ట్రైన్ టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష!.. స్పందించిన రైల్వే శాఖ | Railway Ministry Clarity On E Tickets Booking IRCTC Tweet Viral | Sakshi
Sakshi News home page

ట్రైన్ టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష!.. స్పందించిన రైల్వే శాఖ

Published Tue, Jun 25 2024 9:44 PM | Last Updated on Wed, Jun 26 2024 11:09 AM

Railway Ministry Clarity On E Tickets Booking IRCTC Tweet Viral

ఐఆర్‌సీటీసీలో ట్రైన్ టికెట్స్ బుక్ చేయాలంటే తప్పకుండా పర్సనల్ అకౌంట్స్ ద్వారా మాత్రమే బుక్ చేయాలని, బంధువులు లేదా ఫ్రెండ్స్ అకౌంట్స్ ద్వారా బుక్ చేస్తే వారికి జైలు శిక్ష పడటమే కాకూండా.. రూ. 10000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపైనా మొదటిసారి 'రైల్వే' స్పందించింది.

రైల్వే శాఖ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నిజం కాదని కొట్టిపారేసింది. ఇవన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మాత్రమే జరుగుతున్న ప్రచారమని స్పష్టం చేసింది. ఐఆర్‌సీటీసీలో పర్సనల్ ఐడీ నుంచి ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోవచ్చని చెప్పింది.

ఐఆర్‌సీటీసీలో ఒక యూజర్ ఐడీ ద్వారా నెలకు కేవలం 12 టికెట్లను పొందవచ్చు. ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకున్న వ్యక్తులు ఒక నెలలో 24 టికెట్స్ బుక్ చేసుకోవచ్చని రైల్వే శాఖ వివరించింది. పర్సనల్ ఐడీ ద్వారా బుక్ చేసిన టికెట్స్ ఇతరులకు విక్రయించడానికి కాదు.. ఒకవేలా అలా జరిగితే సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటామని తెలిపింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement