ప్రియురాలి సంతోషం కోసం.. | boyfriend descends rocky cliff to pick up his lover's HAT | Sakshi
Sakshi News home page

ప్రియురాలి సంతోషం కోసం..

Published Fri, Feb 19 2016 12:51 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM

ప్రియురాలి సంతోషం కోసం..

ప్రియురాలి సంతోషం కోసం..

బీజింగ్: ప్రియురాలి కోసం ఎంతటి సాహసానికైనా తెగించే వెండితెర హీరోలను మించి పోయాడు ఈ చైనా కుర్రాడు. ప్రియురాలు ధరించిన హ్యట్(టోపీ) కోసం లైఫ్ రిస్క్ చేశాడు. ప్రేమికుల రోజుకు ముందురోజు జరిగిన ఈ ఘటన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ చైనాలోని జింజి పర్వతాల అందాలను వీక్షించడానికి ఓ జంట వచ్చింది. అక్కడ వీచిన బలమైన గాలులకు ప్రియురాలి హ్యాట్ ఎగిరిపోయి కొండ అంచులో పడిపోయింది. దీంతో ఆమె అప్సెట్ కాకూడదు అనుకున్నాడో లేక క్యాప్ ఖరీదైందో గాని ప్రాణాలకు తెగించి మరీ క్యాప్ను తీసుకొచ్చాడు ప్రియుడు. పట్టు తప్పితే అతడు 1640 అడుగుల లోతులోని లోయలో పడిపోయే అవకాశం ఉన్నా చాకచక్యంగా క్యాప్ తీసుకొని కొండెక్కాడు.

పేరు తెలియని ఈ ప్రేమికుడు చేసిన సాహసం అక్కడివారిని మునివేళ్ల మీద నిలబడేలా చేసింది. కొండ పైకి వస్తున్న అతన్ని అక్కడి వారు చప్పట్లతో అభినందించారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఆ పర్యాటక ప్రదేశంలోని అధికారులు మాత్రం ఇలాంటి చర్యలు ఏ మాత్రం సమర్థనీయం కాదని, చర్యలు తీసుకుంటామంటున్నారు. అంత కష్టపడి క్యాప్ తీసుకొచ్చిన ఆ కుర్రాడి శ్రమ ఊరికే పోకుండా  ప్రియురాలు హగ్తో స్వాగతించింది.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement