IRCTC Launches Online Bus Booking Services| Bus Booking Guide Process - Sakshi
Sakshi News home page

ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌ న్యూస్‌

Published Sat, Feb 6 2021 4:42 PM | Last Updated on Sat, Feb 6 2021 7:04 PM

 IRCTC launches its online bus booking services - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) ప్రయాణీకులకు శుభవార్త అందించింది. ఇప్పటివరకు రైల్వే టికెట్ల బుకింగ్‌, విమాన, ఈ కేటరింగ్ సర్వీసులకు పరిమితమైన సంస్థ తాజాగా మరో  వెసులుబాటును ప్రయాణీకులకు  కల్పించింది. 22 రాష్ట్రాలు,  3 కేంద్ర పాలిత   ప్రాంతాలను కవర్ చేస్తూ ఆన్‌లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను జనవరి 29న దేశ వ్యాప్తంగా లాంచ్‌ చేసినట్లు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. ఆన్‌లైన్ బస్‌ టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్ రూపొందించింది. https://bus.co.in పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా బస్ బుక్‌ చేసుకోవచ్చు. దేశంలోని 22 రాష్ట్రాలు,3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి దాదాపుగా 50, 000 ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సు ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది.

టికెట్‌ బుకింగ్‌ ఎలా?

  • ఇప్పటికే ఐఆర్‌సీటీసీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నవారు https://bus.co.in వద్ద నేరుగా బస్‌ టికెట్లు బుక్ చేయొచ్చు. 
  • లేదంటే కొత్త  లాగిన్‌, పాస్‌ వర్డ్‌ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.  బస్సు టికెట్ బుక్ చేసే సమయంలో  యూజర్‌ ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ సబ్‌మిట్‌ చేయాలి.
  • డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, యూపీఐ లాంటి అన్ని పేమెంట్ ఆప్షన్స్ ద్వారా టికెట్లు బుక్ చేయచ్చు. ఇలా ఒకేసారి గరిష్టంగా 6 మంది ప్రయాణికులకు టికెట్లు బుక్ చేయొచ్చు. 
  • వివిధ రకాల బస్సుల వివరాలతోపాటు, అందుబాటులో ఉన్న రూట్లు,  సౌకర్యాలు, సమీక్షలు, రేటింగ్‌ తదితరాలు అందుబాటులో ఉంటాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవచ్చు.
  • కస్టమర్లు తమ పిక్-అప్, డ్రాప్ పాయింట్లు , టైం కూడా ఎంచుకోవచ్చు. సరసమైన ధరలో బస్‌ టికెట్లను పొందడంతో పాటు, ఇ-వాలెట్ డిస్కౌంట్లు కూడా లభ్యం.
  • 1800110139 వద్ద బుకింగ్‌కుసంబంధించిన సమస్యలు సందేహాలనునివృత్తి చేసుకోవచ్చు.
  • వోల్వో బస్సు, ఏసీ, నాన్ ఏసీ బస్సుల టికెట్లు బుక్ చేయొచ్చు. 
  • ఏసీ క్లాస్ టికెట్‌పై రూ.20+జీఎస్‌టీ, నాన్ ఏసీ క్లాస్ టికెట్‌పై రూ.10+జీఎస్‌టీ ఛార్జీ వసూలు చేస్తుంది.పేమెంట్‌  సేవల సంస్థల ఛార్జీల భారం వినియోగాదారులదే.
  • ప్రతి ప్రయాణీకుడికి 10 కిలోల వరకు ఒక బ్యాగ్, ల్యాప్‌టాప్ బ్యాగ్, హ్యాండ్‌బ్యాగ్ లేదా 5 కిలోల బ్రీఫ్‌కేస్ లాంటివాటికి అనుమతి. ఆయుధాలు, తుపాకీ, మందుగుండు సామగ్రి, మందులు, మద్యం, అక్రమ రవాణా వస్తువులు లేదా చట్టం ప్రకారం నిషేధించబడిన వస్తువులను తీసుకెళ్లకూడదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement