Bus Tickets
-
పండగ సీజన్లో భారీగా సీట్ల బుకింగ్
పండగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బస్ ప్రయాణికుల సంఖ్య 62 శాతం పెరుగుతుందని ఆన్లైన్ బస్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ రెడ్‌బస్ అంచనా వేసింది. సెప్టెంబర్ 26-30తో పోలిస్తే(పండగలు లేనికాలం) అక్టోబర్ 10-14(దసరా పండగ)కాలంలో ఆన్లైన్లో బస్ సీట్ల బుకింగ్ పెరుగనుందని సంస్థ తెలిపింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దసరా ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి వివిధ నగరాల్లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పండగకు సొంత ఊళ్లకు వెళ్లనున్నారు. దసరా శనివారం వస్తుండడం, తర్వాత ఆదివారం సెలవు ఉండడంతో ప్రయాణాలు పెరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో రెడ్‌బస్ ఆన్లైన్లో బస్ సీట్ల బుకింగ్‌లలో 62 శాతం పెరుగుదలను అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అతిపెద్ద షాపింగ్ ఈవెంట్‌కు తేదీ ఖరారుఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చేవారిలో దాదాపు 84 శాతం బుకింగ్‌లు హైదరాబాద్-బెంగళూరు, విజయవాడ-బెంగళూరు, నెల్లూరు-బెంగళూరు రూట్లలో నమోదవతున్నాయని సంస్థ తెలిపింది. ఏపీ, తెలంగాణలోని వివిధ పట్టణాలకు ప్రయాణించే వారి బుకింగ్ల్లో 16 శాతం హైదరాబాద్-విజయవాడ-హైదరాబాద్, విశాఖపట్నం-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం, ఖమ్మం-హైదరాబాద్, హైదరాబాద్-ఖమ్మం రూట్లు ఉన్నాయని పేర్కొంది. -
టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్..
హన్మకొండ : మహిళలు, వృద్ధుల కోసం టీఎస్ ఆర్టీసీ ట్రావెల్–9 టికెట్ ప్రవేశపెట్టిందని ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పి.శ్రీనివాస్ రావు, హనుమకొండ డిపో మేనేజర్ బాబు నాయక్ తెలిపారు. ఆదివారం నుంచి ఈ టికెట్ అమల్లోకి వచ్చిందని వారు వేర్వేరు ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వినియోగించుకోవచ్చన్నారు. పల్లె వెలుగు బస్సుల్లో ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని తెలిపారు. రూ.100 చెల్లించి టికెట్ తీసుకుని ఒక రోజులో 60 కిలో మీటర్లు ప్రయాణించొచ్చన్నారు. ప్రతి సర్వీస్‌లో కండక్టర్ వద్ద ఈ టికెట్ అందుబాటులో ఉంటుందన్నారు. దీని ద్వారా ప్రయాణికుడికి రూ.20 నుంచి రూ.40 వరకు ఆదా అవుతుందన్నారు. 60 ఏళ్లపై బడిన వృద్ధులు, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
పేటీఎంలో బస్ టికెట్ కొంటే ఆఫర్లే.. ఆఫర్లు!
న్యూఢిల్లీ: పండుగ సీజన్ (బిహు, వైశాఖి) పురస్కరించుకుని ఆర్థిక సేవల సంస్థ పేటీఎం తాజాగా ఏప్రిల్ 17 నుంచి 19 మధ్య ట్రావెల్ సేల్ ఆఫర్లను ప్రకటించింది. బస్ టికెట్ల చార్జీలపై 25 శాతం డిస్కౌంటు అందించనున్నట్లు తెలిపింది. అలాగే రూ. 3,000 వరకు క్యాష్‌బ్యాక్, 1 బస్ టికెట్ కొంటే 1 టికెట్ ఉతం వంటి ఆఫర్లను కూడా పొందేందుకు అవకాశం ఉందని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వివరింంది. 2,500 పైలుకు బస్ ఆపరేటర్ల నుంచి తక్కువ చార్జీలకే టికెట్లు పొందవచ్చని తెలిపింది. -
దుర్గగుడి బస్సుల్లో ఉచిత ప్రయాణం! టికెట్ల రద్దు కోసం ప్రతిపాదన
విజయవాడ: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దర్శనానికి విచ్చేసే భక్తులకు దేవస్థానం బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, దుర్గాఘాట్ నుంచి ఇంద్రకీలాద్రి పైకి దేవస్థానం నడుపుతున్న బస్సుల్లో వసూలు చేస్తున్న నామమాత్రపు చార్జీని సైతం రద్దు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు దేవదాయశాఖ మంత్రి, కమిషనర్‌కు ఆలయ అధికారులు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు.. దుర్గగుడికి తొమ్మిది బస్సులు ఉన్నాయి. వాటిలో నాలుగు బస్సులను రోజూ విజయవాడ రైల్వేస్టేషన్, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి దుర్గగుడి పైకి నడుపుతున్నారు. మరో మూడు బస్సులను కొండ దిగువన ఉన్న దుర్గాఘాట్ నుంచి కొండ పైకి నడుపుతున్నారు. రెండు బస్సులను స్టాండ్ బైలో ఉంచి పండుగలు, పర్వదినాలు, రద్దీ సమయాల్లో విని యోగిస్తున్నారు. రోజూ ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు రైల్వేస్టేషన్, బస్టాండ్–దుర్గగుడి మధ్య బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. సాధారణ రోజుల్లో 16 సార్లు, పండుగలు, ప్రత్యేక రోజుల్లో 20 సార్లు బస్సులు తిరుగుతాయి. దుర్గా ఘాట్ నుంచి కూడా అదే స్థాయిలో బస్సు సర్వీసులు నడుపుతారు. ప్రతి నిత్యం 30వేల నుంచి 40 వేల మంది, శుక్ర, ఆదివారాల్లో 50వేల నుంచి 60 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వీరిలో సాధారణ రోజుల్లో 4 వేల నుంచి 5 వేల మంది, శుక్రవారం, ఆదివారం, ఇతర ప్రత్యేక రోజుల్లో 7 వేల నుంచి 10వేల మంది వరకు దేవస్థానం బస్సుల్లో ఇంద్రకీలాద్రిపైకి చేరుకుంటారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, దుర్గాఘాట్ నుంచి కేవలం రూ.10 మాత్రమే టికెట్ వసూలు చేస్తారు. దీంతో దేవస్థానానికి ఏడాదికి సుమారు రూ.4 కోట్ల మేర ఆదాయం వస్తుండగా, ఆయిల్, రిపేర్లు, జీతాలు ఇతర ఖర్చులు మినహాయించినా రూ. కోటి మేరకు నికర ఆదాయం వస్తుంది. భక్తులకు ఆర్థికంగా ఉపశమనం.. కరోనాకు ముందు రెండు బస్సుల్లో భక్తులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. కరోనా తర్వాత దానిని రద్దు చేశారు. తాజాగా మొత్తం ఏడు బస్సుల్లోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వచ్చే భక్తులకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందని దేవదాయ కమిషనర్ హరిజవహర్‌లాల్ పేర్కొన్నారు. చదవండి: తీరానికి అందాల హారం! బీచ్‌లలో ఆధునిక సదుపాయాలు -
సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్
అఫ్జల్‌గంజ్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. రానూపోనూ ఒకేసారి టికెట్లు బుక్ చేసుకుంటే తిరుగుప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ బుకింగ్‌కి ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. పెద్ద పండుగకి ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు గానూ 10 శాతం రాయితీని ప్రకటించాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. -
RTC Buses: బస్సులో ఓ చార్జి .. కౌంటర్లో మరో చార్జి.. ఎందుకీ గందరగోళం?
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ బస్సు చార్జి రూ.280. బస్సులో ఈ మొత్తానికే టికెట్ జారీ అవుతోంది. అదే బస్టాండులోని కౌంటర్లో టికెట్ కొంటే మాత్రం రూ.310 చార్జి అవుతోంది. అన్నిచోట్లా ఇలాగే జరుగుతోంది. ఒకే ప్రాంతానికి వెళ్లే, ఒకే కేటగిరీ బస్సు అయినా.. బస్సులో కండక్టర్/డ్రైవర్ జారీ చేసే టికెట్ ధరకూ, బస్టాండ్లలోని కౌంటర్లలో తీసుకునే టికెట్ ధరకూ పొంతన ఉండటం లేదు. ఇలా బస్సులో ఒకలా, కౌంటర్లో మరోలా జారీ అవుతున్న టికెట్లు ప్రయాణికులను అయోమయానికి గురి చేస్తున్నాయి. దీంతో కొన్నిసార్లు సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్నారు. ఎందుకీ గందరగోళం.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్లలో అక్కడి నుంచే ప్రారంభమయ్యే బస్సు ప్లాట్‌ఫామ్ మీదకు రావటానికి కొన్ని నిమిషాల ముందు నుంచి అక్కడి కౌంటర్లలో నిర్ణీత ప్రాంతానికి/నగరానికి టికెట్లు జారీ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రైవర్లే టిమ్ (టికెట్ జారీ యంత్రం) ద్వారా టికెట్ జారీ చేస్తున్నారు. అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి అదే ప్రాంతం లేదా నగరానికి వెళ్లే బస్సుల్లో కూడా టిమ్‌లతో టికెట్లు జారీ చేస్తున్నారు. అయితే బస్సుల్లో టిమ్స్‌తో జారీ చేసే టికెట్ ధర కంటే కౌంటర్లలో ఇచ్చే టికెట్ చార్జి అధికంగా ఉంటోంది. గత కొంతకాలంగా ఈ వ్యత్యాసం కనిపిస్తోంది. ఆన్లైన్ రిజర్వేషన్ సిస్టమే కారణం గతంలో కౌంటర్లలో ఇచ్చే టికెట్, బస్సుల్లో ఇచ్చే టికెట్ ఒకే సాఫ్ట్వేర్ ద్వారా జరిగేది. అదే అడ్వాన్స్డ్ రిజర్వేషన్ అయితే మరో పద్ధతి ఉండేది. ప్రయాణానికి చాలా ముందుగా సీటు రిజర్వ్ చేసుకునేందుకు టికెట్ కొంటే అదనంగా చార్జి చేసే పద్ధతి ఎప్పట్నుంచో ఉంది. కచ్చితంగా సీటు రిజర్వ్ చేసే వెసులుబాటు ఉన్నందున, ఆ సేవకు గాను రూ.30 చార్జి చేస్తారు. గతంలో రూ.10గా ఉన్న ఈ చార్జిని ఇటీవల డీజిల్ సెస్ పెంచిన సమయంలో సవరించి రూ.30కి పెంచారు. ఇలా ముందస్తుగా సీట్లు రిజర్వ్ చేసేందుకు వినియోగించే సాఫ్ట్‌వేర్‌నే ఇప్పుడు కామన్‌గా వాడుతున్నారు. ఆర్టీసీ అధీకృత ప్రైవేటు ఏజెంట్లు, ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లు, ఆర్టీసీ స్పాట్ టికెట్ జారీ చేసే కౌంటర్లు.. ఇలా అన్నింటా ఒకటే వాడుతున్నారు. బస్టాండ్లలో సాధారణ టికెట్లు జారీ చేసే చోట కూడా ఇదే సాఫ్ట్వేర్ ఉండటంతో, బస్సు బయలు దేరటానికి కొన్ని నిమిషాల ముందు టికెట్ కొన్నా.. అడ్వాన్స్డ్ రిజర్వేషన్ చార్జి పడుతోంది. ఫలితంగా బస్సులో సాధారణ టిమ్ ద్వారా జారీ చేసే టికెట్‌కు, కౌంటర్లో ఉండే ఓపీఆర్ఎస్ (ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) టికెట్‌కు ఈ తేడా కనిపిస్తోంది. అప్పటికప్పుడు ప్రయాణం కోసం వచ్చే వారు, కౌంటర్లో టికెట్ కొని ఈ రిజర్వేషన్ చార్జి చూసి కంగుతింటున్నారు. ఇదేంటని సిబ్బందిని నిలదీస్తే, ఇందులో తమ ప్రమేయమేమీ ఉండదని, సిస్టంలో లోడ్ చేసిన మేరకు ఆటోమేటిక్‌గా టికెట్ చార్జి వస్తుందని చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు తమకు కౌంటర్లో కాకుండా, బస్సు లో టిమ్ ద్వారా టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అలా ఇవ్వలేమని, కౌంటర్లోనే తీసుకోవాల్సి ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. అలాగే కొన్ని సర్వీసులకు టిమ్ ద్వారా టికెట్ జారీ ఉండదని, అందువల్ల కచ్చితంగా కౌంటర్లోనే తీసుకోవాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ కాకున్నా రూ.30 అదనంగా సమర్పించుకోవాల్సి వస్తోంది. -
డిజిటల్ చెల్లింపులకు ఆర్టీసీ రైట్ రైట్
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ డిజిటల్ బాట పడుతోంది. బస్సుల్లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికుల నుంచి సదరు మొత్తాన్ని నగదు రూపంలోనే వసూలు చేస్తున్నారు. ఇకపై డిజిటల్ చెల్లింపులను కూడా స్వీకరించేందుకు ఆర్టీసీ మార్గం సుగమం చేస్తోంది. దీనికోసం ‘యూనిఫైడ్ టికెటింగ్ సిస్టం (యూటీఎస్)’ను ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించి నిర్వహించిన టెండర్‌ను అభి బస్ సంస్థ దక్కించుకుంది. యూటీఎస్ కోసం ఆర్టీసీ నిర్వహించిన టెండర్లలో 8 కంపెనీలు బిడ్లు దాఖలు చేయగా.. మూడు కంపెనీలు అర్హత సాధించాయి. రివర్స్ టెండరింగ్‌లో అభి బస్ సంస్థను ఆర్టీసీ ఎంపిక చేసింది. దేశంలోనే అతి తక్కువ రేటుకు కాంట్రాక్ట్‌ను ఖరారు చేసింది. యూటీఎస్ విధానమిలా.. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల జారీ కోసం వినియోగిస్తున్న టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ (టిమ్స్) స్థానంలో ఇ–పాస్ మెషిన్లను ప్రవేశపెడతారు. వాటిద్వారా డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తారు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా కూడా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో ముందుగా టికెట్ల బుకింగ్‌లు, బస్‌పాస్‌లు, కొరియర్ సేవలు, పార్సిల్ బుకింగ్‌లకూ అవకాశం కల్పిస్తారు. బస్ లైవ్ ట్రాకింగ్ తెలుసుకునే అవకాశంతోపాటు ప్రయాణికుల సమాచారం, సెంట్రల్ కమాండ్ స్టేషన్ నిర్వహణ మొదలైనవి అందుబాటులోకి వస్తాయి. ఈ విధంగా అన్ని సేవలను ఏకీకృతం చేసి ఒకే వేదిక మీదకు తీసుకువస్తూ యూటీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. వచ్చే రెండు నెలల్లో దీనిని ప్రయోగాత్మకంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమలు చేస్తారు. ఆరేడు నెలల్లో రాష్ట్రమంతటా యూటీఎస్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. -
ప్రయాణీకులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ప్రయాణీకులకు శుభవార్త అందించింది. ఇప్పటివరకు రైల్వే టికెట్ల బుకింగ్, విమాన, ఈ కేటరింగ్ సర్వీసులకు పరిమితమైన సంస్థ తాజాగా మరో వెసులుబాటును ప్రయాణీకులకు కల్పించింది. 22 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను జనవరి 29న దేశ వ్యాప్తంగా లాంచ్ చేసినట్లు ఐఆర్సీటీసీ వెల్లడించింది. ఆన్లైన్ బస్ టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ రూపొందించింది. https://bus.co.in పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా బస్ బుక్ చేసుకోవచ్చు. దేశంలోని 22 రాష్ట్రాలు,3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి దాదాపుగా 50, 000 ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సు ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. టికెట్ బుకింగ్ ఎలా? ఇప్పటికే ఐఆర్సీటీసీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నవారు https://bus.co.in వద్ద నేరుగా బస్ టికెట్లు బుక్ చేయొచ్చు. లేదంటే కొత్త లాగిన్, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బస్సు టికెట్ బుక్ చేసే సమయంలో యూజర్ ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ సబ్మిట్ చేయాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, యూపీఐ లాంటి అన్ని పేమెంట్ ఆప్షన్స్ ద్వారా టికెట్లు బుక్ చేయచ్చు. ఇలా ఒకేసారి గరిష్టంగా 6 మంది ప్రయాణికులకు టికెట్లు బుక్ చేయొచ్చు. వివిధ రకాల బస్సుల వివరాలతోపాటు, అందుబాటులో ఉన్న రూట్లు, సౌకర్యాలు, సమీక్షలు, రేటింగ్ తదితరాలు అందుబాటులో ఉంటాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవచ్చు. కస్టమర్లు తమ పిక్-అప్, డ్రాప్ పాయింట్లు , టైం కూడా ఎంచుకోవచ్చు. సరసమైన ధరలో బస్ టికెట్లను పొందడంతో పాటు, ఇ-వాలెట్ డిస్కౌంట్లు కూడా లభ్యం. 1800110139 వద్ద బుకింగ్కుసంబంధించిన సమస్యలు సందేహాలనునివృత్తి చేసుకోవచ్చు. వోల్వో బస్సు, ఏసీ, నాన్ ఏసీ బస్సుల టికెట్లు బుక్ చేయొచ్చు. ఏసీ క్లాస్ టికెట్‌పై రూ.20+జీఎస్టీ, నాన్ ఏసీ క్లాస్ టికెట్‌పై రూ.10+జీఎస్టీ ఛార్జీ వసూలు చేస్తుంది.పేమెంట్ సేవల సంస్థల ఛార్జీల భారం వినియోగాదారులదే. ప్రతి ప్రయాణీకుడికి 10 కిలోల వరకు ఒక బ్యాగ్, ల్యాప్‌టాప్ బ్యాగ్, హ్యాండ్‌బ్యాగ్ లేదా 5 కిలోల బ్రీఫ్‌కేస్ లాంటివాటికి అనుమతి. ఆయుధాలు, తుపాకీ, మందుగుండు సామగ్రి, మందులు, మద్యం, అక్రమ రవాణా వస్తువులు లేదా చట్టం ప్రకారం నిషేధించబడిన వస్తువులను తీసుకెళ్లకూడదు. To provide a holistic travel experience, IRCTC has now launched online bus booking services covering 22 states & 3 UTs. Users can now book Buses with seat selection sitting in the comfort of their homes. For more details on booking, visit https://t.co/xyDJVnt6g3. pic.twitter.com/1MNyWLeh0h — Ministry of Railways (@RailMinIndia) February 6, 2021 -
టికెట్ తీసుకోరే..
సాక్షి, హైదరాబాద్: ‘బస్సులో టికెట్ తీసుకోకుంటే ఇక బాధ్యత ప్రయాణికుడిదే. ప్రయాణికులకు విధించే పెనాల్టీలు పెంచండి. టికెట్ తీసుకోనందుకు ప్రయాణికులనే పూర్తి బాధ్యులను చేయండి.’ఇదీ ఆర్టీసీ సమ్మె ముగిసిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశం. దీనికి సంబంధించి ఉత్తర్వులు రానప్పటికీ ఆర్టీసీ అధికారులు మాత్రం దాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ చర్యతో ప్రయాణికుల్లో భయం కలిగి టికెట్ తీసుకోని వారి సంఖ్య బాగా తగ్గాలి. కానీ పరిస్థితి దానికి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో ఇటీవల క్రమం తప్పకుండా చెకింగ్స్ చేయిస్తుండటంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ సమస్య హైదరాబాద్‌లో మరీ ఎక్కువగా ఉంది. ఉదాహరణకు గతేడాది మార్చిలో ఉప్పల్ డిపో పరిధిలో టికెట్ లేని ప్రయాణికుల నుంచి వసూలు చేసిన పెనాల్టీ మొత్తం రూ. 450కాగా, మేలో రూ. వెయ్యిగా నమోదైంది. కానీ ఈ సంవత్సరం జనవరిలో అదే డిపో పరిధిలో టికెట్ లేని ప్రయాణికుల నుంచి పెనాల్టీగా వసూలైన మొత్తం రూ. 58 వేలుగా, ఫిబ్రవరిలో ఇప్పటివరకు ఆ మొత్తం రూ. 31 వేలుగా నమోదైంది. ఇక హైదరాబాద్ రీజియన్ పరిధిలో జనవరిలో ఆ మొత్తం రూ. 2.5 లక్షలుగా రికార్డయింది. ఫిబ్రవరి ప్రథమార్థంలో ఇప్పటివరకు రూ. 85 వేలుగా నమోదైంది. దీన్ని ఆర్టీసీ తీవ్రంగానే పరిగణిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో 10వ నంబర్ బస్సు తిరిగే మార్గంలో 24 డిపోలకు చెందిన 70 మంది సిబ్బంది ద్వారా ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేసింది. వందల మంది ప్రయాణికులు పట్టుబడ్డారు. కిం కర్తవ్యం?: గతంలో ఇలాంటి ప్రయాణికులు చెకింగ్‌లో పట్టుబడితే కండక్టర్లకు మెమోలు జారీ చేసేవారు. కొన్ని సందర్భాల్లో సస్పెండ్ కూడా చేసేవారు. ఇది వారి ఉద్యోగ భద్రతకు ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని కార్మిక సంఘాలు అప్పట్లో తీవ్రంగా పరిగణించాయి. ఇటీవలి సమ్మె నోటీసులో కూడా ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చాయి. అయితే చర్యలు తీసుకుంటారన్న భయంతో కండక్టర్లు టికెట్ల జారీలో అప్రమత్తంగా ఉండేవారు. కిక్కిరిసిన బస్సుల్లో తప్ప మిగతా బస్సుల్లో ప్రయాణికులు ఠంచన్‌గా టికెట్ తీసుకొనేవారు. తాజాగా టికెట్లెస్ ప్రయాణాలు పెరిగిపోవడంతో అధికారులు ఎలా వ్యవహరిస్తారన్నది చర్చకు దారితీస్తోంది. -
చంద్రబాబు భజనలో ఏపీఎస్ ఆర్టీసీ
సాక్షి, తిరుమల: తిరుమలలో బస్ టిక్కెట్లపై అన్యమత ప్రచార ఉదంతంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రెస్ నోట్ వెలువరించారు. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ వస్తోన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించామని తెలిపారు. టిక్కెట్ల టెండర్ టీడీపీ హయాంలోనే ఖరారైనట్లు తెలిసిందన్నారు. చంద్రబాబు పేరుతో పథకాలను ప్రచారం చేసేందుకు ఈ కాంట్రాక్టు ఇచ్చారని తెలిపారు. 2018 లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యిందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 60 వేల టిమ్ పేపర్లపై మైనారిటీ సంక్షేమ శాఖ ప్రకటనలు వేయాలని మార్వెన్ క్రియేటివ్ సర్వీసెస్‌కు కాంట్రాక్టు ఇచ్చిందని వెల్లంపల్లి తెలిపారు. టిమ్ పేపర్లపై చంద్రబాబు పేరుతో పథకాల ప్రచారం చేశారని పేర్కొన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు పూర్తవుతున్నా ఏపీఎస్ ఆర్టీసీ చంద్రబాబు భజన మానలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక నెల్లూరు డిపోలో ఉండాల్సిన టికెట్లు నిబంధనలకు విరుద్ధంగా తిరుమల డిపోకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. ఇందుకు బాధ్యులైన అధికారులు, సంస్థలపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోన్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆపాదిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని టీవీ ఛానెళ్లు కూడా ఈ వ్యవహారాన్ని పెద్దది చేసేందుకు ప్రయత్నిస్తూ.. శ్రీవారి భక్తుల మనోభావాలు గాయపరిచి.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కుట్ర పన్నుతున్నాయని మండి పడ్డారు. సదరు వ్యక్తులు, మీడియా సంస్థలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 40 దేవాలయాలను కూలగొట్టించినది, సదావర్తి భూములు కాజేసినది, కనకదుర్గమ్మ గుడిలో, కాళహస్తిలో క్షుద్ర పూజలు చేయించినది.. అమ్మవారి భూముల్ని తన వారికి లీజులు ఇచ్చినది తెలుగు దేశం ప్రభుత్వమే అన్నారు. హిందుత్వం మీద చంద్రబాబు చేయని అరాచకాలున్నాయా అని వెల్లంపల్లి ప్రశ్నించారు. తిరుపతిలో కిరీటాల దొంగతనం మొదలు.. శ్రీవారి బంగారాన్ని లారీల్లో తరలించడం వరకు అన్ని దుర్మార్గాలు చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబేనని ఆరోపించారు. కాబట్టే బాబు ఆ దేవదేవుడి ఆగ్రహానికి గురయ్యారని విమర్శించారు. ఇంతా జరిగినా చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం రాలేదని అర్థమవుతోందంటూ ఎద్దేవా చేశారు. మతాలన్నీ అక్కున చేర్చుకున్నందువల్లే జగన్ సీఎం అయ్యారు.. మతాలన్ని ఛీకొట్టబట్టే చంద్రబాబు అందరికి దూరమయ్యారని స్పష్టం చేశారు. -
విమాన, బస్ టికెట్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్
న్యూయార్క్ : క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విమాన, బస్ టికెట్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించింది. దేశీయ విమానాలపై రూ 1000, అంతర్జాతీయ విమానాలపై 12 శాతం తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసింది. వీటికితోడు హోటల్ బుకింగ్స్‌పై 50 శాతం తగ్గింపును ఆఫర్ చేసింది. ఇక బస్ ప్రయాణీకులకూ ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. బస్ టికెట్లపై 20 శాతం తగ్గింపును ప్రకటించింది. మరోవైపు ఈ ఆఫర్లను ఉపయోగించుకునేందుకు ఎలాంటి కూపన్ కోడ్‌ను వాడాల్సిన పనిలేదు. ఫ్లిప్‌కార్ట్ తాజా ఆండ్రాయిడ్ యాప్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్లోనూ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇక ఇండిగో న్యూ ఇయర్ సేల్కు ఆదివారం చివరి రోజు కావడం గమనార్హం. ఈ ఆఫర్ కింద అంతర్జాతీయ విమాన టికెట్లను రూ 3239 రూపాయల నుంచి ఇండిగో ఆఫర్ చేస్తోంది. -
ఇదేమి బాదుడు దేవుడా?
విజయవాడకు చెందిన సురేష్ కార్తీక మాసంలో కుటుంబంతో కలిసి ఈ నెల 25న అన్నవరం దర్శనానికి వెళ్లాడు. రాజమండ్రికి చేరుకుని అక్కడి నుంచి అన్నవరం వెళ్లేందుకు రాజమండ్రి డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ అల్ట్రా డీలక్స్ బస్సు ఎక్కాడు. రాజమండ్రి నుంచి అన్నవరం వరకు 80 కిలోమీటర్ల దూరం. టోల్ చార్జీలు, ప్యాసింజర్ సెస్సు కలిపి టిక్కెట్టు ధర రూ.వంద వరకు ఉంది. కానీ రూ.150 వంతున వసూలు చేశారు. ఆరుగురు కుటుంబ సభ్యులకు రూ.900 సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధర అంతేనని సమాధానమిచ్చారు. తిరుగు ప్రయాణంలో అన్నవరం నుంచి రాజమండ్రి వెళ్లేందుకు ఖమ్మం డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కారు. టోల్ చార్జీ, సెస్సుతో కలుపుకుని ఒక్కొక్కరికి రూ.79 చొప్పున రూ.395 మాత్రమే అయింది. తెలంగాణ ఆర్టీసీ కంటే ఏపీఎస్ ఆర్టీసీలో రెట్టింపు ధర కంటే ఎక్కువగా ఉండటంతో ఆశ్చర్యపోవడం సురేష్ వంతైంది. సాక్షి, అమరావతి : రద్దీ, పండగ సీజన్లలో ప్రయాణికులపై ఏపీఎస్ ఆర్టీసీ తీవ్ర భారం మోపుతోంది. కొత్త సినిమాకు బ్లాక్‌లో టికెట్లు అమ్మినట్లు 50 శాతం చార్జీలను అధికంగా వసూలు చేస్తోంది. డిపోల వారీగా ఇష్టానుసారం బాదేస్తోంది. పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ వదలకుండా వారి జేబులను ఖాళీ చేస్తోంది. డీజిల్ ధరలు పెరిగినా చార్జీలు పెంచడం లేదని పైకి చెబుతూ.. జిల్లా జిల్లాకో రీతిన టిక్కెట్ల ధర పెంచి డబ్బులు లాగేస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇప్పటికే ఆర్టీసీ రెండుసార్లు చార్జీలను పెంచింది. సవరణల పేరిట ప్రతి సీజన్లోనూ అదనపు చార్జీలను వడ్డిస్తూనే ఉంది. దీనికి తోడు ప్యాసింజర్ సెస్సు, సేఫ్టీ సెస్సు అంటూ ఏటా ప్రయాణికులపై రూ.500 కోట్ల అదనపు భారం మోపుతోంది. టోల్ చార్జీలు పెరిగినప్పుడల్లా ప్రయాణికులకు వాత తప్పడం లేదు. ఇక పండగ వేళల్లో అయితే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రత్యేక బస్సులంటూ 50 శాతం నుంచి వంద శాతం వరకు చార్జీలను పెంచుతూ ఏకంగా ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు దూరం చేస్తోందని పేదలు వాపోతున్నారు. ప్రత్యేక బస్సులతో జిల్లాకో రకంగా దోపిడీ ఆర్టీసీ రద్దీ వేళల్లో రెగ్యులర్ సర్వీసులు నిలిపేసి ప్రత్యేక బస్సులను ప్రవేశపెడుతోంది. ఈ బస్సుల్లో రెగ్యులర్ బస్ చార్జీల కంటే 50 శాతం అధికంగా టిక్కెట్లు వసూలు చేస్తోంది. అదేమంటే ప్రత్యేక బస్సులు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీగా రావాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు సాకు చెబుతున్నారు. రాజమండ్రి నుంచి అన్నవరం వెళ్లేందుకు అల్ట్రా డీలక్స్‌లో కిలోమీటరుకు రూపాయి పది పైసలు వంతున వసూలు చేయాలి. అంటే టిక్కెట్టు ధర 80 కిలోమీటర్లకు గాను టిక్కెట్టు ధర రూ.88 ఉండాలి. ప్యాసింజర్ సెస్సు, సేఫ్టీ సెస్సు కలిపి రూ.3, టోల్ చార్జీ రూ.5 కలిపి టిక్కెట్టు ధర రూ.96 వసూలు చేయాల్సి ఉండగా, రాజమండ్రి డిపో అధికారులు రూ.150 వసూలు చేయడం గమనార్హం. ‘రౌండింగ్ ఆఫ్’ పేరిట చార్జీల సవరణ ఆర్టీసీలో చిల్లర సమస్యను కారణంగా చూపుతూ ‘రౌండింగ్ ఆఫ్’ పేరిట టిక్కెట్‌పై రూపాయి నుంచి రూ.5 వరకు అదనంగా వడ్డిస్తూ ఈ ఏడాది జూన్‌లో చార్జీలను పెంచారు. తెలుగు వెలుగు, వెలుగు, సిటీ సర్వీసులు తప్ప మిగిలిన సర్వీసులలో ఈ చార్జీలను పెంచారు. టిక్కెట్లు రద్దు చేసుకుంటే తిరిగి డబ్బు చెల్లించే సమయంలోనూ ‘రౌండింగ్ ఆఫ్’ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఏడాదికి ప్రయాణికులపై రూ.315 కోట్ల భారం మోపింది. -
రైలు బండ్లలో బస్సు టికెట్లు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి రైల్వే స్టేషన్ పరిసరాల్లో ప్రయివేట్ ఆపరేటర్ల దోపిడీని అరికట్టి శ్రీవారి భక్తులకు సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించేందుకు రైల్వే, ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన రైళ్లలో బస్సు టికెట్ల జారీ ప్రయోగం సత్ఫలితాలను అందిస్తోంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఇది అమలవుతోంది. రోజుకి 150కి పైగా టికెట్లు జారీ చేస్తున్నామని తిరుపతి, అలిపిరి ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇదే ప్రయోగాన్ని మిగతా రైళ్లలోనూ అమలు చేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇలా ఎందుకంటే... నిత్యం తిరుపతి రైల్వేస్టేషన్లో దిగే ప్రయాణికులు 1.20 లక్షల నుంచి 1.45 లక్షల మంది ఉంటారు. వీరిలో శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులు 40 వేల మందికి పైనే ఉంటారు. ప్రతి రోజూ ఉదయమే తిరుపతి చేరుకునే రైళ్లు పదికి పైనే ఉన్నాయి. ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆటో, జీపులు, ట్యాక్సీల ఆపరేటర్లు చుట్టుముడతారు. కొండ మీదకు వెళ్లే భక్తుల నుంచి పెద్ద మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నారు. ఎక్కడో ఉన్న ఆర్టీసీ బస్సులను వెదుక్కుని లగేజీలతో వెళ్లి ఎక్కడం కష్టంగా భావిస్తున్న చాలా మంది ప్రయాణికులు ఎదురుగా ఉన్న ఏదో ఒక ప్రయివేటు వాహనాన్ని ఎక్కి వెంటనే కొండకు ప్రయాణమవుతున్నారు. దీన్ని గుర్తించిన ఆర్టీసీ అధికారులు రెండు నెలల కిందట రైల్వే డీఆర్ఎం, సీనియర్ డీసీఎంతో చర్చించారు. కొన్ని ప్రత్యేక రైళ్లలో టికెట్లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని లిఖిత పూర్వకంగా కోరారు. దీంతో రైల్వే శాఖ అంగీకరించింది. మొదటి దశలో బస్సు టికెట్ల జారీ కోసం సికింద్రాబాద్ నుంచి రోజూ తిరుపతి చేరుకునే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ (12733) రైలు బండిని ఎంపిక చేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇందులో ప్రయాణికులకు బస్సు టికెట్లు ఇస్తున్నారు. శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్లో ఎక్కుతున్న ముగ్గురు ఆర్టీసీ కండక్టర్లు స్లీపర్ క్లాస్, జనరల్, ఏసీ కోచ్‌లలో తిరుమల వెళ్లే భక్తులకు బస్సు టికెట్లు ఇస్తున్నారు. రోజుకు 150కి పైగా టికెట్లు పోతున్నాయి. రైల్లోనే టికెట్లు తీసుకున్న ప్రయాణికులు స్టేషన్ బయటకు రాగానే ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్సులు ఎక్కి తిరుమల చేరుతున్నారు. ఈ ప్రయోగం బాగానే ఉందని ప్రయాణికుల నుంచి స్పందన వస్తుందని ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు చెప్పారు. ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో చెన్నై–తిరుపతి మధ్య నడిచే సప్తగిరి ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూరు–తిరుపతి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ బస్సు టికెట్ల విధానాన్ని ప్రవేశపెట్టినట్లు రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. -
రైళ్లలోనే తిరుమలకు ఆర్టీసీ టికెట్లు
సాక్షి, తిరుపతి అర్బన్: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రైళ్లలో వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు టికెట్లను ఇకపై రైళ్లలోనే ఇవ్వనున్నారు. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించనున్నారు. దీంతో సికింద్రాబాద్ నుంచి తిరుపతి వైపు నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఆర్టీసీ కండక్టర్ గూడూరు నుంచి తిరుపతి వరకు వస్తూ ఏసీ బోగీలతో పాటు స్లీపర్ క్లాస్ బోగీలలో తిరుమలకు వెళ్లే యాత్రికులకు రైలులోనే ఆర్టీసీ బస్సు టికెట్లను విక్రయిస్తారు. ప్రయాణికులు రైలు దిగగానే ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే మిగిలిన అన్ని మార్గాల్లోని రైళ్లలో దీన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రైల్వే సీనియర్ లైజన్ ఆఫీసర్ కుప్పాల సత్యనారాయణ వెల్లడించారు. -
ఇక స్నాప్‌డీల్ ద్వారా విమాన, బస్ టికెట్లు
♦ ఈ తరహా సేవలందిస్తున్న ♦ తొలి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఇదే న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్ ద్వారా ఇక నుంచి విమాన, బస్ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా హోటల్ రిజర్వేషన్లు, ఆహార పదార్థాలను ఆర్డర్ చేయడం వంటి సర్వీసులు కూడా పొందవచ్చని స్నాప్‌డీల్ తెలిపింది. ఈ తరహా ఆన్లైన్ సర్వీసులందిస్తున్న తొలి ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ తమదేనని స్నాప్‌డీల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రోహిత్ బన్సాల్ చెప్పారు. జొమాటొ, క్లియర్‌ట్రిప్, అర్బన్‌క్లాప్, రెడ్‌బస్ తదితర సంస్థల భాగస్వామ్యంతో ఈ సేవలందిస్తున్నామని ఆయన వివరించారు. వినియోగదారుల అన్ని రకాలైన అవసరాలకు తగిన సేవలందిస్తున్నామని, స్నాప్‌డీల్ ద్వారా మరింత విస్తృతమైన సేవలను అందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని బన్సాల్ పేర్కొన్నారు. 2020 నాటికల్లా 2 కోట్ల రోజువారీ లావాదేవీలు జరిపే యూజర్లున్న ఆన్లైన్ మార్కెట్ ప్లేస్‌గా అవతరించాలనేది తమ లక్ష్యమని ఈ సందర్భంగా వివరించారు. ఈ తరహా ఆన్లైన్ సర్వీసులందించడం ద్వారా ఆ లక్ష్య సాధనకు చేరువ కాగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కాగా, స్నాప్‌డీల్ భాగస్వామ్యంలో మరింతమందికి చేరువ కాగలమని జొమాటొ సీఈఓ దీపిందర్ గోయల్ చెప్పారు. -
బాబు ‘బొమ్మ’ పోయింది
- టీఎస్ఆర్టీసీకి ఏపీ సీఎం ఫొటో ఉన్న టికెట్ల సరఫరా - ప్రయాణికుల ఫిర్యాదుతో గుర్తించిన అధికారులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో జారీ అవుతున్న టికెట్ల వెనక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోతో కూడిన ప్రభుత్వ పథకాల ప్రకటనలుండటం అధికారుల్లో గుబులు రేపింది. ఆ టికెట్లు పొందిన కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేయటంతో అధికారులు హడావుడి చేశారు. ఆ టికెట్లు ఏయే డిపోల్లోని బస్సుల్లో ఉన్నాయో తెలుసుకునేందుకు ఏకంగా 3 రోజుల పాటు నానా హైరానా చేశారు. ఎట్టకేలకు వాటి జాడ కనిపెట్టి అన్నిటినీ ఉపసంహరించుకున్నారు. తెలంగాణ, ఏపీకి చెందిన టికెట్లు ఒకేచోట ముద్రిస్తారు. దీంతో వాటి సరఫరా సిబ్బంది చేసిన పొరపాటు వల్ల అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ కన్నెర్ర చేస్తారోనని అధికారులు ఆందోళనపడ్డారు. చివరికి ఆ టికెట్లు ఉపసంహరించుకున్నాక ఊపిరిపీల్చుకున్నారు. దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో టికెట్ ఈష్యూయింగ్ మెషిన్ (టిమ్) ద్వారా టికెట్లు జారీ అవుతున్నాయి. ఆ మెషిన్‌కు అమర్చే పేపర్ రోల్ వెనుక వాణిజ్య ప్రకటనలు, ప్రభుత్వ పథకాల వివరాలను ముద్రిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ పథకాలున్న ఆ టికెట్ రోల్స్ టీఎస్ఆర్టీసీకి పొరపాటుగా సరఫరా అయ్యాయి. వాటిని ఉపసంహరించాం: ఈడీ ఏపీకి సరఫరా కావాల్సిన టికెట్ రోల్స్ కొన్ని పొరపాటున టీఎస్ఆర్టీసీకి చేరాయని ఈడీ ఎం.