Australia FisherMan Risks His Life for Son's Hat, Watch Viral Video - Sakshi
Sakshi News home page

వీడియో: ఎదురుగా భారీ మొసలి.. అడుగు ముందుకు పడ్డా చావే! ఎందుకలాగంటే..

Published Tue, May 10 2022 7:25 PM | Last Updated on Wed, May 11 2022 8:46 AM

Australia Man Face To Face Huge Crocodile For Hat Viral - Sakshi

Viral Video: మనిషికి ఏదో ఒక భయం ఉండడం సహజం. అలాంటిది చావు ఎదురుగా దూసుకొస్తుంటే.. బెదరకుండా ఉండగలడా?. ఇక్కడో పెద్దాయన అడుగు దూరంలో ఉన్నా బెదరలేదు మరి!. 

ఓ వ్యక్తి తన తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లాడు. గాలానికి పడ్డ చేపను ఆ కొడుకు ఒడ్డుకు లాగుతుంటే.. దానిని అనుసరిస్తూనే నాలుగు మీటర్ల పొడవున్న ఓ భారీ మొసలి ఒడ్డు వైపు వస్తోంది. అది చూసి కంగారులో ఆ కొడుకు టోపీ కింద పడేసుకున్నాడు. మొసలి దాదాపుగా ఒడ్డు మీదకు వచ్చేసింది. ఆ క్షణం.. అక్కడొక భయానక వాతావరణం కనిపించింది. అయితేనేం తన కొడుకు టోపీ కోసం ఓ అడుగు ముందుకేశాడు ఆ పెద్దాయన. 

అడుగు దూరంలోని మొసలి-ఆ వ్యక్తి ఎదురుపడ్డ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చేతిలో కర్రతో వెంటనే వెనక్కి రావడం, ఆ మొసలి ముందకు వచ్చే ప్రయత్నం చేయకపోవడంతో పెద్దాయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఆస్ట్రేలియాలోని కాకాడులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒడ్డున్న నిల్చుని అదంతా చూస్తున్న కొందరు.. చేపను వదిలేయాలని అరుస్తున్నా ఆ వ్యక్తి రోస్‌కేర్ల్‌ చేపను వదలకపోవడం, అతని తండ్రి ఆ టోపీ తీసుకోవడం పెద్ద సాహసంగా నిలిచింది ఆ ప్రాంతంలో. ఈ అనుభవంతో..  కొన్నాళ్లపాటు ఆ తండ్రీకొడుకులిద్దరూ చేపల వేటకు వెళ్లొద్దని నిర్ణయించుకున్నారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement