ఒకవైపు భార్య.. మరోవైపు ప్రియురాలు.. బెడిసి కొట్టిన యువకుని ప్లాన్‌! | married man extra love affair ready to live with both | Sakshi
Sakshi News home page

ఒకవైపు భార్య.. మరోవైపు ప్రియురాలు.. బెడిసి కొట్టిన యువకుని ప్లాన్‌!

Published Wed, Jun 14 2023 11:41 AM | Last Updated on Wed, Jun 14 2023 11:42 AM

married man extra love affair ready to live with both - Sakshi

ఆ యువకుడు ఒక వైపు భార్యను, మరోవైపు ప్రియురాలిని ఇద్దరినీ మెయింటెయిన్‌ చేయలనుకున్నాడు. అయితే ఈ విషయం భార్యకు తెలియడంతో నానా హంగామా జరిగింది. తరువాత విషయం పోలీసుల వరకూ చేరింది.

బీహార్‌లోని ముజప్ఫర్‌పూర్‌లో ఒక వివాహితుడు ఫేస్‌బుక్‌ మాధ్యమలో ఒక పెళ్లయిన యువతితో అఫైర్‌ పెట్టుకున్నాడు. తరువాత ఇంటినుంచి పారిపోయి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే భర్తకు మరొక యువతితో సంబంధం ఉందని భార్యకు తెలిసింది. ఆమె ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. వెంటనే పోలీసులు ఆ యువకుడిని, అతని ప్రియురాలిని పట్టుకున్నారు. వారిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ  ఉదంతం ముజప్ఫర్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కేదార్‌నాథ్‌ రోడ్డులో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక యువకునికి 2016లో వివాహం అయ్యింది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అతనికి ఫేస్‌ బుక్‌ మాధ్యమంలో మరో వివాహితతో ప్రేమ వ్యవహారం ఏర్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువకుడు తన భార్యకు తెలియకుండా ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన ఆ మహిళను కూడా పెళ్లి చేసుకుని ఒకరికి తెలియకుండా మరొకరిని మెయింటైన్‌ చేయాలనుకున్నాడు. 

అయితే ఈ విషయం అతని భార్యకు తెలిసింది. దానిని ఆమె వ్యతిరేకించింది. దీంతో ఆ యువకుడు ఇంటి నుంచి వెళ్లి పోయాడు. ఒక ఆలయంలో ఆ మహిళను పెళ్లాడాలని ప్లాన్‌ చేసుకున్నాడు. ఇంతలో అతని భార్య పోలీసుకు ఈ సమాచారం అందించింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని, ఆ మహిళను పట్టుకున్నారు. ఈ సందర్బంగా ఆ యువకుని భార్య మాట్లాడుతూ తన భర్త 4 రోజుల క్రితం ఏదోపని ఉందని బయటకు వెళ్లాడని, దీంతో తాను భర్తపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. పోలీసుల జోక్యంతో సమస్య పరిష్కారం అయ్యిందన్నారు.

ఇది కూడా చదవండి: ‘బయటకు వెళ్లి సిగరెట్‌ కాల్చుకో’ అన్నాడని..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement