
గౌతమ బుద్ధుడు ధ్యానం చేసిన ధూళికట్ట
శాతవాహనులు నిర్మించిన బౌద్ధ స్తూపం
దేశ విదేశాల నుంచి బౌద్ధుల రాక
ఏటా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న భిక్షువులు
పర్యాటకాభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్యం
జూలపల్లి (పెద్దపల్లి): చుట్టూ పచ్చని పంట పొలాలు.. సమీ పంలోనే గలగల పారే హుస్సేన్‌మియా వాగు.. పక్కనే అతిప్రాచీన కోటలు.. మధ్య ఎత్త యిన కట్టడం.. అదే ధూళికట్టలో శాతవాహ నులు నిర్మించిన బౌద్ధ స్తూపం.. ఎంతో ఆక ర్షణీయంగా కనిపిస్తున్న కోటలు, బౌద్ధ స్తూపం అభివృద్ధికి నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దేశ, విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తూ.. ఇక్కడ చారిత్రక ప్రాశస్త్యానికి మంత్రముగ్ధులవుతున్నా.. పాలకులకు పట్టడం లేదు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి – ఎలిగేడు మండలాల మధ్య విస్తరించిన ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలనే డిమాండ్ పెరుగుతోంది.
ధూళికోటే.. ధూళికట్ట..
శాతవాహనులు దశాబ్దాల క్రితం ధూళికోట (ధూళికట్ట)ను రాజధానిగా చేసుకుని పాలించారన్నది చరిత్రకారుల కథనం. ఇక్కడే బౌద్ధ స్తూపం నిర్మించగా, గౌతమ బుద్ధుడు «ధ్యానం చేసినట్లు చెబుతున్నారు. 1972లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో అతి ప్రాచీన గ్రామ ఆనవాళ్లు, ఆధారాలు లభించాయి. ధూళికట్ట శివారులోని కోట ప్రాంతంలో తవ్వకాలు చేప ట్టిన పురావస్తు శాఖ.. ఇక్కడ లభించిన వస్తు వులను హైదరాబాద్‌లోని మ్యూజియానికి తర లించి భద్రపరిచింది. వడ్కాపూర్ శివారులోని 741, 742 సర్వే నంబర్లలో పురావస్తు శాఖ తవ్వకాలు జరపగా.. బౌద్ధ స్తూపం, బుద్ధుడు, నాగశేషు, కొన్ని విగ్రహాలు లభించాయి. వాటిని కూడా మ్యూజియంలో భద్రపరిచారు. బౌద్ధ స్తూపం 0.19 గుంటల విస్తీర్ణంలో ఉంది. పురావస్తు శాఖ తరపున అభివృద్ధి చేసేందుకు వడ్కాపూర్ రైతులను ఒప్పించి.. మరో ఎనిమిది ఎకరాలను కొనుగోలు చేశారు.
అమలుకు నోచని హామీలు..
బౌద్ధ స్తూపం, పరిసరాలను అభివృద్ధి చేస్తా మని అప్పటి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ హామీ ఇచ్చారు. ఈమేరకు రూ.50 లక్షలు కేటాయించారు. అధికారులు ప్రణాళికలు రూపొందించడంలో నిర్లక్ష్యం వహించడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి.
ఏటా బుద్ధుని జయంతి..
బౌద్ధ స్తూపం వద్ద 2003 నుంచి ఏటా గౌతమ బుద్ధుని జయంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దాతల సాయంతో బౌద్ధ దమ్మ ప్రచార పరిషత్ సభ్యులు ప్రత్యేక కార్యక్రమా లు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు బౌద్ధ భిక్షువులతోపాటు పలు ప్రాంతాల నుంచి బౌద్ధులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
కనీస సౌకర్యాలు కరువు..
ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే డిమాండ్లు నెరవేరడం లేదు. ధూళికట్ట ఎల్లమ్మ ఆలయం నుంచి స్తూపం వరకు రోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరైనా.. రైతులు తమ భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో రోడ్డు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, వసతి గదులు అందుబాటులోకి రాకుండా పోయాయి. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నల్ల మనోహర్‌రెడ్డి సొంత నిధులు వెచ్చించి ఈ ప్రాంతంలో ధ్యానముద్ర నిర్మించారు. అందులో గౌతమ బుద్ధుని పాల రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
పర్యాటకాభివృద్ధి చేయాలి
అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఉన్న ధూళికట్ట ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. కనీస సౌకర్యాలు కల్పించాలి. పర్యాటకానికి ఆటంకంగా ఉన్న వడ్కాపూర్ నుంచి బౌద్ధ స్తూపం, ధూళికట్ట రేణుకా ఎల్లమ్మ ఆలయం వరకు రోడ్డు నిర్మించాలి. ఏటా నిర్వహించే ఉత్సవాలు, ప్రార్థనలకు కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి.
– మొగురం రమేశ్, మాజీ సర్పంచ్, వడ్కాపూర్
Comments
Please login to add a commentAdd a comment