Viral Video: Thief Snatches Passenger Phone Railway Bridge Bihar - Sakshi
Sakshi News home page

వీడియో: ఇదేందయ్యా ఇది! రెప్పపాటులో.. రైల్వే బ్రిడ్జిపై బిత్తరపోయిన ప్యాసింజర్‌

Published Thu, Jun 9 2022 9:12 PM | Last Updated on Fri, Jun 10 2022 12:03 PM

Viral Video: Thief Snatches Passenger Phone Railway Bridge Bihar - Sakshi

రైల్వే బ్రిడ్జిపై రైలు ముందుకెళ్తోంది. వాటర్‌ వ్యూను ఆస్వాదించే ఉద్దేశంతో ప్రయాణికులు డోర్లు, కిటికీల దగ్గరకు వచ్చి చేరారు. ఇద్దరు యువకుల్లో ఒకడు.. తన జేబు నుంచి మొబైల్‌ తీసి దృశ్యాన్ని షూట్‌ చేస్తున్నాడు. ఉన్నట్లుండి ఆ ప్రయాణికుడికి ఊహించని సర్‌ప్రైజ్‌ ఎదురైంది. 


రెయిలింగ్‌కు వేలాడుతున్న ఓ వ్యక్తి.. ప్యాసింజర్‌ చేతిలో ఫోన్‌ను రెప్పపాటులో లాగేసుకున్నాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదుగానీ.. బీహార్‌ బెగుసారాయ్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రెయిలింగ్‌కు కట్టేసుకుని.. ముఖానికి ముసుగు దొంగకు ముద్దుగా స్పైడర్‌మ్యాన్‌ అని పేరు పెట్టారు నెటిజన్స్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement