![Five Awards For AP In Marine Fish Products - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/19/AP-GOVT.jpg.webp?itok=MD3SxINO)
కైకలూరు(ఏలూరు జిల్లా): నేషనల్ ఫిషరీష్ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) ఏటా నవంబర్ 21న ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అందించే అవార్డుల్లో ఏపీకి 5 విభాగాల్లో చోటు దక్కింది. ఏ, బీ కేటగిరీలుగా ఎంపిక చేసిన జాబితాను ఎన్‌ఎఫ్‌డీబీ శుక్రవారం ప్రకటించింది.
ఏపీలో ఉత్తమ మెరైన్ జిల్లాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉత్తమ మెరైన్ చేపల రైతుగా ఏలూరు జిల్లా మట్టగుంటకి చెందిన తిరుమాని నాగరాజు, ఉత్తమ హేచరీగా కాకినాడ జిల్లాకు చెందిన సప్తగిరి హేచరీస్, ఉత్తమ ల్యాబ్‌గా తూర్పు గోదావరి జిల్లా రెడ్డి డ్రగ్స్.. ల్యాబ్‌కు చెందిన నరేష్‌కుమార్, ఉత్తమ ఆర్టెమియా టెక్నాలజీ ఇన్ఫ్యూషన్‌గా కవితారెడ్డికి అవార్డులు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment