
దేశంలోని వాడవాడలా ఈరోజు 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ 11వ సారి జెండాను ఎగురవేశారు. ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ తన వేషధారణ, ప్రత్యేక తలపాగాతో వార్తల్లో నిలుస్తుంటారు.
ప్రధాని మోదీ తలపాగా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. మోదీ తన మొదటి టర్మ్ (2014) నుండి తన మూడవ టర్మ్ (2024) వరకు ప్రతి సంవత్సరం వేర్వేరు తలపాగాలు ధరిస్తూ కనిపించారు. ఈ ఏడాది ప్రధాని మోదీ తలపాగా స్టైల్ డిఫరెంట్‌గా ఉంది. ఈ స్వాతంత్య్ర దినోత్సవాన ప్రధాని మోదీ కాషాయి, ఆకుపచ్చ, పసుపు రంగులతో కూడిన రాజస్థానీ తలపాగాలో కనిపించారు. తెలుపు రంగు కుర్తా-పైజామాతో పాటు నీలిరంగు కోటు ధరించాడు.
ప్రధాని మోదీ తలపాగాలో పలు రంగులు ఉన్నప్పటికీ, కాషాయ రంగు ఎక్కువగా కనిపిస్తోంది. కాషాయ వర్ణం శ్రీరామునికి ఇష్టమైన రంగుగా చెబుతారు. మోదీ ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ తలపాగా ధరించి శ్రీరామునిపై తనకున్న భక్తిని చాటుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment