hat
-
Independence Day: ప్రధాని మోదీ తలపాగా ప్రత్యేకత ఇదే
దేశంలోని వాడవాడలా ఈరోజు 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ 11వ సారి జెండాను ఎగురవేశారు. ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ తన వేషధారణ, ప్రత్యేక తలపాగాతో వార్తల్లో నిలుస్తుంటారు.ప్రధాని మోదీ తలపాగా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. మోదీ తన మొదటి టర్మ్ (2014) నుండి తన మూడవ టర్మ్ (2024) వరకు ప్రతి సంవత్సరం వేర్వేరు తలపాగాలు ధరిస్తూ కనిపించారు. ఈ ఏడాది ప్రధాని మోదీ తలపాగా స్టైల్ డిఫరెంట్‌గా ఉంది. ఈ స్వాతంత్య్ర దినోత్సవాన ప్రధాని మోదీ కాషాయి, ఆకుపచ్చ, పసుపు రంగులతో కూడిన రాజస్థానీ తలపాగాలో కనిపించారు. తెలుపు రంగు కుర్తా-పైజామాతో పాటు నీలిరంగు కోటు ధరించాడు.ప్రధాని మోదీ తలపాగాలో పలు రంగులు ఉన్నప్పటికీ, కాషాయ రంగు ఎక్కువగా కనిపిస్తోంది. కాషాయ వర్ణం శ్రీరామునికి ఇష్టమైన రంగుగా చెబుతారు. మోదీ ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ తలపాగా ధరించి శ్రీరామునిపై తనకున్న భక్తిని చాటుకున్నారు. -
హిజాబ్ సర్క్యులర్‌పై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: తాము ధరించే దుస్తులను ఎంచుకొనే స్వేచ్ఛ విద్యారి్థనులకు ఉండాలని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. ఎలాంటి దుస్తులు ధరించాలో వారు నిర్ణయించుకోవచ్చని ఉద్ఘాటించింది. తమ విద్యా సంస్థ ప్రాంగణంలో విద్యార్థినులు హిజాబ్, బుర్ఖా, టోపీ, నఖాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ముంబైలోని ఎన్జీ ఆచార్య, డీకే మరాఠీ కాలేజీ జారీ చేసిన సర్క్యులర్‌పై న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. కాలేజీ సర్క్యులర్‌ను సమరి్థస్తూ బాంబే హైకోర్టు జూన్ 26న ఇచి్చన తీర్పును సవాలు చేస్తూ జైనాబ్ అబ్దుల్ ఖయ్యూంతోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఎన్జీ ఆచార్య, డీకే మరాఠీ కాలేజీని నిర్వహిస్తున్న చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీపై ఆగ్రహం వ్యక్తంచేసింది. కాలేజీ క్యాంపస్‌లో బొట్టుబిళ్ల, తిలకం ధరించడం కూడా నిషేధిస్తారా? అని ప్రశ్నించింది. హిజాబ్, బుర్ఖా వంటివి ధరించకుండా ఆంక్షలు విధిస్తే విద్యారి్థనుల సాధికారత ఎలా సాధ్యమని నిలదీసింది. -
టోపీ, హెల్మెట్లు వల్ల బట్టతల వస్తోందా? నిపుణులు ఏమంటున్నారంటే..
చాలామంది తలకు టోపీ ధరిస్తారు. కొందరూ యువకులు ఫ్యాషన్‌గా ధరించగా మరికొందరూ ఎండ నుంచి రక్షణ కోసం పెట్టుకుంటారు. ఇక హెల్మెట్లంటారా బండి డ్రైవ్ చేయాలంటే తప్పదు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం హెల్మట్ తప్పనసరిగా ధరించాల్సిందే. వెనుక కూర్చొన్నవాళ్లు కూడా పెట్టుకోవాల్సిందే. అయితే ఇవి తలకు పెట్టడం వల్లే జుట్టు ఊడిపోతోందని చాలా మంది అనుకుంటారు. అవి పెట్టడం వల్ల తలలో చెమట పట్టి త్వరితగతిన జుట్టు రాలి బట్టతల వస్తుందని చాలామంది భావిస్తున్నారు. అయితే ఇది ఎంతవకు నిజం?. నిజంగానే టోపీ, హెల్మెట్లు ధరిస్తే బట్టతల వస్తుందా? అయితే వైద్యుల మాత్రం అదంతా అపోహ అని తేల్చి చెబుతున్నారు. టోపీలు పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోదని వైద్యులు చెబుతున్నారు. బట్టతల రావడానికి అనేక కారణాలు ఉంటాయని దానికి, ఈ టోపీలకు ఎలాంటి సంబంధం లేదని వివరిస్తున్నారు. టోపీలు పెట్టుకోవడం వల్ల జుట్టుకు రక్షణ లభిస్తుందే తప్ప ఎలాంటి సమస్యలు ఉండవని అన్నారు. అలాగే ఆరుబయట ఎండలోకి వెళ్ళినప్పుడు... ఆ ఎండకి మాడు వేడెక్కిపోతుంది. అలా వేడెక్కకుండా ఉండడం కోసమే టోపీని ధరిస్తూ ఉంటారు. అంతే తప్ప టోపీ వల్ల జుట్టు రాలిపోవడం జరగదు. అలా అని మరీ బిగుతుగా ఉండే టోపీలు వాడకపోవడమే మంచిది. కాస్త జుట్టుకు గాలి తగులుతూ ఉండడం చాలా అవసరం. జుట్టు తీవ్రంగా రాలిపోవడానికి, బట్టతల రావడానికి టోపీ ఏనాటికే కారణం కాదని అన్నారు నిపుణులు. ఇక హెల్మట్లు కూడా మన రక్షణ కోసం ట్రాఫిక్ నిబంధనల ప్రకారం తప్పనసరిగా ధరించాల్సిందే. అయితే దీనికి జుట్టు రాలడానికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు. తలకు సరిపడ హెల్మట్ ధరించండి, దీంతోపాటు అదే పనిగా తలపై హెల్మెట్ ధరించకండి అంటే మధ్య మధ్యలో తీస్తు కాస్త తలకు భారం తగ్గించమంటున్నారు. అలాగే లాంగ్ డ్రైవ్ చేసేవాళ్లు కూడా విరామం తీసుకుంటూ వెళ్లండని సూచిస్తున్నారు నిపుణులు ఎందుకు రాలిపోతుందంటే.. హఠాత్తుగా జుట్టు రాలిపోతే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఒక్కొసారి కొన్ని వ్యాధులకు ఇది సంకేతం కూడా కావొచ్చు. దీంతోపాటు మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లను ఉంటే వాటిని మానేసేందుకు ప్రయత్నించాలి. అలాగే తండ్రికి బట్టతల ఉన్నా... భవిష్యత్తులో కొడుకులకు, మనవళ్లకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలాగే హార్మోన్లలో హఠాత్తుగా విపరీతమైన మార్పులు వచ్చినా కూడా జుట్టు రాలిపోతుంది. ఇవిగాక గర్భ నిరోధక మాత్రలు వాడే మహిళల్లో హార్మోన్ల మార్పులు అధికంగా వస్తాయి. ఇలాంటి వారికి కూడా వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. అంతేగాక వాతావరణ కాలుష్యం వల్ల కూడా జుట్లు రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థైరాయిడ్ సమస్యలతో బాధపడే మహిళలు, పురుషల్లో జుట్టు ఎక్కువగా ఊడిపోయే అవకాశం ఉంది. జుట్టు చక్కగా పెరగాలంటే.. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. సమయానికి నిద్రపోవడం, సమయానికి తినడం చాలా ముఖ్యం. మీ జీవన శైలి ఎంత ఆరోగ్యకరంగా ఉంటే జుట్టు కూడా అంతే బలంగా పెరుగుతుంది. వ్యాయామం చేయడం వల్ల తలకు రక్తప్రసరణ జరిగి జుట్టు కుదుళ్లు బలంగా ఉంటాయి. తత్ఫలితంగా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు రాలుతున్నప్పుడే వైద్యులను సంప్రదిస్తే సమస్యను అధిగమించొచ్చు. చాలా జుట్టు కోల్పోక ముందే వైద్యలను సంప్రదించడం మంచిది. అంతేగాక జుట్టు మురికి పట్టకుండా వారానికి మూడుసార్లు తల స్నానం చేయాలి. ఎప్పటికప్పుడూ నూనెలతో మర్దనా చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది. అందంగా ఉంటుంది. (చదవండి: పెదవులు గులాబీ రేకుల్లా మెరవాలంటే ఇలా చేయండి!) -
వైరల్ వీడియో: అడుగు ముందుకు పడ్డా చావే! అంతలో..
