డజను గుడ్లు పగలకుండా షాప్ నుంచి ఇంటికి తీసుకురావడానికి తలమునకలైపోతాము. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా 735 గుడ్లను తల టోపీపై ఉంచుకుని, అవి పగలకుండా నడిచి అందరినీ అబ్బురపరిచాడు. తన టాలెంట్‌తో ప్రపంచ రికార్డు కొట్టాడు కూడా. గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
చదవండి: లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఏకంగా రొటేటింగ్ హౌస్ కట్టించాడు!!
పశ్చిమ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌కు చెందిన గ్రెగరీ దా సిల్వా అనే వ్యక్తి ‘ఎగ్ మ్యాన్’గా అందరికీ సుపరిచితుడు. అందుకు ఒక పెద్ద హిస్టరీనే ఉంది. ప్రపంచమంతా తిరిగి తన ట్యాలెంట్‌ను వివిధ దేశాల్లో ప్రదర్శించాడట. అంతేకాకుండా పలు టెలివిజన్ షోలలో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. దీనితో అతడు వరల్డ్ ఫేమస్ ఎగ్‌మ్యాన్‌గా అందరికీ గుర్తుండిపోయాడు.
చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!!
ఈ వీడియోలో ఇతను ధరించిన టోపీపై గుడ్లన్నింటినీ అతికించడానికి మూడు రోజుల టైం పట్టిందట. చైనాలో సీసీటీవీ ఛానెల్ నిర్వహించిన గిన్నీస్ వరల్డ్ రికార్డు స్పెషల్ షోలో దీనిని తలపై పెట్టుకుని కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ ప్రదర్శించాడు. దీనిని చూసిన గిన్నీస్ రికార్డు అధికారులు ‘వావ్’అనకుండా ఉండలేక పోయారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక గుడ్లు సింగిల్ టోపీపై ధరించిన మొదటి వ్యక్తిగా గిన్నీస్ రికార్డులో స్థానం సంపాధించుకున్నాడు.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో ప్రశంశల్లో ముంచెత్తుతున్నారు. ‘ఇది చాలా ఇమ్‌ప్రెస్సివ్‌గా ఉంది’ అని ఒకరు, ‘మొత్తం ఎగ్స్ బరువు ఎంత ఉంటుందని’ మరొకరు సరదాగా కామెంట్ చేశారు. వేల సంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
చదవండి: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..!
Comments
Please login to add a commentAdd a comment