online ticket booking
-
పండగ సీజన్లో భారీగా సీట్ల బుకింగ్
పండగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బస్ ప్రయాణికుల సంఖ్య 62 శాతం పెరుగుతుందని ఆన్లైన్ బస్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ రెడ్‌బస్ అంచనా వేసింది. సెప్టెంబర్ 26-30తో పోలిస్తే(పండగలు లేనికాలం) అక్టోబర్ 10-14(దసరా పండగ)కాలంలో ఆన్లైన్లో బస్ సీట్ల బుకింగ్ పెరుగనుందని సంస్థ తెలిపింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దసరా ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి వివిధ నగరాల్లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పండగకు సొంత ఊళ్లకు వెళ్లనున్నారు. దసరా శనివారం వస్తుండడం, తర్వాత ఆదివారం సెలవు ఉండడంతో ప్రయాణాలు పెరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో రెడ్‌బస్ ఆన్లైన్లో బస్ సీట్ల బుకింగ్‌లలో 62 శాతం పెరుగుదలను అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అతిపెద్ద షాపింగ్ ఈవెంట్‌కు తేదీ ఖరారుఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చేవారిలో దాదాపు 84 శాతం బుకింగ్‌లు హైదరాబాద్-బెంగళూరు, విజయవాడ-బెంగళూరు, నెల్లూరు-బెంగళూరు రూట్లలో నమోదవతున్నాయని సంస్థ తెలిపింది. ఏపీ, తెలంగాణలోని వివిధ పట్టణాలకు ప్రయాణించే వారి బుకింగ్ల్లో 16 శాతం హైదరాబాద్-విజయవాడ-హైదరాబాద్, విశాఖపట్నం-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం, ఖమ్మం-హైదరాబాద్, హైదరాబాద్-ఖమ్మం రూట్లు ఉన్నాయని పేర్కొంది. -
స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో పెరుగుతున్న బుకింగ్‌లు
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 15న జరగబోయే 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో తన ప్యాసింజర్ల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు స్వాత్రంత్ర్య దినోత్సవం జరిగే వారంలో ఎక్కువమంది ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నారని తెలిపింది.సంస్థ తెలిపిన వివరాల ప్రకారం..దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు పెరుగుతున్నాయి. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతోంది. గోవా, జైపూర్, దుబాయ్ వంటి గమ్యస్థానాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ప్రధాన మెట్రో నగరాలతో పాటు టైర్ 2, 3 పట్టణాల్లో విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు. సంస్థ ప్రకటించిన ‘ఎక్స్‌ప్రెస్ లైట్ జీరో-బ్యాగేజీ ఛార్జీ’లకు ఆదరణ ఎక్కువవుతుంది. ఆగస్టు 15 నుంచి 19 వరకు దేశీయంగా, దుబాయ్, సింగపూర్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు భారీగా టెకెట్లు బుక్ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఆగస్టు 15న ఉన్న బుకింగ్‌లు పెరిగాయి.ఇదీ చదవండి: బీఎన్ఎన్ఎల్ ‘5జీ-రెడీ సిమ్‌కార్డు’ విడుదలపంద్రాగస్టు ఉన్న మూడోవారంలో ప్రధానంగా గోవా, జైపూర్, బాగ్డోగ్రా, శ్రీనగర్, కొచ్చి, అయోధ్య, వారణాసి వంటి దేశీయ గమ్యస్థానాలకు ప్రయాణాలు పెరుగనున్నాయని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. సంస్థకు అధిక రెవెన్యూ గల మార్గాల్లో కోల్‌కతా-కొచ్చి, బెంగళూరు-జైపూర్, హైదరాబాద్-వారణాసి, బెంగళూరు-బాగ్డోగ్రా, లఖ్‌నవూ-దుబాయ్, తిరుచిరాపల్లి-సింగపూర్, ఢిల్లీ-అయోధ్య ఉన్నాయని చెప్పారు. -
IRCTC: రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో మార్పులు
