మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్డు మీదకి వరద నీరు పోటెత్తుతుంది. తాజాగా రత్నగిరి జిల్లాలో నీటి ప్రవాహంలో రోడ్డు మీదకు ఓ భారీ మొసలి కొట్టుకొచ్చింది. రోడ్డు మీద అర్ధరాత్రి వాహనదారుల ముందే పాకుతూ కనిపించింది. కొంకణ్ లోని చిప్లూన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
భారీ మొసలి రోడ్డుపై నెమ్మదిగా నడుచుకుంటూ రావడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు భయందోళనకు గురయ్యారు. కొందరు వాహనదారులు మొసలిని వెంబడిస్తూ వీడియో తీశారు. కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసినవాళ్లు సమీపంలోని పెద్ద చెరువు ఉందని బహుశా అక్కడి నుంచి బయటకు వచ్చిందని అంటున్నారు.
#Maharashtra : Video of Crocodile Roaming Ratnagiri Roads Goes Viral After Heavy Rain; Suspected to Have Come From Shiv River.#Ratnagiri #chiplun #Crocodile #Monsoon pic.twitter.com/CSnwB3TgPS
— Pune Pulse (@pulse_pune) July 1, 2024
Comments
Please login to add a commentAdd a comment