నీలేశ్ హ్యాట్రిక్
సాక్షి, హైదరాబాద్: పి. నీలేశ్ (4/46) రాణించడంతో బడ్డింగ్ స్టార్ 39 పరుగుల తేడాతో శ్రీచక్రపై విజయం సాధించింది. నీలేశ్ హ్యాట్రిక్ సాధించడం విశేషం. 234 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీచక్ర మ్యాచ్ రెండో రోజు శుక్రవారం 194 పరుగులకు ఆలౌటైంది. రఘువీర్ (132 బంతుల్లో 83 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), డి. నరేశ్ (87 బంతుల్లో 55; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించినా తమ జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు. భరణ్, అమృత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
ఇతర మ్యాచ్‌ల ఫలితాలు:
బాలాజీ కోల్ట్స్: 255 (జైనుద్దీన్ ఖాద్రీ 110, విశాల్ తివారి 73, కార్తీక్ 4/34, అనీశ్ 4/75), అవర్స్ సీసీ: 107 (సంతోష్ గౌడ్ 59, అంకిత్ శర్మ 5/25)
ఉస్మానియా: 290 (ఫణీంద్ర 64 నాటౌట్, రాంప్రసాద్ 47, ఫర్హాన్ 7/117), పాషా బీడి: 109 (రోహిత్ ఖురానా 31, ఫణీంద్ర 3/6, నవీన్ 3/28), దినేశ్ 3/40)
గౌడ్స్ ఎలెవన్: 249, టీమ్ స్పీడ్: 250/8 (డీజీజే చైతన్య 54, నిఖిల్ నాయుడు 53 నాటౌట్, గణపతి హేమంత్ 40, నితిన్ గోపాల్ 4/99)
ఎంసీసీ: 163, హెచ్‌బీసీసీ: 165/8 (పుష్కర్ 57 నాటౌట్, ప్రిన్స్ ఓజా 5/74)
దక్కన్ కోల్ట్స్ ఘన విజయం
‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ మ్యాచ్‌లో దక్కన్ కోల్ట్స్ 105 పరుగుల తేడాతో సూపర్ స్టార్‌ను చిత్తు చేసింది. ముందుగా దక్కన్ కోల్ట్స్ 152 పరుగులు సాధించింది. చైతన్యరెడ్డి (52), కృష్ణ (33) రాణించగా, సుమంత్ 42 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతర సూపర్ స్టార్ 47 పరుగులకే కుప్పకూలింది. ఆంజనేయులు (5/9), భరత్ (5/28) చెలరేగి కోల్ట్స్‌కు విజయాన్నందించారు.