దేశంలో ఎక్కువ మంది ప్రయాణించే సాధనం రైల్వేలు. చాలా మంది ఆన్లైన్లో ట్రైన్ టికెట్లు బుక్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారిక ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరికొన్ని మార్పులు చేసింది. ప్రయాణికులు రైలు టిక్కెట్లను సులభంగా, దుర్వినియోగానికి గురి కాకుండా బుక్ చేసుకోవడానికి వీలుగా ఐఆర్సీటీసీ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం.. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసే ప్రయాణికులు ముందుగా వారి ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్‌ను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇలా ధ్రువీకరించాలి.. మొదటగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌లో వెరిఫికేషన్ విండోకు లాగిన్ చేయండి తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని నమోదు చేయండి. హోమ్ పేజీలో అవసరమైన సమాచారాన్ని అందించిన తర్వాత వెరిఫై బటన్‌పై క్లిక్ చేయండి. మీ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి మీ మొబైల్ నంబర్ని ధ్రువీకరించండి ఇక ఈమెయిల్ వెరిఫికేషన్ పూర్తి చేయడానికి ముందుగా మీ ఈమెయిల్ ఐడీకి వచ్చిన కోడ్‌ను నమోదు చేయండి. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆన్లైన్ రైలు టిక్కెట్ బుకింగ్‌లు చేయగలుగుతారు. కేంద్ర బడ్జెట్ 2024ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్లో రైల్వేలకు కేటాయింపులు, కొత్త రైళ్లు, రైలు మార్గాలు, ఇతర అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
థియేటర్లతో ఎంవోయూ, సీట్ల మ్యాపింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయం దిశగా రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) సన్నద్ధమవుతోంది. సినీపరిశ్రమకు చెందిన వివిధ రంగాల ప్రతినిధులతో చర్చించిన అనంతరం ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు హోం శాఖ తాజాగా జీవో జారీచేసింది. దీంతో ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అందుకోసం చేపట్టాల్సిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ కలెక్టర్లకు నిర్దేశించారు. ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయ విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలోనే ప్రారంభించనున్నారు. కలెక్టర్ల ద్వారా ఎంవోయూ రాష్ట్రంలో ఉన్న 1,140 సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఎఫ్డీసీతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోవాలి. అందుకోసం ఎంవోయూ కాపీలను ఎఫ్డీసీ జిల్లా కలెక్టర్లకు పంపింది. కలెక్టర్లు థియేటర్ల యాజమాన్యాలతో సమావేశమై ఎంవోయూపై అవగాహన కల్పిస్తారు. అనంతరం వారం, పదిరోజుల్లో ఎంవోయూ కుదుర్చుకుని ఆ పత్రాలను కలెక్టర్లు ఎఫ్డీసీకి పంపుతారు. ఆన్లైన్లో టికెట్ల విక్రయం కోసం థియేటర్ల వారీగా ఉన్న సీట్లను నిర్ధారిస్తారు. అవకతవకలకు అవకాశం లేకుండా సీట్లను మ్యాపింగ్ చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో థియేటర్లలో ఎన్ని సీట్లు ఉన్నాయన్నది అధికారికంగా గణాంకాలు లేవు. కొన్ని థియేటర్ల యజమానులు సీట్ల సంఖ్యను తక్కువగా చూపిస్తూ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చిన తరువాత కూడా సీట్ల సంఖ్యపై స్పష్టత లేకపోతే.. కొన్ని టికెట్లను ఆఫ్‌లైన్‌లో విక్రయించి అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఉంటుంది. అందుకోసమే థియేటర్ల వారీగా సీట్లను ఎఫ్డీసీ మ్యాపింగ్ చేయనుంది. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ కల్పించనున్న సర్వీసు ప్రొవైడర్ ఆన్లైన్లో టికెట్ల విక్రయం కోసం పిలిచిన టెండర్లను ఎస్ఆర్ఐటీ–జస్ట్ టికెట్స్ సంస్థ దక్కించుకుంది. టెండర్లు, రివర్స్ టెండర్ల ప్రక్రియ అనంతరం ఆ సంస్థకు టెండరును ఎఫ్డీసీ ఖరారు చేసింది. టికెట్లను నేరుగా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. థియేటర్ల వద్ద టికెట్ కౌంటర్లో కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ ఆ టికెట్ కౌంటర్లలో కూడా ఎఫ్డీసీ పోర్టల్ నుంచే టికెట్లు విక్రయిస్తారు. అందుకోసం సినిమా థియేటర్లకు అవసరమైన హార్ట్‌వేర్, సాఫ్ట్వేర్, ఇతర మౌలిక సదుపాయాలను సర్వీసు ప్రొవైడర్‌గా ఎంపికైన సంస్థ కల్పిస్తుంది. ఆన్లైన్లో టికెట్ల విక్రయంపై సిబ్బందికి శిక్షణ ఇస్తుంది. ఇతర సంస్థల కంటే చాలా తక్కువ సర్వీసు చార్జి ఆన్లైన్లో విక్రయించే సినిమా టికెట్లపై 1.95 శాతం చొప్పున సర్వీసు చార్జీని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 0.95 శాతాన్ని సర్వీస్ ప్రొవైడర్‌కు చెల్లిస్తారు. మిగిలిన ఒక శాతం ఎఫ్డీసీ ఖాతాలోకి చేరుతుంది. ఆ విధంగా సమకూరే నిధులతో రాష్ట్రంలో సినీపరిశ్రమ అభివృద్ధికి అవసరమైన చర్యలను ఎఫ్డీసీ చేపడుతుంది. ప్రస్తుతం ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్న వివిధ సంస్థలకంటే చాలా తక్కువ సర్వీసు చార్జీని ప్రభుత్వం నిర్ణయించింది. పలు సంస్థలు రాష్ట్రంలో ప్రధాన నగరాలతోపాటు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయానికి టికెట్ రేటును బట్టి రూ.12 నుంచి రూ.50 వరకు సర్వీసు చార్జి వసూలు చేస్తుండటం గమనార్హం. ఆ సంస్థలు కూడా టికెట్లను ఎఫ్డీసీ పోర్టల్ నుంచే కొనుగోలు చేయాలి. ఆ సంస్థలు తాము ప్రేక్షకుల నుంచి వసూలు చేస్తున్న సర్వీసు చార్జీలో 1.95 శాతాన్ని ఎఫ్డీసీకి చెల్లించాలి. ఆ విధంగా కాకుండా నేరుగా ఎఫ్డీసీ పోర్టల్ నుంచి కొనుగోలు చేస్తే ప్రేక్షకులకు సర్వీసు చార్జి తక్కువగా పడుతుందని ఎఫ్డీసీ వర్గాలు చెబుతున్నాయి. ఎఫ్డీసీ పోర్టల్‌పై విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా అవగాహన కల్పిస్తామని కూడా తెలిపాయి. -
యాదాద్రి ఆన్లైన్ టికెట్ బుకింగ్‌కు ట్రయల్‌రన్
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఈసీఐఎల్ కంపెనీ ప్రతినిధుల బృందం ఆన్లైన్లో టికెట్ బుకింగ్ ప్రక్రియపై ట్రయల్ రన్ నిర్వహించారు. ఆన్లైన్లో టికెట్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ దర్శనం టికెట్ దేవస్థానం అధికారులు నిర్ణయించిన ధరతో వస్తుంది. ఇందులో దర్శనానికి సంబంధించి రిపోర్టింగ్ తేదీ, సమయం, ఏ గేట్ వద్ద రిపోర్ట్ చేయాలి, బుకింగ్ నంబర్, బుకింగ్ డేట్, చెల్లించిన నగదు, ఆలయసేవలు, ఆలయానికి సంబంధించిన ఫోన్ నంబర్, ఆధార్, పేరు క్యూర్ కోడ్‌తో ఉండనున్నాయి. ప్రధానాలయం ప్రారంభం అయిన తర్వాత ఎన్ని రోజులకు ఈ టికెట్ బుకింగ్ విధానం ప్రవేశపెడతారు, ఏ వెబ్సైట్లో వీటిని వినియోగించాలనే అంశాలను అధికారులు నిర్ణయించాల్సి ఉంది. -
టీ–వాలెట్‌తో ఆర్టీసీ టికెట్ బుకింగ్‌లు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లకు సంబంధించి ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఇక నుంచి ‘టీ–వాలెట్’మొబైల్ యాప్ ద్వారా కూడా రిజర్వేషన్లు బుక్ చేసుకొనే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ రిజర్వేషన్లకు టీ–వాలెట్ ద్వారానే చార్జీలు కూడా చెల్లించవచ్చు. దీంతో ప్రయాణికుల ఈ మెయిల్ అడ్రస్‌కు, మొబైల్ ఫోన్‌కు టికెట్ బుకింగ్ సంక్షిప్త సందేశం వస్తుంది. ప్రయాణ సమయంలో పేపర్‌లెస్ టికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే 1,770 బస్సుల్లో ఈ సదుపాయాన్ని మరో రెండు రోజుల్లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ శుక్రవారం బస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రతిరోజు ఆర్టీసీ బస్స్టేషన్లలోని కౌంటర్లు, అధీకృత టికెట్ బుకింగ్ ఏజెన్సీలు, టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా 13,000 మంది ప్రయాణికులు రిజర్వేషన్ టికెట్లు తీసుకుంటున్నారు. వీటిలో 6,009 టికెట్లు కేవలం ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకుంటున్నారు. ఈ టికెట్లపైన ఆర్టీసీకి ప్రతిరోజు రూ.61.09 లక్షల ఆదాయం లభిస్తుంది. ఇక నుంచి ఆన్లైన్ బుకింగ్‌లన్నింటినీ టీ–వాలెట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. త్వరలో బస్‌పాస్‌లకు విస్తరణ.. మరోవైపు ఆర్టీసీ అందజేసే వివిధ రకాల బస్‌పాస్‌లకు కూడా టీ–వాలెట్ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇప్పటికే అన్ని రకాల పాస్‌లను ఆన్లైన్ చేశారు. విద్యార్ధులు, ఉద్యోగులు తదితర వర్గాల ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా పాస్‌లు తీసుకొనే సదుపాయం ఉంది. టీ–వాలెట్‌కు దీన్ని అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికులు ఈ మొబైల్ యాప్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు అవకాశం ఉంటుంది. ఏఎస్ఆర్టీయూ నిబంధనల మేరకే బయోడీజిల్ కొనుగోలు.. ఆర్టీసీలో బయోడీజిల్ వినియోగాన్ని పెంచడంపై దృష్టి సారించినట్లు ఆర్టీసీ చైర్మన్ వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు 35 వేల లీటర్లు వినియోగిస్తున్నామని, త్వరలో దీనిని లక్ష లీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 5 లక్షల లీటర్ల సాధారణ డీజిల్‌కు 20 శాతం చొప్పున లక్ష లీటర్ల బయోడీజిల్‌ను వినియోగించాల్సి ఉందన్నారు. తద్వారా కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, ప్రజలకు పర్యావరణ ప్రియమైన ప్రయాణ సదుపాయం లభిస్తుందన్నారు. ఇందుకోసం తాము ఏఎస్ఆర్టీయూ నిబంధనల మేరకే బయోడీజిల్‌ను కొనుగోలు చేస్తున్నామన్నారు. సాధారణ డీజిల్ ధరలపైన రూ.2 తక్కువకు బయోడీజిల్ కొనుగోలు చేయవచ్చునని ఏఎస్ఆర్టీయూ సూచించింది. కానీ తాము రూ.4 తక్కువకు అద్వైత్ అనే సంస్థ నుంచి బయోడీజిల్ కొనుగోలు చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. ఉద్యోగులు, కార్మికుల ఆన్డెప్యుటేషన్ బదిలీలు, అనారోగ్య సెలవుల విధానంలో కూడా పారదర్శకమైన పద్ధతులను పాటిస్తున్నట్లు చెప్పారు. టీ–వాలెట్ ద్వారా బుకింగ్ ఇలా... విద్యుత్ బిల్లులు, నల్లా బిల్లులు, ఇంటిపన్ను తదితర చెల్లింపుల కోసం ప్రభుత్వం ఇప్పటికే టీ–వాలెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ వాలెట్లో కొంత మొత్తాన్ని నిల్వ ఉంచుకొని పేటీఎం తరహాలో వినియోగించుకోవచ్చు. గూగుల్ ప్లేస్లోర్ నుంచి ఈ వాలెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆన్లైన్లో క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించి ఆర్టీసీ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇక నుంచి ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా, ఏ సమయంలోనే తమ మొబైల్ ఫోన్ నుంచి టికెట్ బుక్ చేసుకోవచ్చు. క్షణాల్లోనే మొబైల్‌కు సమాచారం వచ్చేస్తుంది. అధీకృత టికెట్ బుకింగ్ ఏజెన్సీల వద్ద కానీ, ఆర్టీసీ బుకింగ్ కౌంటర్ల వద్ద కానీ పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి ప్రతిరోజు విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, చిత్తూరు, బెంగళూరు, చెన్నై, ముంబై, షిరిడీ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే 1,770 టీఎస్ఆర్టీసీ బస్సుల్లో టీ– వాలెట్ ద్వారా బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. నష్టాలను అధిగమిస్తూనే మెరుగైన సేవలు: సోమారపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ఆర్థికంగా నిలదొక్కుకోవాడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోందని సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం బస్‌భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీఎస్ ఆర్టీసీ ఎప్పటికప్పుడు ప్రైవేట్ వాహనాల పోటీని తట్టుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తోందన్నారు. ప్రజారవాణా వ్యవస్థలో పోటీ నెలకొందని.. ఆటో, మ్యాక్స్, తుఫాన్, సెవెన్ సీటర్స్ వంటి ప్రైవేట్ వాహనాల పోటీని తట్టుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రతిరోజూ సంస్థకు వచ్చే రాబడి రూ.11 కోట్లు కాగా, ఖర్చు రూ.14 కోట్లు అవుతోందని చెప్పారు. సంస్థకు భారం పెరిగినప్పటికీ సిబ్బందికి వర్తించే ప్రయోజనాలను కొంచెం అటు, ఇటుగా వర్తింపజేస్తున్నామన్నారు. కష్ట సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిధులు సమకూర్చుకోవడం జరుగుతోందన్నారు. టీఎస్ ఆర్టీసీ దేశంలోనే జీరో యాక్సిడెంట్ రేటుతో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
క్లిక్ దూరంలో బస్ టికెట్
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం... సంస్థ నినాదం. ఇప్పుడు టికెట్ రిజర్వేషన్ సులభం... అధికారుల మాట ఇది. ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలు ప్రవేశపెట్టిన ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంది. దీని ద్వారా మనం ఎక్కదల్చుకున్న స్టేజీ నుంచి.. వెళ్లవలసిన ఊరికి బస్సులున్నాయా? ఉంటే.. ఎన్ని ఉన్నాయి?. ప్రయాణ చార్జీలు ఎంత? వంటి ఎన్నో విషయాలను ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు. - గాజులరామారం ఆన్లైన్ రిజర్వేషన్ చేయాలంటే మన వద్ద ఉండాల్సినవి... ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన మొబైల్/ కంప్యూటర్. బ్యాంక్డెబిట్/ క్రెడిట్ కార్డ్/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌలభ్యం. ఐడీ ప్రూఫ్ ఆన్లైన్ రిజర్వేషన్ ఇలా .. ఇందుకు http://apsrtconline.in/oprsweb/, http://www.tsrtcbus.in/oprsweb/ సైట్లలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలి. ఇప్పుడు విండోలో కనిపిస్తున్న ‘బుక్ యువర్ టికెట్ నౌ’ ఆప్షన్లో ఉన్న వివరాలు పూరించాలి. మీకు ప్రయాణంతో పాటుగా తిరుగు ప్రయాణంకు కూడ టికెట్ కావాలంటే ‘రౌండ్ ట్రిప్’ను క్లిక్ చేయండి. వెళ్లే టికెట్ ఒక్కటే కావాలంటే ‘ఒన్ వే’ను క్లిక్ చేయాలి. ఇక ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణం, పెద్దలు, పిల్లలు ఎంత మంది, ప్రయాణపు తేది, ఎలాంటి బస్సు కావాలి తదితర విషయాలు పూరించాలి. ‘కన్సిసన్’ ఆప్షన్ వద్ద మాత్రం ఆర్టీసీ సిబ్బంది, క్యాట్ కార్డ్ దారులు మినహా మిగిలిన వారు ‘జనరల్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ‘చెక్ ఎవైలబిలిటి’ని క్లిక్ చేస్తే మీరు వెళ్లే ప్రాంతంకు ఏఏ బస్సులు ఉన్నవి, ప్రయాణ చార్జీ ఎంత, అవి బయలుదేరే సమయం, చేరుకునే సమయం వివరాలు కనిపిస్తాయి. మీకు అనుగుణంగా ఉన్న బస్సును ఎంచుకుని ‘బుక్ నౌ’ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు లాగిన్ కావాలి. ఇందుకు ‘సైన్ అప్’ను క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ కనిపిస్తుంది. ఇందులో మీ పూర్తి వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే మీ మెబైల్‌కు పాస్వర్డ్ వస్తుంది. దీంతో మీరు లాగిన్ అవ్వవచ్చు. లాగిన్ అయిన తర్వాత మీరు ఇంతకు ముందు ఎంచుకున్న బస్సులో అందుబాటులో ఉన్న సీట్లతో పాటుగా మీ వివరాలు అడుగుతుంది. మీకు నచ్చిన సీట్‌ను ఎంచుకుని, వివరాలు నమోదు చేసి, వస్తున్న ఆప్షన్లను అనుసరిస్తూ పేమెంట్ చేయాలి. పేమెంట్ అయిన మరుక్షణమే మీకు మీరు పేర్కొన్న మెబైల్ నంబరుకు ఈ-టికెట్ వస్తుంది. నోట్ : ఫోన్ నంబరు కచ్చితంగా సరైంది ఇవ్వాలి. ఎందుకంటే మీ ఈ- టికెట్ ఆ మెబైల్కే వస్తుంది. అదేవిధంగా మీ గుర్తింపు కార్డు నంబరును బుకింగ్ సమయంలో నమోదు చేయాలి. మీరు నమోదు చేసిన ఐడీ నంబరు కలిగిన ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌ను ప్రయాణ సమయంలో చూపించాలి.