Viral Video: మనిషికి ఏదో ఒక భయం ఉండడం సహజం. అలాంటిది చావు ఎదురుగా దూసుకొస్తుంటే.. బెదరకుండా ఉండగలడా?. ఇక్కడో పెద్దాయన అడుగు దూరంలో ఉన్నా బెదరలేదు మరి!. ఓ వ్యక్తి తన తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లాడు. గాలానికి పడ్డ చేపను ఆ కొడుకు ఒడ్డుకు లాగుతుంటే.. దానిని అనుసరిస్తూనే నాలుగు మీటర్ల పొడవున్న ఓ భారీ మొసలి ఒడ్డు వైపు వస్తోంది. అది చూసి కంగారులో ఆ కొడుకు టోపీ కింద పడేసుకున్నాడు. మొసలి దాదాపుగా ఒడ్డు మీదకు వచ్చేసింది. ఆ క్షణం.. అక్కడొక భయానక వాతావరణం కనిపించింది. అయితేనేం తన కొడుకు టోపీ కోసం ఓ అడుగు ముందుకేశాడు ఆ పెద్దాయన. అడుగు దూరంలోని మొసలి-ఆ వ్యక్తి ఎదురుపడ్డ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేతిలో కర్రతో వెంటనే వెనక్కి రావడం, ఆ మొసలి ముందకు వచ్చే ప్రయత్నం చేయకపోవడంతో పెద్దాయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఆస్ట్రేలియాలోని కాకాడులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒడ్డున్న నిల్చుని అదంతా చూస్తున్న కొందరు.. చేపను వదిలేయాలని అరుస్తున్నా ఆ వ్యక్తి రోస్కేర్ల్ చేపను వదలకపోవడం, అతని తండ్రి ఆ టోపీ తీసుకోవడం పెద్ద సాహసంగా నిలిచింది ఆ ప్రాంతంలో. ఈ అనుభవంతో.. కొన్నాళ్లపాటు ఆ తండ్రీకొడుకులిద్దరూ చేపల వేటకు వెళ్లొద్దని నిర్ణయించుకున్నారట. View this post on Instagram A post shared by Scott Roscarel (@nuffblokescotty) -
Mad Hatterpillar: ఈ గొంగళి పురుగుకు ఐదు తలలు..!
రావణుడికి ఎన్ని తలలు? పది. బ్రహ్మకు? నాలుగు.. మరి, గొంగళి పురుగుకు..? ఒకటి..! ఇక్కడే పప్పులో కాలు వేశారు. అందరూ అనుకున్నట్లు గొంగళి పురుగుకు ఒక తల కాదు, ఐదు తలలు ఉంటాయి. కానీ, కొన్ని మాత్రమే వాటిని ఉంచుకుంటాయి. చాలావరకు వదిలేస్తుంటాయి. కారణం, అవి చచ్చిన తలలు కాబట్టి. గొంగళి పురుగు రూపాంతరం చెంది సీతాకోక చిలుకగా మారుతుందనే విషయం తెలిసిందే. అలా రూపాంతరం చెందే ముందు మరో పదమూడు రూపాంతరాలు చెందుతుందట. ఇలా ఈ రూపాంతరం చెందే ప్రతిసారి వాటి పాత చర్మాన్ని వదిలి.. కొత్త చర్మాన్ని ధరిస్తాయి. ఈ క్రమంలోనే వాటి తల భాగం కూడా మారుతుంది. మారే తలను కొన్ని గొంగళి పురుగులు ఓ టోపీలా వాటి తలపైనే పెట్టుకుంటే, కొన్ని వదిలేస్తుంటాయి. అలా సుమారు ఐదు తలల వరకు ధరించగలవు. ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు చెందిన ఉరాబా లూజెన్స్ జాతికి చెందిన గొంగళి పురుగులు ఇలా చేస్తాయి. వీటికి ‘మ్యాడ్ హాటర్పిల్లర్’ అని పేరు. ఇతర జీవుల నుంచి తమని తాము పెద్దదిగా చూపిస్తూ, భయపెట్టడానికి కొన్ని ఈ తలల టోపీని ధరిస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే, ఇవి ఎక్కువ కాలం నిలువవని, విరిగిపోతాయని, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమని వారు అంటున్నారు. ఏది ఏమైనా, ఈ హ్యాటర్ పిల్లర్‌గా భలే బాగుంది కదూ! చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! -
బాప్రే! టోపీపై ఏకంగా 735.. ‘గుడ్డు’ రికార్డు!
డజను గుడ్లు పగలకుండా షాప్ నుంచి ఇంటికి తీసుకురావడానికి తలమునకలైపోతాము. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా 735 గుడ్లను తల టోపీపై ఉంచుకుని, అవి పగలకుండా నడిచి అందరినీ అబ్బురపరిచాడు. తన టాలెంట్‌తో ప్రపంచ రికార్డు కొట్టాడు కూడా. గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చదవండి: లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఏకంగా రొటేటింగ్ హౌస్ కట్టించాడు!! పశ్చిమ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌కు చెందిన గ్రెగరీ దా సిల్వా అనే వ్యక్తి ‘ఎగ్ మ్యాన్’గా అందరికీ సుపరిచితుడు. అందుకు ఒక పెద్ద హిస్టరీనే ఉంది. ప్రపంచమంతా తిరిగి తన ట్యాలెంట్‌ను వివిధ దేశాల్లో ప్రదర్శించాడట. అంతేకాకుండా పలు టెలివిజన్ షోలలో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. దీనితో అతడు వరల్డ్ ఫేమస్ ఎగ్‌మ్యాన్‌గా అందరికీ గుర్తుండిపోయాడు. చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!! ఈ వీడియోలో ఇతను ధరించిన టోపీపై గుడ్లన్నింటినీ అతికించడానికి మూడు రోజుల టైం పట్టిందట. చైనాలో సీసీటీవీ ఛానెల్ నిర్వహించిన గిన్నీస్ వరల్డ్ రికార్డు స్పెషల్ షోలో దీనిని తలపై పెట్టుకుని కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ ప్రదర్శించాడు. దీనిని చూసిన గిన్నీస్ రికార్డు అధికారులు ‘వావ్’అనకుండా ఉండలేక పోయారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక గుడ్లు సింగిల్ టోపీపై ధరించిన మొదటి వ్యక్తిగా గిన్నీస్ రికార్డులో స్థానం సంపాధించుకున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో ప్రశంశల్లో ముంచెత్తుతున్నారు. ‘ఇది చాలా ఇమ్ప్రెస్సివ్గా ఉంది’ అని ఒకరు, ‘మొత్తం ఎగ్స్ బరువు ఎంత ఉంటుందని’ మరొకరు సరదాగా కామెంట్ చేశారు. వేల సంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..! View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
ఛీ..ఛీ మీకిదేం పాడు బుద్ది
