New application
-
Asara Pension: 57 ఏళ్లు నిండిన వారికి.. ఈనెల 31 వరకు గడువు
సాక్షి, నెన్నెల(ఆదిలాబాద్): ఆసరా పింఛన్ కోసం 57 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈనెల 31 వరకు మీసేవ, ఈసేవ కేంద్రాల్లో దరఖాస్తులు అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో నూతనంగా పింఛన్ పొందేందుకు అర్హతలు కలిగి ఉన్న దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురించాయి. మూడేళ్ల క్రితమే సర్వే.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు మూ డేళ్ల క్రితమే జిల్లాలో సర్వే నిర్వహించా రు. ఓటరు జాబితా ఆధారంగా కొత్తగా జిల్లాల్లో 32 వేల మంది వృద్ధాప్య పింఛన్‌కు అర్హత కలిగి ఉన్నారని గుర్తించారు. సర్వే తర్వాత ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించలేదు. ప్రస్తుతం 57 ఏళ్ల వారికి ఆసరా పింఛన్లు ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేయడంతో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మీసేవ.. ఈసేవ కేంద్రాల్లో.. నూతనంగా పింఛన్ పొందేందుకు అర్హులు దరఖాస్తులను మీసేవ, ఈసేవ కేంద్రాల్లో అందజేయాలి. వయస్సు నిర్ధారణ కోసం పాఠశాలలో జారీ చేసిన పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, ఓటరు గుర్తింపు కార్డులో నమోదైన తేదీని పరిగణలోకి తీసుకుంటారు. దరఖాస్తుదారుల నుంచి ఎలాంటి సేవా రుసుం తీసుకోవద్దని ప్రభుత్వం సూచించింది. అందరికీ తామే చెల్లిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. -
ఐసోలేషన్ రోగులకు ‘హితం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కరోనా రోగుల బాగోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్‌కు హోం ఐసోలేషన్ ట్రీట్మెంట్ అప్లికేషన్ మేనేజ్మెంట్ (హితం) అనే పేరును ఖరారు చేసింది. ప్రస్తుతం ట్రయల్స్‌లో ఉన్న ఈ యాప్ రెండు మూడు రోజుల్లో రోగులకు అందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్ ఐఐటీతో కలిసి ఈ యాప్‌ను సిద్ధం చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగులకు డాక్టర్ల సలహాలు, సూచనలు, కౌన్సెలింగ్ ఇవ్వడమే దీని ప్రధాన ఉద్దేశం. పూర్తిగా డాక్టర్లతోనే ఈ యాప్‌ను నడిపిస్తారు. ఒక్కో డాక్టర్‌కు 50 మంది కరోనా రోగులను కేటాయిస్తారు. రోగులతో డాక్టర్లు ప్రతీరోజూ మాట్లాడుతారు. అలాగే రోగులు కూడా రేయిపగలూ అన్న తేడా లేకుండా ఎప్పుడంటే అప్పుడు తనకు కేటాయించిన డాక్టర్‌తో మాట్లాడవచ్చు. యాప్‌లో అత్యవసర బటన్ నొక్కితే ‘108’కు కనెక్ట్... కరోనా సోకినవారిలో దాదాపు 9 వేల మంది వరకు ఇళ్లల్లోనే (హోం ఐసోలేషన్) ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే చాలాచోట్ల ఇళ్లల్లో ఐసోలేషన్‌లో ఉన్నవారికి సరైన చికిత్స, డాక్టర్ల సలహాలు, సూచనలు అందడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. కనీసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయం కూడా చెప్పేవారు లేరన్న ఆరోపణలు వచ్చాయి. ఐసోలేషన్ కిట్లు కూడా చాలా మందికి అందడంలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ‘హితం’పేరుతో యాప్‌ను తీసుకువస్తోంది. ఇళ్లల్లో ఐసోలేషన్‌లో ఉన్న వారికి ఏదైనా అత్యవసర వైద్య సహాయం అవసరమైతే డాక్టర్లను సంప్రదించవచ్చు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే యాప్‌లో ఉండే అత్యవసర బటన్ నొక్కితే జీపీఎస్ సిస్టం ద్వారా నేరుగా ‘108’కు కనెక్ట్ అవుతుంది. దీంతో రోగి ఉండే ఇంటికే 20 నిముషాల్లో నేరుగా 108 వాహనం వచ్చి సమీపంలోని కోవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్తుంది. రోగికి కేటాయించిన డాక్టర్‌కూ యాప్ ద్వారా ఈ సమాచారం అందుతుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. రోగుల సమాచారాన్ని మొత్తం యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. వారిలో ఎవరికి ఎలాంటి లక్షణాలు, ఇతర జబ్బులున్నాయో కూడా నిక్షిప్తం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి ఏర్పాటు చేస్తున్నట్లు ఒక వైద్యాధికారి తెలిపారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనూ కరోనా టెస్టులు, చికిత్స మరోవైపు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లోనూ కరోనా టెస్టులు, చికిత్స చేసేందుకు ఏర్పాటు చేసింది. అన్నిచోట్లా ర్యాపిడ్ టెస్టులు చేసేందుకు రంగం సిద్ధం చే సింది. మరికొన్ని లక్షల యాంటిజెన్ కిట్లకు ఆర్డర్ చేసింది. గ్రామాల్లో స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
అన్నదాతలకు ఆన్లైన్ కన్సల్టేషన్
సాక్షి, హైదరాబాద్: రైతులకు అండగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) రూపొందించిన టీకన్సల్ట్ యాప్ అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్‌లో టీకన్సల్ట్ ప్రారంభించామన్నారు. ఈ యాప్ ద్వారా పదివేల కన్సల్టేషన్లు చేయడాన్ని మంత్రి అభినందించారు. టీకన్సల్ట్ అగ్రికల్చర్ అప్లికేషన్‌ను వానాకాలంలో రైతాంగం ఉపయోగించుకోవాలని సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఒక మండలంలో నిర్వహించిన అనంతరం విదేశాల్లోని నిపుణులతోనూ మన రైతులను అనుసంధానం చేసేందుకు కృషి చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్వయంగా నిపుణులతో అనుసంధానం అయ్యారు. ఈ యాప్‌నకు సంబంధించి తొలి వినియోగదారుడిగా మారి తెలంగాణ వ్యవసాయ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్, రిటైర్డ్ ప్రొఫెసర్ జలపతిరావుతో టీకన్సల్ట్ ద్వారా సందేహాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు, అగ్రి సైంటిస్టులను అనుసంధానం చేయాలని సూచించారు. ఈ ఆన్లైన్ సేవలను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల మాట్లా డుతూ టీటా ద్వారా ఇప్పటివరకు విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలు అందించామని, దీనికి కొనసాగింపుగా వ్యవ సాయానికి సాంకేతికతను జోడిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, వ్యవసాయ శాఖ ఓఎస్డీ, టీటా సలహాదారు ఎల్.కె.సంగమేశ్వరరావు పాల్గొన్నారు. -
కరోనా అలర్ట్ @ ‘ఆరోగ్యసేతు’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌పై ఇప్పటికే లాక్డౌన్ యుద్ధం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా డిజిటల్ వార్‌కు దిగింది. వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకోవల్సిన జాగ్రత్తలు, దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య, అప్డేట్స్ను ప్రజలకు అందించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ‘ఆరోగ్యసేతు’యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. రెండ్రోజుల క్రితం నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా ఈ యాప్ వినియోగంలోకి వచ్చింది. ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలి.. రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా వైరస్ విరుగుడుకు ఇంకా మందు రాలేదు. అవగాహనతోనే దీనిని ఎదుర్కోగలమని చెబుతోన్న ప్రభుత్వం.. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రత్యేకంగా ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ► ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ప్లేస్టోర్‌లోకి వెళ్లి ‘ఆరోగ్య సేతు’పేరు నమోదు చేసిన వెంటనే యాప్ కనిపిస్తుంది. సూచనల ఆధారంగా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి. ► జీపీఎస్ ఆధారంగా లొకేషన్ ఎంపిక చేసుకున్నాక మొబైల్ నంబర్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ► ప్రస్తుతం 11 భాషల్లో యాప్ అందుబాటులో ఉంది. జీపీఎస్, బ్లూటూత్ నిరంతరం ఆన్‌లో ఉండాలి. అప్పుడే ఈ యాప్ కరోనా సమాచారం, స్థానిక వివరాలు అందిస్తుంది. అప్రమత్తం చేస్తుందిలా.. ► యాప్‌ను ఇప్పటివరకు 10లక్షల మందికిపైగా ఇన్స్టాల్ చేసుకున్నారు. యూజర్లు 4.6 పాయింట్ల రేటింగ్ ఇచ్చారు. 13,330 మంది సానుకూలమైన రివ్యూలు రాశారు. ► ఈ యాప్ కరోనా బారిన పడ్డవారెవరైనా మీ సమీపంలోకి వస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. ► కరోనా వైరస్ దుష్ప్రభావాలను ఎలా గుర్తించాలో అవగాహన కల్పిస్తూనే సెల్ఫ్ ఐసోలేషన్ ఎలా పాటించాలో సూచిస్తుంది. -
పిడుగు నుంచి తప్పించుకోవచ్చు..
కారుమబ్బులు కమ్ముకుని.. భారీ శబ్దాలతో ఉరుములు.. కళ్లు మిరుమిట్లు గొలిపే మెరుపులు వస్తున్నాయంటే పిడుగులు పడతాయి. ఈ పిడుగుపాటుకు ఎన్నో పశువులు, ఎందరో మనుషులు బలైపోతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాల్లో, చిట్లకింద ఉన్నవారే ఈ పిడుగుపాటుకు గురవుతున్నట్లు పలు ఘటనలు తెలుపుతున్నాయి. అసలు ఈ పిడుగుపాటు నుంచి రక్షించుకోవడం ఎలా? ఎక్కడ ఉంటే పిడుగు మనమీద పడకుండా ఉంటుంది? అనే విషయాలు పాఠకుల కోసం.. సాక్షి, అశ్వాపురం(ఖమ్మం) : ఈ ఏడాది వర్షాకాలం ఆరంభం నుండి పగలు ఎండ, సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పిడుగులు పడుతున్నా యి. పగలు విపరీతంగా ఎండ ఉండి సాయంత్రం గాలి భీభత్సం స్పష్టిస్తోంది. ఈ నెల 18న ఒక్కరోజే పిడుగుపాటుకు జిల్లాలో టేకులపల్లి మండలంలో ఇద్దరు, బూర్గంపాడు మండలంలో ఒక రైతు, రెండు కాడెడ్లు, 13 మేకలు మృతి చెందాయి. ఇలా ఏటా పిడుగుపాటుకు ఎందరో ప్రజలతోపాటు పశువులు, మేకలు, గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. ఉరుములు, మెరుపుల సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిడుగుపాటు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆరుబయట ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు... మేఘాల్లోని రుణ, ధనావేశాల చర్యల వల్ల విద్యుత్ తరంగాలు (మెరుపులు) ఏర్పడి భూమి మీదికి ప్రసరించడాన్నే పిడుగు అంటారని పలువురు నిపుణులు చెబుతున్నారు. అయితే వచ్చే ఆ మెరుపులో ఎంతో శక్తి దాగి ఉంటుందని, దానిని తాకిన అనంతరం ప్రాణాలు రెప్పపాటులో పోతాయని వారంటున్నారు. ముఖ్యంగా మెరుపులు విడుదలైనప్పుడు అవి భూమిపై ఎత్తుగా ఉండే పచ్చటి చెట్లపైనే పడే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో చెట్ల కింద ఉన్నవారు కూడా పిడుగుపాటుకు గురై మరణిస్తారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే సమయంలో చెట్ల కింద ఉండొద్దు. పొలాల్లో కూడా ఉండొద్దు. పొలాల్లో ఉంటే అక్కడ ఉండే మొక్కలకన్నా మనిషే ఎత్తుగా ఉంటాడు కాబట్టి అతడిపైనే పడే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో అరచేతులతో చెవులు మూసుకొని నేలపై మోకాళ్ల మీద కూర్చొని తల కిందకు వంచి ఉండాలి. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలకు దూరంగా ఉండాలి. ఎత్తైన ప్రదేశంలో ఉండకూడదు. ఉరుములు, మెరుపుల సమయంలో సెల్ఫోన్లో మాట్లాడకూడదు. ఈదురుగాలి, వర్షం సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ తీగల కింద, సమీపంలో ఉండకూడదు.గుండె సంబంధిత వ్యాధి ఉన్న వారు వర్షం, ఉరుములు, మెరుపుల సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► మొబైల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యుత్‌కు అనుసంధానం చేయరాదు. ► ఆ సమయంలో విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు వాడరాదు. ► చేతులు కడగటం, స్నానం చేయడం, వంట సామాన్లు కడగటం, బట్టలు ఉతకడం చేయరాదు. ► కాంక్రీట్ నేలపై పడుకోవడం, గోడకు ఆనుకోవడం చేయకూడదు. ► విద్యుత్ వాహకాలు (ఇనుప తలుపులు, నీటి పైపులు) తాకకూడదు. ► కిటికీల తలుపులు మూసివేయాలి. ► చివరి ఉరుము శబ్దం విన్న తరువాత 30 నిమిషాల వరకు ఇంట్లోనే ఉండాలి. ► పిడుగుపాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► పిడుగుపాటుకు గురికాగానే అంబులెన్స్‌కు, వైద్యులకు సమాచారం అందించాలి. ► పిడుగుపాటు బాధితుడిని తాకడం సురక్షితమే కాబట్టి వెంటనే ప్రథమ చికిత్స అందించాలి. ► పిడుగు తాకిన ప్రాంతం తడిగా, చలిగా ఉంటే బాధితుడి శరీరానికి నేలకు మధ్య దుప్పటి ఉంచాలి. ► ఊపిరి ఆగిపోతే నోట్లో నోరు పెట్టి ఊదాలి. ► గుండె చప్పుడు ఆగిపోతే వైద్యులు వచ్చే లోపు రెండు చేతులతో చాతి భాగాన్ని గట్టిగా ఒత్తుతూ ఉండాలి. ► బాధితుడి నాడి, శ్వాస పని చేస్తుంటే మిగిలిన అవయవాల పనితీరును పరిశీలించాలి. వచ్చేసింది వజ్రపాత్.. పిడుగు ఎక్కడ, ఎప్పుడు పడుతుందో తెలియక ప్రాణనష్టాలు జరుగుతున్నాయి. పిడుగు ఎక్కడ పడుతుందో తెలసుకునే మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. వజ్రపాత్ యాప్ ద్వారా పిడుగు ఎక్కడ పడుతుందో తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో ప్లేస్టోర్‌లో వజ్రపాత్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఫోన్ నంబర్ అడుగుతుంది. ఫోన్ నంబర్ ఎంటర్ చేయగానే మనకు ఏ భాష కావాలో ఎంచుకోవాలి. అనంతరం యాప్‌కు సంబంధించిన ముఖచిత్రం వస్తుంది. వజ్రపాత్ యాప్ ముఖచిత్రంపై రెండు రకాల సమాచారం వస్తుంది. ఎడమ చేతి వైపు పిడుగు గుర్తుతో పాటు పిడుగు సమాచారం వస్తుంది. ఇక్కడ నొక్కితే మనం ఉన్న ప్రాంతం మ్యాప్‌లో వస్తుంది. మ్యాప్‌లో ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో వలయాలు వస్తాయి. వలయాల పక్కన అంకెలు ఉంటాయి. ఆ అంకెల ప్రకారం కొద్ది సేపట్లో ఎంత దూరంలో పిడుగుపడే అవకాశం ఉందో చూపిస్తుంది. పిడుగుపడే అవకా శం ఉంటే ఎంత దూరంలో పడుతుందో పిన్ గుర్తు కనిపిస్తుంది. యాప్‌లో కుడిభాగంలో పిడుగుపాటు హెచ్చరికలు ఉంటాయి. ఇక్కడ నొక్కితే పిడుగు పడే అవకాశాలు ఉన్నాయా? లేదా? అనే సమాచారం వస్తుంది. -
క్షణాల్లో స్నాక్స్
సరికొత్త అప్లికేషన్ రూపొందించిన జిల్లా విద్యార్థులు ఫోన్ ద్వారానే స్నాక్స్ బుక్ చేసుకునే అవకాశం ఏషియన్, గ్లోబల్ కంపెనీలతో ఒప్పందం హన్మకొండ: కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య సినిమా టిక్కెట్టు సాధించడం కష్టం కావడంతో ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వరంగల్ విద్యార్థులు కొత్త ఆప్లికేషన్ (యూప్)ను రూపొందించారు. ఆండ్రాయిడ్, విండోస్ ఫ్లాట్ఫారమ్ల పని చేసే స్మార్ట్ఫోన్ల కోసం డైన్స్నాక్ పేరుతో సరికొత్త యాప్ అందుబాటులోకి తెచ్చారు. శ్రమలేకుండా ఆండ్రాయిడ్, విండోస్ స్మార్ట్ఫోన్ల ద్వారా డైన్‌స్మార్ట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్‌ను వినియోగించే ముందు జీపీఎస్‌ను అనేబుల్ చేయాలి. ఆ వెంటనే మన నగరంలో డైన్‌స్మార్ట్ సేవలు ఏ సినిమా థియేటర్లలో అందుబాటులో ఉందనేది మొబైల్ ఫోన్‌పై ప్రత్యక్షం అవుతుంది. ఎంపిక చేసిన సినిమా థియేటర్లకు వెళ్లినప్పుడు డైన్‌స్మార్ట్ అప్లికేషన్లో ఉన్న సూచనలకు అనుగుణంగా వినియోగదారుడు తన సీటు నంబరును పేర్కొంటూ కావాల్సిన స్నాక్స్, కూల్‌డ్రింక్స్‌ను ఆర్డర్ చేయాలి. మీరు చేసిన ఆర్డర్ నిర్ధారించుకునేందుకు మీరు ఉపయోగిస్తున్న మొబైల్ నంబర్‌కు ఆటోమేటిక్ జనరేడ్ కోడ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. అంతే పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలోనే స్నాక్స్ మీ సీటు దగ్గరికే సర్వ్ చేస్తారు. మీ ఆర్డర్‌కు సంబంధించిన డబ్బులను ఆర్డర్‌ను స్వీకరించిన వెంటనే చెల్లించవచ్చు. మేడ్ బై వరంగల్ యూత్ వరంగల్‌కు చెందిన ఎల్లబోయిన తరుణ్, కొండపల్లి రిషిత, దీప్తిరేఖ, అరవింద్, తరుణ్‌రెడ్డి, వినయ్ కొల్లూరిలు హైదరాబాద్‌కు చెందిన మరికొంత మంది స్నేహితులతో కలిసి ఈ అప్లికేషన్‌ను రూపొందిం చారు. స్మార్ట్ఫోన్ల ద్వారా దినాదినాభివృద్ధి చెందుతున్న ఈ కామర్స్‌లో తమ వంతు ప్రయత్నం చేయాలనే లక్ష్యంతో లియోజ్యూస్ టెక్నాలజీస్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలిప్రయత్నంలో భాగంగా స్మార్ట్డైన్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. అంతటితో సరిపెట్టకుండా మార్కెటింగ్‌లోనూ తమ ప్రతిభను చూపిస్తున్నారు. మొదటి ప్రయత్నంలోనే ఏషియన్, గ్లోబల్ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న సినిమా థియేటర్లలో తమ స్మార్ట్డైన్ ద్వారా సేవలు అందించేలా ఒప్పందం చేసుకున్నారు. ఆగష్టు 10వ తేది నుంచి వరంగల్ నగరంలో ఏషియన్ శ్రీదేవిమాల్‌లో ఉన్న మూడు స్క్రీన్లలో డైన్‌స్మార్ట్ సేవలు లభిస్తున్నాయి. మన రాష్ట్రంలో ఫస్ట్ సినిమా థియేటర్లో ఉన్న ప్రేక్షకుడికి స్నాక్స్, కూల్‌డ్రింకులను సర్వ్ చేసే అప్లికేషన్‌ను రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మేము అందుబాటులోకి తెచ్చాం. తొలి ప్రయత్నానికే మంచి స్పందన వచ్చింది. ప్రముఖ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లలో సేవలు మొదలయ్యాయి. త్వరలోనే నిజామాబాద్, ఖమ్మంలో సేవలు ప్రారంభిస్తాం. పీవీఆర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. - ఎల్లబోయిన తరుణ్ -
యూట్యూబ్‌లో ఇక త్రీడీ వీడియోలు
యూట్యూబ్‌లో త్రీడీ వీడియోలను, 360 డిగ్రీల కోణంలో వర్చువల్ దృశ్యాలను వీక్షించే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని యూట్యూబ్ సీఈవో సుసాన్ వోజ్సికీ కాలిఫోర్నియాలో జరిగిన ఆరో వార్షిక విడ్కాన్ ఈవెంట్లో ప్రకటించారు. ఇప్పటికే త్రీడీ యాడ్స్‌ను యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నామని, త్వరలో అన్ని త్రీడీ, 360 కోణంలో వీడియోలను, దృశ్యాలను ఎవరికి వారు అప్లోడ్ చేసుకునేలా ఆధునీకరించిన అప్లికేషన్‌ను విడుదల చేస్తున్నామని చెప్పారు. కంప్యూటర్ స్క్రీన్లపై మౌస్‌ను కదిలించడం ద్వారా మనకు కావాల్సిన యాంగిల్స్‌లో వీడియో దృశ్యాలను కదిలించే అవకాశం ఈ యాప్ ద్వారా సమకూరుతుందని సుసాన్ తెలిపారు. సెల్ఫోన్లోనైతే ఫోన్‌ను కదలించడం ద్వారా యాంగిల్స్‌ను మార్చుకోవచ్చని చెప్పారు. ఈ కొత్త యాప్‌లో వీడియో, ఫొటో ఎడిటింగ్ టూల్స్ కూడా ఉంటాయని, వాటి ద్వారా త్రీడీ, 360 వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చని వివరించారు. ఆండ్రాయిడ్, మొబైల్ వెర్షన్లలో ఈ కొత్త యాప్‌ను ఉచితంగానే డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు. -
ఐఫోన్ వ్యసనం నుంచి బయటపడే అప్లికేషన్!
లండన్: యాపిల్ ఐఫోన్‌ను విపరీతంగా వాడేస్తున్నారా? క్షణానికోసారి ఫోన్‌వంక చూస్తున్నారా? ఇంట్లోవారితో కన్నా ‘యాప్స్’తో ఎక్కువ సమయం గడిపేస్తున్నారా? సోషల్ నెట్వర్కింగ్లో గంటలు క్షణాలుగా గడిచిపోతున్నాయా? వీటన్నింటికీ అవునని సమాధానం వస్తే...మీరు ఐఫోన్‌కు బానిసలైపోయినట్లే. ఇప్పుడా వ్యసనం నుంచి బయటపడేసే ఒక అప్లికేషన్ ఐఫోన్ యాప్ స్టోర్‌లో సిద్ధంగా ఉంది. మీ ఫోన్‌తో మీరు గడిపిన సమయాన్ని లెక్కించి, ఎక్కువగా వాడుతున్నారనిపిస్తే హెచ్చరించే యాప్ అది. కెవిన్ హాల్ష్ రూపొందించిన ‘మూమెంట్’ అనే ఆ యాప్‌లో ఫోన్‌ను ఉపయోగించే రోజువారీ లిమిట్‌ను కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ లిమిట్ దాటగానే ఆ యాప్ మీకో అలర్ట్ నోటీస్ పంపిస్తుంది.