విజయవాడ : కృష్ణా పుష్కరాలు నేపథ్యంలో పద్మావతి ఘాట్లో శనివారం దొంగలు హల్చల్ చేశారు. నదిలో పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తుల దృష్టి మరల్చి దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. అలా వచ్చిన భక్తులకు చెందిన రూ. 4500, మూడు తులాల బంగారంతోపాటు సెల్ ఫోన్ అపహరించుకుని పోయారు. దీంతో భక్తులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.