రవీందర్ ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్ జోన్ల పరిధిలోని నాలుగు డిపోలకు ఈ రోల్స్ సరఫరా అయ్యాయని, ఫిర్యాదులు రావడంతో అన్నింటిని పరిశీలించి ఆరు రోల్ బాక్సులను వెనక్కి రప్పించినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ విభజనకు ముందు మే నెలలో వీటిని ముద్రించినట్లు వెల్లడించారు. -
అంతా ఆన్లైన్
ఖమ్మం అర్బన్ : ఏదైనా వస్తువు కొనాలంటే అనేక షాపులు తిరగాల్సిన పనిలేదు. మోడల్స్ నచ్చకపోతే నిస్తేజంగా ఇంటిముఖం పట్టాల్సిన అవసరం లేదు. ఇక ఇంట్లోనే కూర్చు ని మనకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయొచ్చు. ఏయే వస్తువు ఏయే మోడళ్లలో లభ్యమవుతున్నాయి.. ధర ఎంత.. నాణ్యతా ప్రమాణాలు ఏమిటి తదితర వివరాలు తెలుసుకుని ఒక్క క్లిక్ చేస్తే చాలు. మనకు కావాల్సిన వస్తువు ఇంటి ముందు వాలిపోతున్నాయి. దీంతో ఆన్లైన్ షాపింగ్‌పై నెటిజన్ల మోజు రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్ తదితర మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఖమ్మం నగరం, కొత్తగూడెం పట్టణానికి కూడా పాకింది. ఆన్లైన్లో అంగడి మనం షాపుకు వెళ్లి ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే ముందుగా మనకు ఆ వస్తువు గురించి అన్ని వివరాలు తెలియాలి. వస్తువు మన్నిక, మోడల్, దానికి అంత ఖరీదు పెట్టొచ్చా... అనే విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే.. వస్తువు కొనుగోలు చేయడానికి ఇంటర్నెట్ ఎంతో సహాయపడుతోంది. ఆన్లైన్ షాపింగ్‌కు సంబంధించిన వెబ్సైట్లలోకి వెళ్లి పరిశీలిస్తే మనకు కావాల్సిన వస్తువు వివరాలన్నీ దర్శనమిస్తాయి. ఏ వస్తువుకు ఏయే ఆఫర్లు ఉన్నాయనే విషయాలూ తెలుసుకోచ్చు. ఆ తర్వాత ఆర్డర్ చేసి డోర్ డెలివరీ పద్ధతిన ఇంటికి తెప్పించుకోవచ్చు. నేరుగా షాపింగ్ గతంలో ఫోన్ బిల్లులు, బస్ టికెట్లు తదితర విషయాల కోసమే ఎక్కువగా ఆన్లైన్ విధానాన్ని ఉపయోగించే వారు. అయితే ప్రస్తుతం ఆన్లైన్లో అమ్మకాలు చేసేందుకు మార్కెట్లోకి పలు కంపెనీలు దూసుకొచ్చాయి. అమెజాన్, స్నాప్‌డీల్ డాట్ కామ్, ఓఎల్ఎక్స్, ఫ్లిక్డాట్ కామ్ తదితర కంపెనీలు ఆన్లైన్లో వస్తువులను అమ్మకాలకు పెడుతున్నాయి. ప్రముఖ కంపెనీల నుంచి ఈ ఆన్లైన్ కంపెనీలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి నేరుగా వినియోగదారులకు అందించడంతో మార్కెట్ సాధారణ ధరకంటే తక్కువగా ఉండడంతో ఆన్‌లైన్‌పై మోజు క్రమేణా పెరుగుతోంది. వస్తువలు కొనడానికే కాకుండా విక్రయించేందుకు సైతం ‘ఓఎల్ఎక్స్’ వంటి ఆన్లైన్ కంపెనీలు ఉపయోగపడుతున్నాయి. ఇష్టమైన వారికి బహుమతులు ఈ ఆన్లైన్ విధానం ద్వారా తమకు ఇష్టమైన వ్యక్తులకు బహుమతులు ఇచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్లి ఎవరికి బహుమతి ఇవ్వాలనుకుంటున్నామో వారి పేరుపై గిఫ్ట్‌ను పంపించి సర్ప్రైజ్ చేయొచ్చు. ‘స్నాప్ డీల్ డాట్ కామ్’ ద్వారా ఇలాంటి అవకాశం ఉంది. -
కష్టాల ప్రయాణం
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: రోడ్డు రవాణా సంస్థలో మహిళా కండక్టర్లు అసౌకర్యాల నడుమ విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రయాణించడం.. కిటకిటలాడే బస్సుల్లో టికెట్లు ఇవ్వడం, ప్రయాణికులను సరి చూసుకోవడం, స్టేజీ వచ్చేలోపు స్టాటస్టికల్ రిపోర్టు (ఎస్ఆర్) రాయడం లాంటివి పురుషులతో సమానంగా చేస్తున్నా ఉద్యోగినిల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సంస్థ మహిళలకు 33శాతం రిజర్వేషన్ సౌకర్యం వర్తింపజేయడంతో కండక్టర్ పోస్టుల్లో చేరిన మహిళలకు సమస్యలు నిరంతరం వెన్నాడుతూనే ఉన్నాయి. అధికారుల అలసత్వం, యాజమాన్యం నిర్లక్ష్యం వెరసి విధులంటేనే విసుగెత్తిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 970 బస్సులున్నాయి. వీటిలో విధులు నిర్వహించేందుకు 1970 మంది కండక్టర్లు ఉండగా అందులో 272 మంది మహిళా కండక్టర్లున్నారు. ప్రతి డిపోలో 20 నుంచి 30 మంది వరకు ఉన్నారు. అంతటా అసౌకర్యాలే: మహిళా కండక్టర్లకు ప్రత్యేక సౌకర్యాలు, సెలవులు, వసతులు కల్పించాల్సి ఉంది. సమస్యలు పరిష్కరించాలని నోరు తెరిచి అడిగితే పైఅధికారుల ఆగ్రహానికి గురికావాల్సిందే. డిపోలో విశ్రాంతి గదులు ఏర్పాటు చేసినా మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. నిర్వాహణ సరిగా లేకపోవడంతో వాటిని సద్వినియోగం చేసుకునేందుకు మహిళా కండక్టర్లు ఇష్టపడడం లేదు. డ్యూటీ టర్మినల్ పాయింట్లలో తాగునీరు, మూత్రశాలల వసుతులు కల్పించాల్సి ఉంది. ఈసౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ మౌనం వహిస్తున్నారు. ప్రత్యేక సెలవులుగా నెలకు 3 రోజులు అదనంగా క్యాజువల్ లీవ్‌లు ఇవ్వాల్సి ఉంది. కాని సెలవులు ఇవ్వాలంటే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళా కండక్టర్లు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం ఉదయం 6 నుంచి రాత్రి 9గంటల లోపే పూర్తయ్యే డ్యూటీలు వేయాలి. కాని రాత్రి 11గంటల ఉండే విధులప్పగిస్తున్నారు. అందరికీ చార్ట్ (రెగ్యూలర్‌గా తిరిగే సర్వీసులు) డ్యూటీలు వేయడం లేదు. ఫలితంగా కొందరు ఈ రోజుకు ఏ సర్వీసు వేశారో అని చూసుకుంటే మరి కొందరు మాత్రం డ్యూటీలు లేక ఇంటికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. అధికారుల ఒత్తిళ్లు, వేధింపులు ఉండనే ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం సాధారణమైంది. ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉన్న రూట్లలో డ్యూటీలు వేయాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మెరున్ రెడ్ శారీ (చీరలు) డ్రస్ కోడ్‌గా ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. బూట్లు కూడా ముఖ్యంగా చిల్లర సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నిబంధనల ప్రకారం విధులకు హాజరయ్యే ముందు కండక్టర్లకు రూ.50ల చిల్లర ఇవ్వాల్సి ఉంది. కాని సరిగా ఇవ్వకపోవడం, ప్రయాణికులు వంద, ఐదు వందల రూపాయల నోట్లు ఇవ్వడం సమస్యకు దారి తీస్తోంది. -
నాలుగు రూట్లు.. ఒకే టికెట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఊరికెళ్లాలంటే రాను, పోను టికెట్లు ముందే బుక్ చేస్తాం. మరి నాలుగు ఊళ్లు వెళ్లాలంటే రిజర్వేషన్ కోసం పెద్ద కుస్తీయే పట్టాలి. అలాకాక ఒకే టికెట్‌పై నాలుగు రూట్లలో ప్రయాణించే వీలుంటే!! ఇలాంటి సౌకర్యాన్ని బస్‌ఇండియా.కామ్ పోర్టల్ ఆరంభించింది. ‘ఎక్కడి నుంచైనా, ఎక్కడికైనా’ అంటూ... భారత్‌లో తొలిసారిగా ఈ సేవలను ఆవిష్కరించామని పోర్టల్‌ను నిర్వహిస్తున్న రేడియంట్ ఇన్ఫో సిస్టమ్స్ సీఎండీ వేణు మైనేని చెప్పారు. బస్‌ఇండియా.కామ్ ఆంధ్రప్రదేశ్‌లో అడుగిడుతున్న సందర్భంగా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన మాట్లాడారు. ఆయనేమన్నారంటే...ఆపరేటర్లు ఎవరైనా... ప్రయాణికులు ఏ నగరం వారైనా... ఏ బస్ ఆపరేటర్ అయినా సరే... బస్‌ఇండియా.కామ్‌లో ఒకే లావాదేవీతో అది కూడా ఒకే టికెట్ తీసుకోవచ్చు. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉన్న వ్యక్తి తిరుపతి వెళ్తున్నారనుకుందాం. అక్కడి నుంచి చెన్నైకి, తిరిగి బెంగళూరుకు, అటు నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలనుకుంటే.. ప్రయాణికుడు తనకు నచ్చిన టైంలో, నచ్చిన బస్‌లో వెళ్లొచ్చు. నాలుగు రూట్లకు కలిపి ఒకే టికెట్ వస్తుంది. ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకోవచ్చు. భారత్‌లో మేం మాత్రమే ఈ విధమైన వినూత్న సేవలు ప్రారంభించాం. తొలి స్థానం మాదే...: భారత్‌లో తొలిసారిగా ఆన్లైన్ బస్ రిజర్వేషన్ సేవలను 2006లో కర్ణాటక రాష్ట్ర ఆర్టీసీ కోసం ప్రవేశపెట్టాం. మొదట్లో అక్కడ రోజుకు 8,500 టికెట్లు బుక్ చేశాం. ఇపుడు ఆ సంఖ్య 25,000కు చేరింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థల వద్ద సుమారు 1.47ల క్షలు, ప్రైవేటు ఆపరేటర్ల వద్ద సుమారు 30 వేల బస్సులున్నాయి. 80 శాతం బస్సుల్ని మేం కవర్ చేస్తున్నాం. మొత్తంగా రోజుకు 49 వేల టికెట్లు విక్రయిస్తూ దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం. ఈ అనుభవంతోనే ఇక్కడ అడుగుపెట్టాం. ప్రైవేటు బస్సుల రిజర్వేషన్ ప్రారంభించాం. ఆర్టీసీ బస్‌ల రిజ ర్వేషన్ వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 4,500 బస్‌లకు రిజర్వేషన్ సౌకర్యం ఉంది. వివిధ పోర్టల్స్ ద్వారా రోజుకు 40 వేల టికెట్లు బుక్ అవుతున్నాయి. క్యాబ్ సర్వీసులు కూడా... ప్రస్తుతం బస్ రిజర్వేషనే కాకుండా హోటళ్లను కూడా మా పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కొద్ది రోజుల్లో ట్యాక్సీలను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తాం. ఈ సేవలతో కస్టమర్లకు మరింత చేరువవుతాం. వన్ స్టాప్ సొల్యూషన్ అందించాలన్నదే మా తాపత్రయం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు 1,000 టికెట్లు మొబైల్ ఫోన్ల ద్వారా బుక్ అవుతున్నాయి. రెండేళ్లలో మొత్తం టికెట్లలో వీటి వాటా 15 శాతానికి చేరుతాయని విశ్వసిస్తున్నాం. ఇలా ప్రారంభించాం.. మా స్వస్థలం గుంటూరు జిల్లా లగడపాడు. మధ్య తరగతి కుటుంబం. 1991లో అమెరికా వెళ్లి ఎమ్మెస్ చేశా. భారత్‌కు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలన్న లక్ష్యంతో కోడూరు వినోద్, సి.నారాయణాచార్యులుతో కలిసి రేడియంట్ ఇన్ఫో సిస్టమ్‌ను ఏర్పాటు చేశాం. స్మార్ట్‌కార్డ్, ఇ-గవర్నెన్స్, ఆధార్ ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వర్తించాం. అమెరికా, యూకేల్లో సాఫ్ట్వేర్, ఐటీ సేవలు అందిస్తున్నాం. భారత్‌లో రవాణా సేవలపైనే దృష్టిపెట్టాం. 15 ఆర్టీసీలతో లాభం పంచుకుంటున్నాం. రేడియంట్ గ్రూపు దేశంలో రూ.100 కోట్లు, ఇతర దేశాల ద్వారా రూ.350 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. ఔత్సాహికులను ప్రోత్సహించి పారిశ్రామిక రంగంవైపు మళ్లేలా చేస్తున్నా. -
రెట్టింపు ధరలు వసూలు చేస్తున్న ట్రావెల్స్