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులతో పాటు మొత్తం పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 1,650 కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 151, పశ్చిమ గోదావరి 89 ఘాట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. పుష్కరాలకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు ఈ నెల 29న ఢిల్లీకి వెళుతున్నట్టు చెప్పారు. పార్లమెంట్ సభ్యులందరితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లకు ఆహ్వానప్రతాలు అందిస్తున్నట్లు తెలిపారు. పిండప్రదాన పూజలకు ఏర్పాటు పుష్కరాల సందర్భంగా పిండ ప్రదాన పూజ కోసం ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసినట్టు మంత్రి చెప్పారు. పుష్కరాలకు పటిష్ట బందోబస్తు జూలై 14 నుంచి 25 వరకూ జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. భద్రతా చర్యల్లో భాగంగా ‘4 జీ’ టెక్నాలజీతో పని చేసే సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లు వంటి ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని చెప్పారు. పుష్కర ఘాట్‌వద్ద తిరుమలేశుని దర్శనం తిరుమల: గోదావరి పుష్కర భక్తులకు వేంకటేశ్వర స్వామివారిని కనులారా దర్శించుకునే భాగ్యం టీటీడీ కల్పిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం రాజమండ్రిలోని మున్సిపల్ మైదానంలో శ్రీవారి నమూనా ఆలయంతోపాటు, నమూనా విగ్రహాన్ని నిర్మిస్తోంది. జూలై 14 నుంచి 25వ తేదీ వరకు పుష్కరాల్లో ఈ ఆలయంలో అన్ని పూజా కార్యక్రమాలను తిరుమల తరహాలోనే నిర్వహించనున్నారు. ఉదయం 4 గంటలకు సుప్రభాతం మొదలు రాత్రి 10 గంటల వరకు మూలమూర్తికి నిర్వహించే అన్ని పూజలు, కైంకర్యాలు, ఆర్జిత సేవలన్నీ వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తారు.