పండగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బస్ ప్రయాణికుల సంఖ్య 62 శాతం పెరుగుతుందని ఆన్‌లైన్ బస్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ రెడ్‌బస్ అంచనా వేసింది. సెప్టెంబర్ 26-30తో పోలిస్తే(పండగలు లేనికాలం) అక్టోబర్ 10-14(దసరా పండగ)కాలంలో ఆన్‌లైన్‌లో బస్ సీట్ల బుకింగ్ పెరుగనుందని సంస్థ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దసరా ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి వివిధ నగరాల్లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పండగకు సొంత ఊళ్లకు వెళ్లనున్నారు. దసరా శనివారం వస్తుండడం, తర్వాత ఆదివారం సెలవు ఉండడంతో ప్రయాణాలు పెరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో రెడ్‌బస్ ఆన్‌లైన్‌లో బస్ సీట్ల బుకింగ్‌లలో 62 శాతం పెరుగుదలను అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: అతిపెద్ద షాపింగ్ ఈవెంట్‌కు తేదీ ఖరారు
ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చేవారిలో దాదాపు 84 శాతం బుకింగ్‌లు హైదరాబాద్-బెంగళూరు, విజయవాడ-బెంగళూరు, నెల్లూరు-బెంగళూరు రూట్లలో నమోదవతున్నాయని సంస్థ తెలిపింది. ఏపీ, తెలంగాణలోని వివిధ పట్టణాలకు ప్రయాణించే వారి బుకింగ్‌ల్లో 16 శాతం హైదరాబాద్-విజయవాడ-హైదరాబాద్, విశాఖపట్నం-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం, ఖమ్మం-హైదరాబాద్, హైదరాబాద్-ఖమ్మం రూట్లు ఉన్నాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment