పుష్కరాలకు భారీ బందోబస్తు
Published Sat, Jul 16 2016 8:13 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
8,500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది
గ్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు
పుష్కరఘాట్ల నిర్మాణ పనుల పరిశీలన
మట్టపల్లి (మఠంపల్లి): వచ్చే నెల 12 నుంచి 23వ తేదీ వరకు నల్లగొండ జిల్లాలో జరగనున్న కృష్ణా పుష్కరాలకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. 8,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని భద్రతకు ఉపయోగించనున్నట్లు ఆయన వెల్లడించారు. మట్టపల్లి వద్ద కృష్ణా నది తీరంలో నిర్మిస్తున్న ప్రహ్లాద, బాలాజీ, హైలెవల్ వంతెన పక్కన గల పుష్కర ఘాట్లను ఆయన శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భద్రతా చర్యల్లో భాగంగా రెండు రోజులుగా పనులు జరిగే ప్రాంతాలను పరిశీలిస్తున్నామన్నారు. త్వరలోనే కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తామని చెప్పా రు. స్నానఘాట్లు, పార్కింగ్ స్థలాల ఏర్పాటు పూర్తి కాగానే భద్రతా చర్యలను ప్రారంభిస్తామని తెలిపా రు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఒక్క మట్టపల్లిలో 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తుకు ప్రణాళి కలు సిద్ధం చేశామన్నారు. అంతకుముందు ఐజీ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలకవర్గం, అర్చకులు ఐజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
వజినేపల్లిలో...
వజినేపల్లి(మేళ్లచెర్వు) : మండలంలోని వజినేపల్లి, బుగ్గమాధవరం గ్రామాల వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్ల పనులను శుక్రవారం ఐజీ నాగిరెడ్డి పరిశీలించారు. ఘాట్లు, పార్కింగ్ స్థలాల వద్ద భద్రతాపరమైన చర్యలపై డీఎస్పీ సునీత, సీఐ మధుసూదన్‌రెడ్డితో చర్చించారు. మండంలోని మూడు ఘాట్లకు 972 మంది పోలీసు సిబ్బంది ద్వారా బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట మేళ్లచెర్వు ఎస్‌ఐ రవికుమార్, సర్పంచ్ ఆవుల నాగలక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు ఫణికుమార్ తదితరులు ఉన్నారు.
పుష్కరఘాట్‌ను పరిశీలించిన ఐజీ
మహాంకాళీగూడెం (నేరేడుచర్ల) : మండలంలోని మహంకాళీగూడెం పుష్కరఘాట్ పనులను మంగళవారం ఐజీ వై.నాగిరెడ్డి పరిశీలించా రు. ఘాట్ వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పోలీసు అధికారులతో చర్చించారు. ఆయన వెంట ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, మిర్యాలగూడ డీ ఎస్పీ రాంమోహన్‌రావు, నేరేడుచర్ల ఎస్‌ఐ గోపి తదితరులు ఉన్నారు.
దర్శేశిపురంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ..
కనగల్ : మండల కేంద్రంలోని వాగులో, దర్వేశిపు రం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ సమీపంలో నిర్మిస్తు న్న పుష్కరఘాట్లు, మరుగుదొడ్ల పనులను శుక్రవా రం ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ పాపారావు పరిశీలించా రు. పనులను సకాలంలో పూర్తి చేయూలని సూచిం చారు. ఆయన వెంట కనగల్ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ మోజీబ్, ఏఈ షఫి, నాయకులు ఉమారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
Advertisement
Advertisement