చేపలకు వల వేస్తే 100 కేజీల మొసలి పడింది! | Crocodile In Snare Instead Of Fish In Mahabubabad District | Sakshi
Sakshi News home page

చేపలకు వల వేస్తే 100 కేజీల మొసలి పడింది!

Published Thu, Apr 1 2021 2:48 PM | Last Updated on Thu, Apr 1 2021 2:48 PM

Crocodile In Snare Instead Of Fish In Mahabubabad District - Sakshi

సాక్షి, గూడూరు(వరంగల్‌): మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బొమ్మాయికుంట ఊర చెరువులో చేపల కోసం వేసిన వలలో ఓ భారీ మొసలి చిక్కింది. మత్స్యకారులు పెసరి శివ, స్వామి, రాములు ఎప్పటిలాగానే మంగళవా రం రాత్రి చేపలు పట్టడం కోసం వలలు వేసి వెళ్లారు. బుధవారం వలలో పడిన చేపలను బయటికి తీసేందుకు రాగా భారీ మొసలి కనిపించింది. సుమారు 100 కిలోలకు పైగా ఉన్న మొసలిని బంధించేందుకు రెండు గంటల పాటు శ్రమించారు. అనంతరం అటవీ శాఖ ఉద్యోగులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది మొసలిని పాకాల సరస్సులో వదిలేందుకు జీపులో తీసుకెళ్లారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement