ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 15న జరగబోయే 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో తన ప్యాసింజర్ల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు స్వాత్రంత్ర్య దినోత్సవం జరిగే వారంలో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారని తెలిపింది.
సంస్థ తెలిపిన వివరాల ప్రకారం..దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు పెరుగుతున్నాయి. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతోంది. గోవా, జైపూర్, దుబాయ్ వంటి గమ్యస్థానాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ప్రధాన మెట్రో నగరాలతో పాటు టైర్ 2, 3 పట్టణాల్లో విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు. సంస్థ ప్రకటించిన ‘ఎక్స్‌ప్రెస్ లైట్ జీరో-బ్యాగేజీ ఛార్జీ’లకు ఆదరణ ఎక్కువవుతుంది. ఆగస్టు 15 నుంచి 19 వరకు దేశీయంగా, దుబాయ్, సింగపూర్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు భారీగా టెకెట్లు బుక్ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఆగస్టు 15న ఉన్న బుకింగ్‌లు పెరిగాయి.
ఇదీ చదవండి: బీఎన్‌ఎన్‌ఎల్ ‘5జీ-రెడీ సిమ్‌కార్డు’ విడుదల
పంద్రాగస్టు ఉన్న మూడోవారంలో ప్రధానంగా గోవా, జైపూర్, బాగ్‌డోగ్రా, శ్రీనగర్, కొచ్చి, అయోధ్య, వారణాసి వంటి దేశీయ గమ్యస్థానాలకు ప్రయాణాలు పెరుగనున్నాయని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. సంస్థకు అధిక రెవెన్యూ గల మార్గాల్లో కోల్‌కతా-కొచ్చి, బెంగళూరు-జైపూర్, హైదరాబాద్-వారణాసి, బెంగళూరు-బాగ్డోగ్రా, లఖ్‌నవూ-దుబాయ్, తిరుచిరాపల్లి-సింగపూర్, ఢిల్లీ-అయోధ్య ఉన్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment