సీమా-హైదర్‌ల పబ్జీ ప్రేమ గురించి అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఇదేకోవలో ఫ్రీ ఫైర్ గేమ్ లవ్ స్టోరీ వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 21 ఏళ్ల యువతి ఫ్రీ ఫైర్ గేమ్ అడుతూ బీహార్‌కు చెందిన ఒక యువకునితో పరిచయం ఏర్పరుచుకుంది. మాటలు, ముచ్చట్ల అనంతరం వీరి పరిచయం ప్రేమగా మారింది. అంతే.. వీరిద్దరూ ఇళ్ల నుంచి మాయమయ్యారు. దీనిపై అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నేటి యువతీయువకులకు తమ ప్రేమికులను ఎంచుకునేందుకు సరికొత్త మార్గం తెరుచుకుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయాలు ఏర్పరుచుకుని, వాటిని ప్రేమలుగా మార్చుకుంటున్నారు. వీటికితోడు కొత్తగా ఆన్‌లైన్ గేమ్‌లు కూడా యువతీయువకుల ప్రేమలకు వేదికలవుతున్నాయి. పాకిస్తాన్ నుంచి వచ్చిన సీమా హైదర్, భారత్‌కు చెందిన సచిన్‌ల లవ్ స్టోరీ ప్రస్తుతం వార్తల్లో నానుతోంది. ఇదే నేపధ్యంలో ఇప్పుడు గోరఖ్‌పూర్‌లోనూ ఇటువంటి ప్రేమకథ వెలుగుచూసింది.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
గోరఖ్‌పూర్‌లోని పీపీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 21 ఏళ్ల యువతి ఉన్నట్టుండి ఇంటి నుంచి మాయమయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం రెండు రోజుల పాటు గాలించారు. ఈ నేపధ్యంలో తమ కుమార్తె ప్రియునితో వెళ్లిపోయిందని తెలుసుకున్నారు. ఈ విషయాన్ని వారు పీపీగంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అజ్ఞాత యువకునిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఆ యువతి కోసం వెదుకులాట మొదలుపెట్టారు.
పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్, నోయిడాకు చెందిన సచిన్‌ల ప్రేమకథ పబ్జీ గేమ్ ద్వారా ప్రారంభమయ్యింది. దీంతో సీమా తన నలుగురు పిల్లలతో పాటు నేపాల్ గుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి, చివరకు నోయిడాలోని తన ప్రేమికుని వద్దకు చేరింది. ఇదేవిధంగా గోరఖ్‌పూర్‌కు చెందిన ఒక యువతి బీహార్‌కు చెందిన ఒక యువకునితో ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా ప్రేమలో పడింది. దీంతో పట్నాలో ఉంటున్న తన ప్రేమికుడు సుజీత్ దగ్గరకు చేరుకుంది.
ఫ్రీ ఫైర్‌గేమ్ ప్రేమికులిద్దరూ జూలై 31న ఇంటి నుంచి పరారయ్యారు. ఈ సందర్భంగా యువతి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమార్తె చదువుకుంటున్నానని చెబుతూ, తమకు తెలియకుండా మొబైల్‌లో గేమ్ ఆడుతుంటుందని తెలిపారు. తాము కుమార్తెపై అంతగా దృష్టి పెట్టలేకపోయామని అన్నారు.
ప్రియుడు ఆటోవాలా..
ఈ ఉదంతం గురించి పీపీగంజ్ పోలీసు అధికారి ఆశీష్ సింగ్ మాట్లాడుతూ మాయమైన యువతి కుటుంబ సభ్యుల నుంచి తమకు ఫిర్యాదు అందిందని, దాని ఆధారంగా కేసు నమోదు చేశామన్నారు. ఆ ప్రేమికుల గురించి వెదుకులాట ప్రారంభించామన్నారు. వీరి లొకేషన్ బీహార్‌లోని పట్నాను చూపిస్తున్నదన్నారు. ఆ యువకుడు పట్నాలో ఆటో నడుపుతుంటాడన్నారు. ప్రేమికులిద్దరినీ గోరఖ్‌పూర్ తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ కేసు ఇతర రాష్ట్రం పరిధిలో ఉన్నందున్న అనుమతులు అవసరమవుతాయన్నారు. ఆ యువతి మైనర్ అని, ఆమెకు 21 ఏళ్ల అని, ఆ ప్రేమికులతో మాట్లాడిన తరువాత మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు.
ఇది కూడా చదవండి: నా చిలక తప్పిపోయింది.. వెతికిస్తే.. రివార్డు అంటూ పోస్టర్లు
Comments
Please login to add a commentAdd a comment