
అఫ్జల్‌గంజ్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. రానూపోనూ ఒకేసారి టికెట్లు బుక్ చేసుకుంటే తిరుగుప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ బుకింగ్‌కి ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. పెద్ద పండుగకి ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు గానూ 10 శాతం రాయితీని ప్రకటించాలని నిర్ణయించినట్లు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment