మత్స్యకారుల ఆచూకి గల్లంతు?
- యలమంచిలి సీఐకు బంధువుల ఫిర్యాదు
యలమంచిలి : చేపలవేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారుల ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆది వారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల నుంచి సముద్రమార్గంలో బోటు పై ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెంకు చెందిన మైలపల్లి కాశీరావు, మైలపల్లి కోటయ్య ఈ నెల 19న బయలుదేరారు. శనివారం ఉదయానికే స్వగ్రామానికి చేరుకోవాలి.
మచిలీపట్నం తీరానికి వచ్చే వరకు వారు ఫోన్‌లో మాట్లాడారని, అప్పటి నుంచి సమాచారం లేకుండా పోయిం దని కుటుంబ సభ్యులు ఆదివారం యలమంచిలి సీఐ కె.వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఈ విషయాన్ని పెంటకోట, కాకినాడ మెరైన్ పోలీస్టేషన్లు, జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన కాశీరావు, కోటయ్య నెల రోజుల క్రితం చేపల వేటకు ప్రకాశం జిల్లా చీరాల వెళ్లారు. అక్కడి నుంచి శుక్రవారం ఉదయం 7 గంటలకు బోటుపై బంగారమ్మపాలెం బయలుదేరారు. ఆదివారం వరకు రాకపోవడంతో కుటుంబీకు ల్లో ఆందోళన ఎక్కువైంది. ఆదివారం రాత్రి వరకు మత్స్యకారుల ఆచూకి తెలియకపోవడంతో సంబంధిత కుటుంబీకు లు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.