ఇస్లామాబాద్: దౌత్యవేత్త అంటే ఎంతో బాధ్యతగా మెలగాలి. ఓ దేశ పరువు ప్రతిష్టలు వారి భుజాల మీద ఉన్నట్లు అర్థం. అందుకే వారు తమ మాటలు, చేతలు విషయంలో చాగా జాగ్రత్తగా ఉండాలి. స్వదేశంలో ఎలా ఉన్నా ఏం కాదు.. కానీ విదేశాలకు వెళ్లినప్పడు ఏ చిన్న తప్పు చేసినా.. దేశ ప్రతిష్టకు భంగం కలగకమానదు. అలాంటిది పాకిస్తాన్ దౌత్యవేత్తలు ఇద్దరు విదేశీ పర్యటనలో తన చేతివాటం చూపారు. చాక్లెట్స్, టోపీ దొంగిలించి అడ్డంగా బుక్కయ్యారు. దక్షిణ కొరియా పర్యటనలో సదరు అధికారులు ఈ పని చేశారు. కొరియా టైమ్స్ రిపోర్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు పాక్ దౌత్యవేత్తలు ఈ ఏడాది జనవరి 10న, ఫిబ్రవరి 23న దక్షిణ కొరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా తొలుత కొరియా వెళ్లిన అధికారి సుమారు 750 రూపాయలు విలువ చేసే టోపి దొంగతనం చేయగా.. మరొకరు సుమారు వంద రూపాయలు విలువ చేసే చాక్లెట్స్ దొంగిలించినట్లు కొరియా అధికారులు తెలిపారు. ఇక అధికారుల చేతి వాటానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీకెమరాల్లో రికార్డయ్యాయి. ఇక దొంగతనం జరిగిన షాపు యమజానులు దీని గురించి పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో సదరు అధికారుల చేతి వాటం బయటపడింది. దర్యాప్తు తరువాత, దౌత్యపరమైన ప్రోటోకాల్ కారణంగా అధికారులు సదరు నిందితులపై కేసు బుక్ చేయకుండా వదిలేశారు. దౌత్య సంబంధాలపై వియన్నా కన్వెన్షన్ ప్రకారం, దౌత్యవేత్తలు, వారి కుటుంబాలు తమ ఆతిథ్య దేశంలో అరెస్టు, నిర్బంధం, నేరారోపణల నుంచి మినాహాయింపు పొందవచ్చు. చదవండి: పావురంపై ఎఫ్ఐఆర్ నమోదు..ఎందుకో తెలుసా? -
నల్ల గౌన్లు, టోపీలకు చెల్లు!
లక్నో: కాన్పూర్ ఐఐటీ విద్యార్థులు తమ స్నాతకోత్సవం సందర్భంగా గురువారం భారత సంప్రదాయాలు ఉట్టిపడేలా కుర్తా – పైజామా, కుర్తా – సల్వార్‌లను ధరించారు. బ్రిటిష్ కాలం నాటి నల్లటి కోట్లు, తలపై టోపీలను దూరం పెట్టారు. ‘దేశంలో తొలిసారి ఐఐటీలో విద్యార్థులు బ్రిటిష్ కాలం నాటి గౌన్లు, టోపీలు కాకుండా పైజామాలు, సల్వార్లు ధరించి తమ పట్టాలు పొందారు. తమ తమ కోర్సులను సూచించేలా వేర్వేరు రంగుల్లో స్టోల్స్(స్కార్ఫ్ లాంటి వస్త్రాలు)ను కూడా ధరించారు’ అని ఐఐటీ డైరెక్టర్ ప్రొ.ఇంద్రాణిల్ మన్నా తెలిపారు. భవిష్యత్తులో జరిగే స్నాతకోత్సవాల్లో కూడా విద్యార్థులు భారత సంప్రదాయ దుస్తులే వేసుకుంటారని అన్నారు. 673 మంది బీటెక్, 136 మంది బీఎస్ విద్యార్థులు టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ నుంచి పట్టాలు అందుకున్నారు. -
ఈ బుడ్డోడు ట్రంప్‌కు వీర ఫ్యాన్!
కాలిఫోర్నియా: డొనాల్డ్ ట్రంప్.. ఈ పేరు ఇప్పుడు మారుమ్రోగుతోంది. అంతకన్నా ఎక్కువగా ఈ ఎన్నికల్లో ఆయన నినాదం 'మేక్ అమెరికా ప్రైడ్ ఎగైన్' ఇప్పుడు ఎవరి నోట్లో చూసినా నానుతోంది. టీషర్ట్లు, క్యాప్‌లు ఇలా అవకాశం ఉన్న ప్రతిచోటా ఈ నినాదం వెలుగుతోంది. అయితే ట్రంప్ నినాదంతో ఉన్న క్యాప్‌ను ధరించొద్దని ఓ ఎలిమెంటరీ స్కూల్ జారీ చేసిన ఆజ్ఙను ఓ తొమ్మిదేళ్ల బాలుడు లెక్కచేయకుండా వార్తల్లో నిలిచాడు. కాలిఫోర్నియాలోని గిన్స్బర్గ్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న లొగాన్ అట్రీకి ట్రంప్ అంటే అభిమానం. దీంతో గత వారం స్థానికంగా ట్రంప్ ర్యాలీ సందర్భంగా స్కూల్‌కు డుమ్మా కొట్టి మరీ వెళ్లాడు. అక్కడే ర్యాలీలో ట్రంప్ నినాదంతో ఉన్న ఓ క్యాప్‌ను కొనుగోలు చేశాడు. అయితే.. ఆ క్యాప్ పెట్టుకొని స్కూల్‌కు వెళ్లిన అట్రీకి స్కూల్ సిబ్బంది అడ్డు చెప్పారు. ఇలాంటి చర్యలతో మిగతా విద్యార్థులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉందని చెప్పి అతనికి సర్థి చెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఆ క్యాప్‌ను తీసేయడానికి మాత్రం అట్రీ ఒప్పుకోలేదు. చివరికి స్కూల్ వైస్ ప్రిన్సిపల్ వచ్చి అట్రీకి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. అక్రమ వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ విధానాలంటే తనకు ఇష్టమని అట్రీ స్థానిక మీడియాతో మాట్లాడుతూ తెలిపాడు. పెద్దయ్యాక పొలిటికల్ లీడర్‌ను అవుతానంటూ చెబుతున్న ఈ కుర్రాడు.. తల్లిదండ్రులు వేరే క్యాప్ కొనిచ్చిన పెట్టుకోవటం లేదట. స్కూల్ యాజమాన్యం ఏమనుకుంటుంది.. తోటి విద్యార్థులు ఏమనుకుంటున్నారు అనే విషయాలతో తనకు సంబంధం లేదని చెబుతున్నాడు. -
ప్రియురాలి సంతోషం కోసం..
బీజింగ్: ప్రియురాలి కోసం ఎంతటి సాహసానికైనా తెగించే వెండితెర హీరోలను మించి పోయాడు ఈ చైనా కుర్రాడు. ప్రియురాలు ధరించిన హ్యట్(టోపీ) కోసం లైఫ్ రిస్క్ చేశాడు. ప్రేమికుల రోజుకు ముందురోజు జరిగిన ఈ ఘటన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ చైనాలోని జింజి పర్వతాల అందాలను వీక్షించడానికి ఓ జంట వచ్చింది. అక్కడ వీచిన బలమైన గాలులకు ప్రియురాలి హ్యాట్ ఎగిరిపోయి కొండ అంచులో పడిపోయింది. దీంతో ఆమె అప్సెట్ కాకూడదు అనుకున్నాడో లేక క్యాప్ ఖరీదైందో గాని ప్రాణాలకు తెగించి మరీ క్యాప్‌ను తీసుకొచ్చాడు ప్రియుడు. పట్టు తప్పితే అతడు 1640 అడుగుల లోతులోని లోయలో పడిపోయే అవకాశం ఉన్నా చాకచక్యంగా క్యాప్ తీసుకొని కొండెక్కాడు. పేరు తెలియని ఈ ప్రేమికుడు చేసిన సాహసం అక్కడివారిని మునివేళ్ల మీద నిలబడేలా చేసింది. కొండ పైకి వస్తున్న అతన్ని అక్కడి వారు చప్పట్లతో అభినందించారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఆ పర్యాటక ప్రదేశంలోని అధికారులు మాత్రం ఇలాంటి చర్యలు ఏ మాత్రం సమర్థనీయం కాదని, చర్యలు తీసుకుంటామంటున్నారు. అంత కష్టపడి క్యాప్ తీసుకొచ్చిన ఆ కుర్రాడి శ్రమ ఊరికే పోకుండా ప్రియురాలు హగ్‌తో స్వాగతించింది. -
సార్! టోపీ తీసుకెళ్లండి!
కుత్బుల్లాపూర్: భారమనుకున్నారో... బరువు అనుకున్నారో.... తలపై ఉన్న టోపీని తీసి పక్కన పెట్టిన ఓ పోలీసు అధికారి దానిని అక్కడే వదిలి వెళ్లాడు. 15 రోజులైనా దానిని తీసుకెళ్లకపోవడంతో.. తలపై ఉండాల్సిన టోపీపైనే ధ్యాస లేని ఆయన విధులపై ఎంత నిర్లక్ష్యంగా ఉంటాడో అనే విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశానికి హాజరైన పోలీసు అధికారి తన టోపీని మర్చిపోయారు. సదరు అధికారి వచ్చి తీసుకెళ్తాడనే ఉద్దేశంతో సర్కిల్ సిబ్బంది అందరికీ కనబడేలా ప్రధాన గేటు పక్కనే ఉన్న టేబుల్‌పై పెట్టారు. ఇప్పటి వరకూ ఆయన తీసుకెళ్లలేదు. బాధ్యత గల అధికారి అయితే తనను తీసుకెళ్తాడన్నట్టు ఆ టోపీ ఎదురు చూస్తోంది. -
అచ్చం టోపీలాగ ఉంది గురూ!
మాస్కో: ఇదేమి స్టైల్ బాబు, అచ్చం టోపీ లాగ ఉంది చూడు!....పొడవాటి కురులున్న ముద్దు గుమ్మలను ఎంపిక చేసుకొని విభిన్న రీతుల్లో వారి కురులను మెలితిప్పి కొత్త కొత్త ఫ్యాషన్లను సృష్టించడంలో ఆరితేరిన రష్యన్ హెయిర్ స్టైలిస్ట్ జార్జి కాట్ సరికొత్త స్టైల్ ఇది. ఈ స్టైల్‌ను తీర్చిదిద్దిన తీరు గురించి తెలియజేసే ఆన్లైన్ వీడియో ఇప్పుడు ‘ఇన్స్టాగ్రామ్’లో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే దీన్ని 70 వేల మంది వీక్షించగా, దాదాపు పదివేల మంది కామెంట్లు చేశారు. జార్జికాట్కు ఇన్‌స్టాగ్రామ్‌లో 6,23,000 మంది అభిమానులు ఉన్నారు. ఎప్పుడూ భిన్న రీతుల్లో హెయిర్ స్టైల్‌ను రూపొందించేందుకే తాన ప్రాధాన్యతనిస్తానని, ఒక్కోసారి తన స్టైల్‌ను చూసే తాను అబ్బుర పడతానని, కొన్ని సార్లు తాను చేసినదే తనకు నమ్మబుద్ధి కాదని ఆయన వ్యాఖ్యానించారు. అచ్చంగా శిలా విగ్రహాలకు కురులు దిద్దినట్టుగా ఆయన తీర్చిదిద్దే హెయిర్ స్టైల్ ఉంటుందని అభిమానులు ఆయన్ని ప్రశంసిస్తుంటారు. ఇప్పుడు ఈ సరికొత్త స్టైల్‌కు సంబంధించిన 30 సెకండ్ల వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన అభిమానులు ప్రశంసలతో ఆయన్ని ముంచెత్తుతున్నారు. ఇదేమి స్టైల్ బాబు! అని కొందరు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తుంటే మరికొందరు అద్భుతం, అత్యద్భుతమని, ఇంకొందరు ‘హెయిర్ టోపీకి కొత్త నిర్వచనం’ అంటూ వ్యాఖ్యానించారు. ఇలా హెయిర్ స్టైల్‌ను టోపీలాగా తీర్చి దిద్దడానికి టోపీ డోమ్‌లాంటి రింగ్‌ను, కొన్ని వలయాకారపు రింగులతోపాటు హేర్ పిన్స్‌ను జార్జ్ కాట్ ఉపయోగించారు. -
అక్షరాలా 61 లక్షలు!
బ్రాడ్‌మన్ బ్లేజర్ విలువ సిడ్నీ: క్రికెట్ ఆల్‌టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్‌కు సంబంధించి ఏ వస్తువు అయినా అభిమానులకు అపురూక కానుకవంటిదే. ఉజ్వల కెరీర్లో ఆయన వాడిన బ్యాట్ మొదలు టోపీ వరకు అమ్మకానికి పెడితే వారు ఎగబడి కొనేందుకు సిద్ధమవుతారు. తాజాగా 1936-37 యాషెస్ సిరీస్‌లో బ్రాడ్‌మన్ వేసుకున్న బ్లేజర్‌ను సోమవారం వేలానికి ఉంచారు. డాన్ తొలిసారి ఈ సిరీస్‌కే కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ బ్లేజర్‌కు అనూహ్యంగా వేలంలో 1 లక్షా 32 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (దాదాపు రూ. 61 లక్షలు) విలువ పలికింది. నిర్వాహకుల అంచనాలకు మించి ఒక వీరాభిమాని దీనిని సొంతం చేసుకున్నాడు. -
టోపీ ఎట్ 13 కోట్లు...
ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్‌కు చెందిన ప్రఖ్యాత రెండు టోపీల్లో ఇదొకటి. ఇటలీలో 1800నాటి యుద్ధంలో నెపోలియన్ దీన్ని ధరించాడట. ఆదివారం ఫ్రాన్స్‌లోని ఫోంటెయిన్బ్లూలో వేలం వేయగా.. దక్షిణ కొరియా వ్యక్తి అంచనాకు నాలుగు రెట్లు అదనంగా రూ. 13.58 కోట్లు చెల్లించి కొన్నాడు. -
నీలేశ్ హ్యాట్రిక్
సాక్షి, హైదరాబాద్: పి. నీలేశ్ (4/46) రాణించడంతో బడ్డింగ్ స్టార్ 39 పరుగుల తేడాతో శ్రీచక్రపై విజయం సాధించింది. నీలేశ్ హ్యాట్రిక్ సాధించడం విశేషం. 234 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీచక్ర మ్యాచ్ రెండో రోజు శుక్రవారం 194 పరుగులకు ఆలౌటైంది. రఘువీర్ (132 బంతుల్లో 83 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), డి. నరేశ్ (87 బంతుల్లో 55; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించినా తమ జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు. భరణ్, అమృత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు: బాలాజీ కోల్ట్స్: 255 (జైనుద్దీన్ ఖాద్రీ 110, విశాల్ తివారి 73, కార్తీక్ 4/34, అనీశ్ 4/75), అవర్స్ సీసీ: 107 (సంతోష్ గౌడ్ 59, అంకిత్ శర్మ 5/25) ఉస్మానియా: 290 (ఫణీంద్ర 64 నాటౌట్, రాంప్రసాద్ 47, ఫర్హాన్ 7/117), పాషా బీడి: 109 (రోహిత్ ఖురానా 31, ఫణీంద్ర 3/6, నవీన్ 3/28), దినేశ్ 3/40) గౌడ్స్ ఎలెవన్: 249, టీమ్ స్పీడ్: 250/8 (డీజీజే చైతన్య 54, నిఖిల్ నాయుడు 53 నాటౌట్, గణపతి హేమంత్ 40, నితిన్ గోపాల్ 4/99) ఎంసీసీ: 163, హెచ్‌బీసీసీ: 165/8 (పుష్కర్ 57 నాటౌట్, ప్రిన్స్ ఓజా 5/74) దక్కన్ కోల్ట్స్ ఘన విజయం ‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ మ్యాచ్‌లో దక్కన్ కోల్ట్స్ 105 పరుగుల తేడాతో సూపర్ స్టార్‌ను చిత్తు చేసింది. ముందుగా దక్కన్ కోల్ట్స్ 152 పరుగులు సాధించింది. చైతన్యరెడ్డి (52), కృష్ణ (33) రాణించగా, సుమంత్ 42 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతర సూపర్ స్టార్ 47 పరుగులకే కుప్పకూలింది. ఆంజనేయులు (5/9), భరత్ (5/28) చెలరేగి కోల్ట్స్‌కు విజయాన్నందించారు.