TSRTC Introduces T-9 Ticket In Village Light Bus Applicable To Women And Senior Citizens - Sakshi
Sakshi News home page

TSRTC T-9 Ticket: టీఎస్‌ ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌..

Published Tue, Jun 20 2023 9:34 AM | Last Updated on Tue, Jun 20 2023 11:33 AM

TSRTC introduces T-9 ticket in village light bus - Sakshi

హన్మకొండ : మహిళలు, వృద్ధుల కోసం టీఎస్‌ ఆర్టీసీ ట్రావెల్‌–9 టికెట్‌ ప్రవేశపెట్టిందని ఆర్టీసీ వరంగల్‌–1 డిపో మేనేజర్‌ పి.శ్రీనివాస్‌ రావు, హనుమకొండ డిపో మేనేజర్‌ బాబు నాయక్‌ తెలిపారు. ఆదివారం నుంచి ఈ టికెట్‌ అమల్లోకి వచ్చిందని వారు వేర్వేరు ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వినియోగించుకోవచ్చన్నారు.

పల్లె వెలుగు బస్సుల్లో ఈ టికెట్‌ చెల్లుబాటు అవుతుందని తెలిపారు. రూ.100 చెల్లించి టికెట్‌ తీసుకుని ఒక రోజులో 60 కిలో మీటర్లు ప్రయాణించొచ్చన్నారు. ప్రతి సర్వీస్‌లో కండక్టర్‌ వద్ద ఈ టికెట్‌ అందుబాటులో ఉంటుందన్నారు.  దీని ద్వారా ప్రయాణికుడికి రూ.20 నుంచి రూ.40 వరకు ఆదా అవుతుందన్నారు. 60 ఏళ్లపై బడిన వృద్ధులు, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement