క్షణాల్లో స్నాక్స్ | new application is designed to district students | Sakshi
Sakshi News home page

క్షణాల్లో స్నాక్స్

Published Wed, Aug 12 2015 2:00 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

క్షణాల్లో స్నాక్స్

క్షణాల్లో స్నాక్స్

సరికొత్త అప్లికేషన్ రూపొందించిన జిల్లా విద్యార్థులు
ఫోన్ ద్వారానే స్నాక్స్ బుక్ చేసుకునే అవకాశం
ఏషియన్, గ్లోబల్ కంపెనీలతో ఒప్పందం

 
హన్మకొండ:  కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య సినిమా టిక్కెట్టు సాధించడం కష్టం కావడంతో ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వరంగల్ విద్యార్థులు కొత్త ఆప్లికేషన్ (యూప్)ను రూపొందించారు. ఆండ్రాయిడ్, విండోస్ ఫ్లాట్‌ఫారమ్‌ల పని చేసే స్మార్ట్‌ఫోన్ల కోసం డైన్‌స్నాక్ పేరుతో సరికొత్త యాప్ అందుబాటులోకి తెచ్చారు.

 శ్రమలేకుండా
ఆండ్రాయిడ్, విండోస్ స్మార్ట్‌ఫోన్ల ద్వారా డైన్‌స్మార్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్‌ను వినియోగించే ముందు జీపీఎస్‌ను అనేబుల్ చేయాలి. ఆ వెంటనే మన నగరంలో డైన్‌స్మార్ట్ సేవలు ఏ సినిమా థియేటర్లలో అందుబాటులో ఉందనేది మొబైల్ ఫోన్‌పై ప్రత్యక్షం అవుతుంది. ఎంపిక చేసిన సినిమా థియేటర్లకు వెళ్లినప్పుడు డైన్‌స్మార్ట్ అప్లికేషన్‌లో ఉన్న సూచనలకు అనుగుణంగా వినియోగదారుడు తన సీటు నంబరును పేర్కొంటూ కావాల్సిన స్నాక్స్, కూల్‌డ్రింక్స్‌ను ఆర్డర్ చేయాలి. మీరు చేసిన ఆర్డర్ నిర్ధారించుకునేందుకు మీరు ఉపయోగిస్తున్న మొబైల్ నంబర్‌కు ఆటోమేటిక్ జనరేడ్ కోడ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. అంతే పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలోనే స్నాక్స్ మీ సీటు దగ్గరికే సర్వ్ చేస్తారు. మీ ఆర్డర్‌కు సంబంధించిన డబ్బులను ఆర్డర్‌ను స్వీకరించిన వెంటనే చెల్లించవచ్చు.
 
మేడ్ బై వరంగల్ యూత్
 వరంగల్‌కు చెందిన ఎల్లబోయిన తరుణ్, కొండపల్లి రిషిత, దీప్తిరేఖ, అరవింద్, తరుణ్‌రెడ్డి, వినయ్ కొల్లూరిలు  హైదరాబాద్‌కు చెందిన మరికొంత మంది స్నేహితులతో కలిసి ఈ అప్లికేషన్‌ను రూపొందిం చారు.  స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా దినాదినాభివృద్ధి చెందుతున్న ఈ కామర్స్‌లో తమ వంతు ప్రయత్నం చేయాలనే లక్ష్యంతో లియోజ్యూస్ టెక్నాలజీస్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలిప్రయత్నంలో భాగంగా స్మార్ట్‌డైన్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. అంతటితో సరిపెట్టకుండా మార్కెటింగ్‌లోనూ తమ ప్రతిభను చూపిస్తున్నారు. మొదటి ప్రయత్నంలోనే ఏషియన్, గ్లోబల్ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న సినిమా థియేటర్లలో తమ స్మార్ట్‌డైన్ ద్వారా సేవలు అందించేలా ఒప్పందం చేసుకున్నారు. ఆగష్టు 10వ తేది నుంచి  వరంగల్ నగరంలో ఏషియన్ శ్రీదేవిమాల్‌లో ఉన్న మూడు స్క్రీన్లలో డైన్‌స్మార్ట్ సేవలు లభిస్తున్నాయి.
 
 మన రాష్ట్రంలో ఫస్ట్
 సినిమా థియేటర్‌లో ఉన్న ప్రేక్షకుడికి స్నాక్స్, కూల్‌డ్రింకులను సర్వ్ చేసే అప్లికేషన్‌ను రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మేము అందుబాటులోకి తెచ్చాం. తొలి ప్రయత్నానికే మంచి స్పందన వచ్చింది. ప్రముఖ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లలో సేవలు మొదలయ్యాయి. త్వరలోనే నిజామాబాద్, ఖమ్మంలో సేవలు ప్రారంభిస్తాం. పీవీఆర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం.
 -  ఎల్లబోయిన తరుణ్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement