Attract
-
Independence Day: ప్రధాని మోదీ తలపాగా ప్రత్యేకత ఇదే
దేశంలోని వాడవాడలా ఈరోజు 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ 11వ సారి జెండాను ఎగురవేశారు. ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ తన వేషధారణ, ప్రత్యేక తలపాగాతో వార్తల్లో నిలుస్తుంటారు.ప్రధాని మోదీ తలపాగా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. మోదీ తన మొదటి టర్మ్ (2014) నుండి తన మూడవ టర్మ్ (2024) వరకు ప్రతి సంవత్సరం వేర్వేరు తలపాగాలు ధరిస్తూ కనిపించారు. ఈ ఏడాది ప్రధాని మోదీ తలపాగా స్టైల్ డిఫరెంట్‌గా ఉంది. ఈ స్వాతంత్య్ర దినోత్సవాన ప్రధాని మోదీ కాషాయి, ఆకుపచ్చ, పసుపు రంగులతో కూడిన రాజస్థానీ తలపాగాలో కనిపించారు. తెలుపు రంగు కుర్తా-పైజామాతో పాటు నీలిరంగు కోటు ధరించాడు.ప్రధాని మోదీ తలపాగాలో పలు రంగులు ఉన్నప్పటికీ, కాషాయ రంగు ఎక్కువగా కనిపిస్తోంది. కాషాయ వర్ణం శ్రీరామునికి ఇష్టమైన రంగుగా చెబుతారు. మోదీ ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ తలపాగా ధరించి శ్రీరామునిపై తనకున్న భక్తిని చాటుకున్నారు. -
సౌదీ స్మార్ట్ సిటీ ‘నియోమ్’ ప్రపంచాన్ని ఎందుకు ఆకర్షిస్తోంది?
ఆధునిక నిర్మాణాలకు సౌదీ అరేబియా పెట్టిందిపేరు. ప్రపంచంలోని ఏ పెద్ద కట్టడానికి సంబంధించిన ప్రస్తావన వచ్చినా ముందుగా సౌదీ అరేబియా పేరే వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం సౌదీ అరేబియా భారీ స్మార్ట్ సిటీ నిర్మాణంలో తలమునకలై ఉంది. ఇది ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలవనుంది. నియోమ్.. ఇది అనేది వాయువ్య సౌదీ అరేబియాలోని టబుక్ ప్రావిన్స్‌లో నిర్మాణంలో ఉన్న అద్భుత స్మార్ట్ సిటీ. ఈ ప్రదేశం ఎర్ర సముద్రానికి ఉత్తరంగా, ఈజిప్టుకు తూర్పున అకాబా గల్ఫ్ సమీపంలో, జోర్డాన్‌కు దక్షిణంగా ఉంది. 500 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ భవిష్యత్ నగరం సంపూర్ణంగా ‘స్వచ్ఛమైన శక్తి’తో మనుగడ సాగించనుంది. ఈ అధునాతన సిటీలో కార్లు ఉండవు. రోడ్లు కూడా ఉండవు. జీరో కార్బన్ ఉద్గారాలతో స్మార్ట్ సిటీ కాలుష్య రహితంగా ఉండనుంది. కాగా ఈ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనలో 20 శాతం పనులు పూర్తయ్యాయని నియోమ్ సీఈఓ నద్మీ అల్ నాస్ర్ మీడియాకు తెలిపారు. మానవాళి ఎదుర్కొంటున్న అనేక కీలక సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నామన్నారు. నియోమ్ అనేది గ్రీకు పదం. నియో అంటే కొత్తది. ఎం అనేదానిని అరబిక్ పదం ముస్తాక్బాల్ నుంచి తీసుకున్నారు. దీని అర్థం భవిష్యత్తు. నియోమ్ అనే పదాన్ని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పేరు నుంచి కూడా తీసుకున్నారని చెబుతారు. ఎర్ర సముద్ర తీరంలో 26,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మెగాసిటీ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నట్లు 2017 అక్టోబరులో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) ప్రకటించారు. రియాద్‌లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ కాన్ఫరెన్స్‌లో ఎంబీఎస్ ఈ ప్రకటన చేశారు. ఇది సౌదీ అరేబియా- 2030 విజన్లలో ఒకటి. దీనిని సౌదీ ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి చేసే లక్ష్యంలో నిర్మిస్తున్నారు. నియోమ్ అనేది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నిర్మాణాలకు భిన్నంగా స్వతంత్రంగా పనిచేస్తుందని, దానికంటూ సొంత పన్ను, కార్మిక చట్టాలు, ‘స్వయంప్రతిపత్త న్యాయ వ్యవస్థ’ ఉంటుందని ఎంబీఎస్ తెలిపారు. నియోమ్‌లో పోర్ట్‌లు, ఎంటర్ప్రైజ్ జోన్లు, పరిశోధనా కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, క్రీడా కేంద్రాలు, వినోద వేదికలు ఉంటాయని ఎంబీఎస్ తెలిపారు. నియోమ్ పునరుత్పాదక ఇంధన వనరుల నుండి వంద శాతం శక్తిని అందుకుంటుంది. సూర్యరశ్మి, గాలి, హైడ్రోజన్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని మాత్రమే నియోమ్ వినియోగిస్తుంది. ఫలితంగా ఈ సిటీలో కర్బన ఉద్గారాల విడుదల ప్రస్తావనే ఉండదు. ఈ నగరానికున్న మరొక ప్రత్యేకత ఏమిటంటే కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలతో కూడిన నీటిని సముద్రంలోకి తరలించరు. దానిని తిరిగి పారిశ్రామిక ముడి పదార్థంగా వినియోగిస్తారు. వ్యవసాయం విషయంలో కూడా నియోమ్ ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలవనుంది. గ్రీన్‌హౌస్‌ల ఏర్పాటుతో ప్రపంచంలోనే ఆహార స్వయం సమృద్ధిగల నగరాన్ని సృష్టించనున్నారు. సౌదీ అరేబియా ప్రస్తుతం 80 శాతం మేరకు ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్నది. ఇది కూడా చదవండి: అమెరికా అంతరిక్ష ప్రయోగాలలో హిట్లర్ సన్నిహితుడు? 1969లో ఏం జరిగింది? -
మరో ‘సీమా- సచిన్’.. ఆన్లైన్ గేమ్‌తో ప్రేమజంటకు రెక్కలు..
సీమా-హైదర్ల పబ్జీ ప్రేమ గురించి అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఇదేకోవలో ఫ్రీ ఫైర్ గేమ్ లవ్ స్టోరీ వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 21 ఏళ్ల యువతి ఫ్రీ ఫైర్ గేమ్ అడుతూ బీహార్‌కు చెందిన ఒక యువకునితో పరిచయం ఏర్పరుచుకుంది. మాటలు, ముచ్చట్ల అనంతరం వీరి పరిచయం ప్రేమగా మారింది. అంతే.. వీరిద్దరూ ఇళ్ల నుంచి మాయమయ్యారు. దీనిపై అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేటి యువతీయువకులకు తమ ప్రేమికులను ఎంచుకునేందుకు సరికొత్త మార్గం తెరుచుకుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలైన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయాలు ఏర్పరుచుకుని, వాటిని ప్రేమలుగా మార్చుకుంటున్నారు. వీటికితోడు కొత్తగా ఆన్లైన్ గేమ్‌లు కూడా యువతీయువకుల ప్రేమలకు వేదికలవుతున్నాయి. పాకిస్తాన్ నుంచి వచ్చిన సీమా హైదర్, భారత్‌కు చెందిన సచిన్‌ల లవ్ స్టోరీ ప్రస్తుతం వార్తల్లో నానుతోంది. ఇదే నేపధ్యంలో ఇప్పుడు గోరఖ్‌పూర్‌లోనూ ఇటువంటి ప్రేమకథ వెలుగుచూసింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు గోరఖ్‌పూర్‌లోని పీపీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 21 ఏళ్ల యువతి ఉన్నట్టుండి ఇంటి నుంచి మాయమయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం రెండు రోజుల పాటు గాలించారు. ఈ నేపధ్యంలో తమ కుమార్తె ప్రియునితో వెళ్లిపోయిందని తెలుసుకున్నారు. ఈ విషయాన్ని వారు పీపీగంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అజ్ఞాత యువకునిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఆ యువతి కోసం వెదుకులాట మొదలుపెట్టారు. పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్, నోయిడాకు చెందిన సచిన్‌ల ప్రేమకథ పబ్జీ గేమ్ ద్వారా ప్రారంభమయ్యింది. దీంతో సీమా తన నలుగురు పిల్లలతో పాటు నేపాల్ గుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి, చివరకు నోయిడాలోని తన ప్రేమికుని వద్దకు చేరింది. ఇదేవిధంగా గోరఖ్‌పూర్‌కు చెందిన ఒక యువతి బీహార్‌కు చెందిన ఒక యువకునితో ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా ప్రేమలో పడింది. దీంతో పట్నాలో ఉంటున్న తన ప్రేమికుడు సుజీత్ దగ్గరకు చేరుకుంది. ఫ్రీ ఫైర్‌గేమ్ ప్రేమికులిద్దరూ జూలై 31న ఇంటి నుంచి పరారయ్యారు. ఈ సందర్భంగా యువతి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమార్తె చదువుకుంటున్నానని చెబుతూ, తమకు తెలియకుండా మొబైల్లో గేమ్ ఆడుతుంటుందని తెలిపారు. తాము కుమార్తెపై అంతగా దృష్టి పెట్టలేకపోయామని అన్నారు. ప్రియుడు ఆటోవాలా.. ఈ ఉదంతం గురించి పీపీగంజ్ పోలీసు అధికారి ఆశీష్ సింగ్ మాట్లాడుతూ మాయమైన యువతి కుటుంబ సభ్యుల నుంచి తమకు ఫిర్యాదు అందిందని, దాని ఆధారంగా కేసు నమోదు చేశామన్నారు. ఆ ప్రేమికుల గురించి వెదుకులాట ప్రారంభించామన్నారు. వీరి లొకేషన్ బీహార్‌లోని పట్నాను చూపిస్తున్నదన్నారు. ఆ యువకుడు పట్నాలో ఆటో నడుపుతుంటాడన్నారు. ప్రేమికులిద్దరినీ గోరఖ్‌పూర్ తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ కేసు ఇతర రాష్ట్రం పరిధిలో ఉన్నందున్న అనుమతులు అవసరమవుతాయన్నారు. ఆ యువతి మైనర్ అని, ఆమెకు 21 ఏళ్ల అని, ఆ ప్రేమికులతో మాట్లాడిన తరువాత మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు. ఇది కూడా చదవండి: నా చిలక తప్పిపోయింది.. వెతికిస్తే.. రివార్డు అంటూ పోస్టర్లు -
వింత తెగ: పళ్లను చూసి పెళ్లాడేస్తారు...
గిరిజన తెగలలో జరిగే వివిధ వేడుకలు చాలా విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిపేరుతో జరిగే తంతు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇదేకోవలో నైజీరియాలోని ఒక గిరిజన తెగలో జరిగే ఒక వింత వేడుక అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నైజీరియాలోని వోడబె గిరిజనులలో ప్రతీయేటా ఒక పోటీ జరుగుతుంటుంది. దీనిలో పురుషులు విచిత్రమైన మేకప్‌తో పాల్గొంటారు. అయితే వీరిని మేకప్ చేసే పని స్త్రీల చేతుల్లో ఉంటుంది. ఈ విధంగా ఎందుకు మేకప్ చేస్తారో, దీని వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నైజీరియాలో ఉండే వోడబె గిరిజనులు ప్రతీయేటా గుయెరోవెల్ అనే పోటీని నిర్వహిస్తారు. ఇది పురుషుల సౌందర్యాన్ని ప్రతిబింబించే ఉత్సవం. దీనిలో ఈ గిరిజన జాతికి చెందిన స్త్రీలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ పోటీలో భాగంగా పురుషుల ముఖంపై సంప్రదాయ రీతిలో మేకప్ చేస్తారు. Vodabe tribe, where men spend hours doing hair and makeup to impress women https://t.co/4w8Kukzj8r pic.twitter.com/2mSeG4n7GJ— Life's Prism (@LifesPrism) April 25, 2020 భాగస్వామి ఎంపిక కోసం.. మేకప్ చేసుకున్న పురుషులు సంప్రదాయ దుస్తులు ధరించడంతోపాటు వివిధ ఆభరణాలు కూడా ధరిస్తారు. ఈ మేకప్ కార్యక్రమం పూర్తయిన తరువాత పెళ్లికాని యువతులు వారిముందు నిలుచుంటారు. వారు పురుష సౌందర్యాన్ని గుర్తిస్తారు. మేకప్ చేసిన పురుషుల కళ్లను, దంతాలను పరిశీలిస్తారు. ఎవరి కళ్లు, దంతాలు మిలమిలా మెరుస్తాయో వారిని అత్యంత ఆకర్షణీయమైన పురుషునిగా గుర్తిస్తారు. ఈ పోటీలో పాల్గొన్న పురుషులు తమ ఎదురుగా ఉన్న పెళ్లికాని యువతులను ఆకర్షించేందుకు వివిధ హావభావాలను పలికిస్తారు. యువతులు ఈ పురుషులలో తమకు నచ్చిన ఒకరిని తమ భాగస్వామిగా స్వీకరిస్తారు. Vodabe (Wodaabe) plemeOvo pleme naseljava prostor saharskih predela države Niger. Karakteristično za ovo pleme jeste pojam lepote, koji se naviše odnosi na muškarce. Na ovim prostorima zastupljen je princip kontrasta - muškarci se sređuju da bi udovoljili ženama, a ne obrnuto. https://t.co/UJIwsplOPT pic.twitter.com/vnHRinNcXE— mårinå (مارينا) 🌵 (@rapunzel_arsic) December 15, 2020 ఇది కూడా చదవండి: హెల్మెట్లు చాలావరకూ నలుపు రంగులోనే ఎందుకుంటాయంటే.. -
పీఎల్ఐ పథకంతో టెక్స్‌టైల్స్‌లోకి
న్యూఢిల్లీ: ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముతో దేశీ టెక్స్టైల్స్ పరిశ్రమ రూ. 1,536 కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అర్హత కలిగిన 56 దరఖాస్తుదారులకు ఇప్పటికే అనుమతి పత్రాలను జారీ చేసినట్లు వివరించింది. దేశీయంగా దుస్తులు, ఫ్యాబ్రిక్స్, తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం టెక్స్టైల్స్ రంగం కోసం రూ. 10,683 కోట్లతో పీఎల్‌ఐసీ స్కీమును ప్రవేశపెట్టింది. దీని కింద ఈ ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకూ దరఖాస్తులు స్వీకరించింది. 64 దరఖాస్తుదారులను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయగా, 56 దరఖాస్తుదారులు కొత్త కంపెనీ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేశారు. దీనితో వారికి అనుమతి పత్రాలను కేంద్రం జారీ చేసింది. -
ఘంటసాల పాటను అద్భుతంగా పాడింది
-
రష్యాలో ఇండియన్ ఆర్మీ అదుర్స్
మాస్కో: పొరుగు దేశమైనా అక్కడివాళ్లు మాతృదేశ సైన్యంపై కంటే భారత సైన్యంపైనే దృష్టిని నిలిపారు. రష్యా దినోత్సవం సందర్భంగా అక్కడ జరిగే వేడుకలు చూసేందుకు వచ్చినవారందరి కళ్లను భారత సైన్యం ఆకర్శించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీకి వ్యతిరేకంగా పోరాడి మే 9న రష్యా విజయాన్ని సొంతం చేసుకొంది. దీంతో ప్రతి ఏడాది మే 9న రష్యా విజయ దినోత్సవ వేడుకలు జరుపుతారు. ఈ నేపథ్యంలోనే మాస్కోలో నిర్వహిస్తున్న పరేడ్‌లో ఇండియన్ ఆర్మీ కవాతు నిర్వహించింది. వేల మంది రష్యా సైనికులతోపాటు, పన్నెండు దేశాలకు చెందిన ఆర్మీ విభాగాలు కూడా వేడుకల్లో కవాతు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన 75 మంది భారత ఆర్మీ మూడు రంగుల జెండాను చేతబట్టి క్రమశిక్షణగా చేస్తున్న పరేడ్‌కు అక్కడ కూర్చున్న వారంతా మంత్రముగ్దులై చప్పట్ల వర్షం కురిపించారు. కవాతు చేసిన వారిలో అంతా ఆరడుగులు వున్నారు. త్రివర్ణ పతాకాన్ని కెప్టెన్ డీపీ సింగ్ చేతపట్టుకోగా పరేడ్ బాధ్యతలు కెప్టెన్ వికాశ్ సింగ్ సువాగ్ చూసుకున్నారు. -
శూన్యంలో ఏం నింపాలి??
13-19 కేరెంటింగ్ అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... ఇటీవల కాలంలో టీనేజ్ పిల్లల్లో దాదాపు అందరిదీ ఒకటే సమస్య... ఏకాగ్రత కుదరడం లేదని. తల్లిదండ్రులందరి ఫిర్యాదు ఒక్కటే.. మా పిల్లలు చదువు మీద ధ్యాస పెట్టడం లేదని. ఈ వయసులో ఎందుకీ సమస్య ఎక్కువవుతోంది..? సుష్మ పట్టణంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. రెండేళ్ల క్రితం ఊరు వెళ్లినప్పుడు ఒక వ్యక్తి పరిచయమై, ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఊరు నుంచి వచ్చాక అతని నుంచి రోజూ మెసేజ్‌లు.. మొదట్లో స్పందించని సుష్మ మెల్ల మెల్లగా అతని మెసేజ్‌లకు తిరుగు సందేశం ఇవ్వడం మొదలుపెట్టింది. గంటలు గంటలు ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తోంది. కొన్ని రోజులకు ఎలాగైందంటే పావు గంటలో అతని నుంచి తిరుగు మెసేజ్ రాకపోతే పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తించేది. తల్లిదండ్రులు ఆ అబ్బాయి గురించి ఎంక్వయిరీ చేశారు. ఊరు వెళ్లి కలిశారు. అతను చదువు మానేసి, ఏ పనీ లేకుండా ఊరికే రోజులు వెళ్లదీస్తున్నాడు. గట్టిగా మందలిస్తే ‘ఇక నుంచి మెసేజ్ చేయను, మాట్లాడను’ అని చెప్పాడు. సుష్మను హాస్టల్లో ఉంచారు. ఏడాది గడిచింది. మళ్లీ ఈ మధ్య ఆ అబ్బాయి నుంచి రోజూ మెసేజ్‌లు. ఫోన్లోనే కబుర్లు. సమస్య మళ్లీ మొదటికొచ్చింది. సుష్మకు చదువు మీద పూర్తిగా శ్రద్ధ తగ్గిపోయింది. టీచర్లు చెప్పే పాఠాలపై ఏకాగ్రత నిలపలేకపోతోంది. మెసేజ్‌లకు అట్రాక్ట్ అయిపోయి, చదువు నుంచి దూరం అయ్యింది. అవినాష్, వినీల దూరపు బంధువులు. ఇద్దరూ ఇంటర్మీడియట్ విద్యార్థులే! బంధువుల ఫంక్షన్లో కలిశారు. ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత ఇళ్లకు వచ్చాక ‘హాయ్ హాయ్’ మెసేజ్‌లు ఇచ్చుకోవడం మొదలైంది. పేరెంట్స్‌కి తెలియకుండా సాగే నిశ్శబ్ద సందేశాలు ఇరువైపులా పిల్లలిద్దరినీ చదువుకు దూరం చేశాయి. పెద్దలకు తెలిసి గొడవలయ్యాయి. పిల్లల దగ్గర నుంచి ఫోన్లు లాక్కున్నారు. సమస్య అప్పటికి సద్దుమణిగింది. మరుసటి ఏడాది ఓ పెళ్లిలో కలిశారు. మారిన నెంబర్లు మళ్లీ ఇచ్చుకున్నారు. మళ్లీ మామూలే! ఫోన్లలో మెసేజ్‌లు, కబుర్లు! పుస్తకాలు ముందు ఉన్నా ఏకాగ్రత కుదరడం లేదు. పరధ్యానంగా ఉంటున్నారు. మార్కులు తగ్గిపోయాయి. పాస్ అవుతారో లేదో.. అని భయం. భౌతిక శాస్త్రంలో ... ‘శూన్యం పూడ్చబడుతుంది’ అనే సిద్ధాంతం ఒకటుంది. పిల్లల మైండ్ఎప్పుడైతే లక్ష్యం వైపుగా ఉండదో అది శూన్యంలోనే ఉంటుంది. ఆ శూన్యం ఇటీవల రకరకాల ఆకర్షణలతో పూరింపబడుతోంది. వాటిలో ప్రధానమైనది టెక్నాలజీ! పాఠశాల స్థాయి నుంచే పిల్లల దగ్గర ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం ఎక్కువైంది. పిల్లలు తమ చుట్టూ ఉన్నవారితో కన్నా మెసేజ్‌లు, చాట్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ వయసులో కలిగే రకరకాల అట్రాక్షన్లతో టెక్నాలజీ వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నారో, చదువు నుంచి ఎలా దూరం అవుతున్నారో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. సరైన దారిలో పెట్టగలగాలి. ఇవి గమనించండి... మారుతున్న కాలానికి, వచ్చి పడుతున్న టెక్నాలజీకి మనం అడ్డుపడలేం. అయితే, ఏ కారణం లేకుండా ఎవరూ పరధ్యానంగా ఉండరు అనే విషయాన్ని గుర్తించాలి. పిల్లలు ఒక వైపునకు ఆకర్షితులు అవుతున్నారు కాబట్టే, మరో వైపునకు (చదువు)దూరం అవుతున్నారు అనేది గమనించాలి. {పతి మనిషి మైండ్‌లో ‘ఇద్, ఇగో, సూపర్ ఇగో’అని 3 దశలు ఉంటాయి. ‘ఇద్’ అనేది చిన్నపిల్లల మనస్తత్వం. తాత్కాలిక ఆనందాల కోసం పదే పదే మారాం చేస్తుంటుంది. తప్పు అని తెలిసినా ఆనందం కోసం వెంపర్లాడుతుంటుంది. ‘ఇగో’ అనేది దానిని పోలీస్‌లా హెచ్చరిస్తుంది. మంచీ చెడు రెండూ చెబుతుంది. ‘సూపర్ ఇగో’ జడ్జ్ చేస్తుంది. చేసే పని ‘ఎందుకు మంచిది కాదు’ అనేది తమ లోపలి స్వరం ఒకటి హెచ్చరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్వరం వినిపిస్తుందో పిల్లలు అప్పుడు తమను తామే నేరస్థులుగా భావించుకుంటారు. చదువు నుంచి దూరం అవుతారు. ఇవి సూచించండి... మనసుకు ‘వద్దు’ అని చెప్పద్దు: ఆకర్షణకు సంబంధించి ఎలాంటి ‘కోరికలు’ కలిగినా వెంటనే ‘వద్దు’ అని మనసుకు చెప్పకండి. ‘ఇప్పుడు కాదు’ అని వాయిదా వేస్తూ ఉండమనండి. వాయిదా సమయాన్ని బట్టి తీవ్రత తగ్గిపోతుంటుంది. ‘వద్దు’ అంటే పెరుగుతుంది. ఈ విషయాన్ని పిల్లలు గ్రహించేలా వివరించాలి. టైమ్ మిషన్‌లో ఎక్కండి: ఆకర్షణకు లోనవకుండా ఉండాలి, చదువు మీద ఏకాగ్రత కుదరాలి అంటే.. ‘టైమ్ మిషన్’లో ఎక్కమని చెప్పాలి. అంటే కళ్లు మూసుకొని 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలో తమని తాము చూసుకోమని చెప్పాలి. మంచి ఇల్లు, కారు, హోదా.. ఇవన్నీ ఉండేలా తమ లోపలి స్వరం వారికే వినిపిస్తుంది. తమని తాము అలా చూసుకున్న తర్వాత దానికి 100 శాతం ఎఫర్ట్ పెడుతున్నానా! అని వారే బేరీజు వేసుకుంటారు. టైమ్ మిషన్ ఎక్కినప్పుడు ఆటోమేటిగ్గా తాము పెద్దలకు తెలియకుండా చేస్తున్న పనుల పట్ల వారికి భయం వేస్తుంది. పెద్దల స్థానంలో ఉండమనండి: ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి పక్కన నిల్చుని లిఫ్ట్‌లో పైకి వెళుతున్నాడు. అతనికి మరో వ్యక్తి తన పక్కన ఉన్నట్టే కనిపిస్తుంది. అదే కింద ఉన్నవారికి లిఫ్ట్‌లో ఉన్న ఆ వ్యక్తి పైకి వెళుతున్నట్టే కనిపిస్తుంది. పక్కన ఉన్న వ్యక్తి, కింద ఉన్న వ్యక్తి ఇద్దరూ చెప్పే సమాధానం సరైనదే! అయితే, ఎక్కడా రెండూ కరెక్ట్‌గా ఉండటం సాధ్యపడదు. పిల్లలు ఆకర్షణలో ఉన్నప్పుడు వారు చేస్తున్నది వారికి కరెక్టే అనిపిస్తుంది. అలాంటప్పుడు పెద్దలు తాము అమలుపరిచే శిక్షలు కరెక్టే అనుకుంటారు. కానీ, పిల్లల మదిలో ఉన్న అపోహలను పెద్దలను తొలగించే ప్రయత్నం చేయాలి. పిల్లలను తల్లిదండ్రుల(పెద్దల) స్థానంలో ఉండమనాలి. ‘నీ కూతురు/కొడుకు ఇలాగే చేస్తే నువ్వేం చేస్తావు?’ అని అడగాలి. సినిమాలలో వంద రకాలుగా అమ్మాయిని ఇబ్బంది పెడితే అతనే హీరోగా చూపిస్తారు. అబ్బాయిలు అదే నిజం అనుకుంటున్నారు. అయితే, సినిమాలు నిజాలు కావు. కేవలం 3 గంటల వినోదానికి సంబంధించింది మాత్రమే అనేది వారు తెలుసుకోగలగాలి. అదే సినిమాలో హీరో ఒక బ్రిడ్జి మీద నుంచి ఇంకో బ్రిడ్జ్ మీదకు దూకడం వంటి అసాధ్యపు సీన్లు చేస్తుంటాడు. ప్రేమ అనే వ్యవహారానికి త్వరగా ఆకర్షితులయ్యే పిల్లలు అలాంటి సాహసాలు ఎందుకు చేయడం లేదు? ఇవెందుకు చేస్తున్నారు? అంటూ ఇలా వాస్తవాలను తెలియజేయాలి. టీనేజ్ పిల్లల్లో ఆకర్షణ అనేది సాధారణమైనదే అని ముందుగా పెద్దలు తెలుసుకోవాలి. అయితే, ఆ ఆకర్షణ పరిధులు దాటడం వల్లే సమస్యలు కాబట్టి, ఇదే విషయాన్నీ పిల్లలకు వివరించాలి. - డా. గీతా చల్లా, సైకాలజిస్ట్ www.sudishacounselingcentre.org