indepandance day
-
స్వాతంత్ర దినోత్సవం ప్రత్యేకం.. తెలుగులో చూడాల్సిన దేశభక్తి చిత్రాలివే!
యావత్ భారతదేశం గర్వంగా, దేశభక్తిని చాటి చెప్పేలాఅందరం ఆనందంగా జరుపుకునే పండుగ స్వాతంత్ర్య దినోత్సవం. ఈ పంద్రాగస్టుతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు పూర్తి అవుతోంది. గడిచిన ఏడు దశాబ్దాలుగా దేశ భక్తిని చాటి చెప్పే ఏన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రత్యేకంగా దేశభక్తిని చాటి చెప్పే సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చూడాల్సిన టాలీవుడ్ దేశభక్తి సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి.స్వాతంత్ర దినోత్సవం రోజు చూడాల్సిన తెలుగు సినిమాలివేఅల్లూరి సీతారామరాజుమన్యం వీరుడు అల్లూరి కథతో తెరకెక్కిన సినిమా ఇది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతోపాటు దేశభక్తి మరోసారి ఉప్పొంగేలా చేసింది.ఖడ్గంకృష్ణవంశీ దర్శకత్వంలో దేశభక్తి కథాంశంతో వచ్చిన సినిమా ఖడ్గం. 1990లో ముంబైలో జరిగిన దాడుల్లో చాలా మంది చనిపోయారు. దాని ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు కృష్ణవంశీ. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్, రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలోని పాటలు కూడా హిట్ అయ్యాయి.సుభాష్ చంద్రబోస్విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం ఇది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాం బాక్సాపీస్ వద్ద బోల్తా పడినప్పటీకీ.. వెంకటేశ్ నటన మాత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది.భారతీయుడుశంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా కూడా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో దేశం మోసం పోరాడే యోధుడిగా.. అవినీతి పరులను అంతం చేసే భారతీయుడిగా కమల్ నటన ఆకట్టుకుంది.సైరా నరసింహారెడ్డిస్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ ప్రాంతంలో జన్మించిన నరసింహారెడ్డి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పడిన కష్టాన్ని ఈ సినిమాలో కళ్ల కట్టినట్లు చూపించారు.మహాత్మ2009 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఇందులో శ్రీకాంత్, భావన ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలోని ‘కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ పాట’దేశభక్తి మరోసారి ఉప్పొంగేలా చేసింది.పరమ వీర చక్ర2011లో విడుదలైన తెలుగు చిత్రం ఇది. తేజ సినిమా బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించాడు. దర్శకుడిగా దాసరి నారాయణరావుకు ఇది 150 వ చిత్రం. నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించారు.ఘాజీ1971లో జరిగిన యదార్ధ యుద్దగాద నేపధ్యంలో విశాఖ సబ్ మెరైన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమా ఘాజీ. సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో రానా, తాప్సీ, అతుల్ కులకర్ణి, రాహుల్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటించారు.సర్దార్ పాపారాయుడు1980ల్లో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా కనిపించారు. సర్దార్ పాపారాయుడు అంటూ ఈ సినిమాలో ఎన్టీఆర్ పలికిన పలుకులను ఎవ్వరూ అంత సులభంగా మర్చిపోలేరు. శ్రీదేవీ, శారద తదితరులు నటించిన ఈ చిత్రానికి దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు.బొబ్బిలి పులి1982లో ఎన్టీఆర్ ప్రధానపాత్రలో వచ్చిన చిత్రం బొబ్బలి పులి. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవీ, మురళీ మోహన్, జగ్గయ్య, కైకాల సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలలో నటించారు. దేశ భక్తి ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది.గౌతమిపుత్ర శాతకర్ణిబాలకృష్ణ ప్రధానపాత్రలో నటించిన సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ సినిమాను కృష్ణ జాగర్లమూడి డైరెక్షన్లో తెరకెక్కించారు.ఆర్ఆర్ఆర్రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో బ్రిటీష్ కాలంలో పోరాడిన యోధుల చరిత్ర ఆధారంగా రూపొందించారు. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో మెప్పించగా.. రామ్ చరణ్ బ్రిటీష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు.రాజన్న(2011)నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం రాజన్న. 2011లో వచ్చిన ఈ సినిమాను విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందించారు.మేజర్అడివిశేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మేజర్. ఈ సినిమాను ముంబై ఉగ్రవాద దాడి సమయంలో తన ప్రాణాలను త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు.వీటితో పాటు పల్నాటి యుద్ధం, నేటిభారతం(1983), వందేమాతరం(1985), ఆంధ్రకేసరి-(1983), మరో ప్రపంచం, మనదేశం(1949) లాంటి దేశ స్వాతంత్ర్య పోరాటాల ఆధారంగా తెరకెక్కించిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇండిపెండెన్స్ సందర్భంగా స్వాతంత్ర్య పోరాటయోధుల చరిత్రను తెలుసుకునేందుకు ఈ సినిమాలు చూసేయండి. -
రూపాయి 78 ఏళ్ల ప్రస్థానం..
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి రేపటితో 78 ఏళ్లు పూర్తవుతాయి. బ్రిటిష్ రాచరిక పాలన అంతమైన 1947 సమయంలో ఇండియన్ రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ.3.30గా ఉండేది. క్రమంగా అది మారుతూ ప్రస్తుతం రూ.83.92కు చేరింది. ఇలా డాలర్ పెరిగి రూపాయి విలువ తగ్గేందుకు చాలా కారణాలున్నాయి. స్వాతంత్ర్యం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు డాలర్-రూపాయి పరిణామం ఎలా ఉందనే వివరాలు తెలుసుకుందాం.రూపాయి విలువను ప్రభావితం చేసే కొన్ని అంశాలు..వాణిజ్యం: భారత్ విదేశాల నుంచి చేసుకునే దిగుమతులు, ఇతర ప్రాంతాలకు చేసే ఎగుమతుల సమతుల్యత వల్ల రూపాయి ప్రభావం చెందుతుంది. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా చేస్తే రూపాయి విలువ పడిపోతుంది. విదేశీ కరెన్సీలకు డిమాండ్ పెరుగుతుంది.ద్రవ్యోల్బణం: దేశంలోని అధిక ద్రవ్యోల్బణం వల్ల వస్తువుల కొనుగోలుకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ తగ్గిపోతుంది.వడ్డీ రేట్లు: అధిక వడ్డీ రేట్లు విదేశీ మూలధనాన్ని ఆకర్షిస్తాయి. రూపాయి విలువను పెంచుతాయి.విదేశీ మారక నిల్వలు: భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిల్వలు, ఈక్విటీ మార్కెట్లోకి వచ్చే ఫారెన్ కరెన్సీ వల్ల రూపాయి స్థిరంగా ఉంటుంది. విదేశీ కరెన్సీ రాకపెరిగితే రూపాయి విలువ పెరుగుతుంది.రాజకీయ, ఆర్థిక పరిస్థితులు: ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందాలంటే రాజకీయ అనిశ్చితులు ఉండకూడదు. స్పష్టమైన రాజకీయ నాయకత్వ పరిస్థితులు లేకపోయినా రూపాయి పతనమయ్యే అవకాశం ఉంటుంది.చమురు ధరలు: భారత్ గణనీయంగా చమురును దిగుమతి చేసుకుంటోంది. అందుకోసం డాలర్లు చెల్లించాల్సిందే. భారత్ వద్ద ఉన్న ఫారెన్స్ కరెన్సీ రిజర్వులు అందులో ఉపయోగపడుతాయి. అయితే చమురు ధరలు పెరగితే చెల్లింపులు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. దాంతో డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ తగ్గుతుంది.కొన్ని నివేదికల ప్రకారం.. 1947లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి ఎక్సేంజ్ రేట్ రూ.3.30గా ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ విలువ క్రమంగా పడిపోయింది. 1947 నుంచి 2024 వరకు ఇండియన్ రూపాయి పరిణామక్రమం కింది విధంగా ఉంది.ఇదీ చదవండి: మూడు నెలల్లో మూడు కోట్ల అమ్మకాలుసంవత్సరం - ఎక్సేంజ్ రేట్(USD/INR) 1947 3.30 1949 4.76 1966 7.50 1975 8.39 1980 7.86 1985 12.38 1990 17.01 1995 32.427 2000 43.50 2005 43.47 2010 46.21 2015 62.30 2020 73.78 2021 73.78 2022 81.32 2023 82.81 2024 83.92 -
స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో పెరుగుతున్న బుకింగ్‌లు
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 15న జరగబోయే 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో తన ప్యాసింజర్ల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు స్వాత్రంత్ర్య దినోత్సవం జరిగే వారంలో ఎక్కువమంది ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నారని తెలిపింది.సంస్థ తెలిపిన వివరాల ప్రకారం..దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు పెరుగుతున్నాయి. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతోంది. గోవా, జైపూర్, దుబాయ్ వంటి గమ్యస్థానాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ప్రధాన మెట్రో నగరాలతో పాటు టైర్ 2, 3 పట్టణాల్లో విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు. సంస్థ ప్రకటించిన ‘ఎక్స్‌ప్రెస్ లైట్ జీరో-బ్యాగేజీ ఛార్జీ’లకు ఆదరణ ఎక్కువవుతుంది. ఆగస్టు 15 నుంచి 19 వరకు దేశీయంగా, దుబాయ్, సింగపూర్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు భారీగా టెకెట్లు బుక్ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఆగస్టు 15న ఉన్న బుకింగ్‌లు పెరిగాయి.ఇదీ చదవండి: బీఎన్ఎన్ఎల్ ‘5జీ-రెడీ సిమ్‌కార్డు’ విడుదలపంద్రాగస్టు ఉన్న మూడోవారంలో ప్రధానంగా గోవా, జైపూర్, బాగ్డోగ్రా, శ్రీనగర్, కొచ్చి, అయోధ్య, వారణాసి వంటి దేశీయ గమ్యస్థానాలకు ప్రయాణాలు పెరుగనున్నాయని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. సంస్థకు అధిక రెవెన్యూ గల మార్గాల్లో కోల్‌కతా-కొచ్చి, బెంగళూరు-జైపూర్, హైదరాబాద్-వారణాసి, బెంగళూరు-బాగ్డోగ్రా, లఖ్‌నవూ-దుబాయ్, తిరుచిరాపల్లి-సింగపూర్, ఢిల్లీ-అయోధ్య ఉన్నాయని చెప్పారు. -
స్త్రీ పోరాటాన్ని ఆవిష్కరించిన ఉద్యమం!బ్రిటిషర్లకే చుక్కలు చూపించారు!
1942 ఆగస్టు 9న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బొంబాయి సమావేశంలో లేవనెత్తిన 'డూ ఆర్ డై అనే నినాదమేస క్విట్ ఇండియా ఉద్యమానికి నాంది. ఇదే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వలసవాద వ్యతిరేక ఉద్యమాలలో ఒకటిగా పేరుగాంచింది. దీనినే భారత్ చోరో ఆందోళన అని కూడా పిలుస్తారు. ఈ ఉద్యమే భారత స్త్రీ ఆవేశాన్ని వెలకితీసింది. ఆ ఉద్యమంలో వారేమీ సంప్రదాయ ముసుగులో మగ్గిపోతున్న వంటింటి కుందేళ్లు గాదని అవసరమైతే దేశం కోసం చీరను నడుముకి బిగించి కథన రంగంలోకి దిగే అపర కాళీశక్తులని ఎలుగెత్తి చెప్పారు. బ్రిటిషర్ల గుండెల్లో భయాన్ని పుట్టించారు. భారత స్త్రీ అంటే ఏంటో చూపించారు. వారి ధైర్యసాహసాలు, అపార త్యాగనిరతితో కరడుగట్టిన బ్రిటిషర్ల మనసులనే కదిలించారు. చివరికి నారీమణుల ధీ శక్తికి తెల్లవాళ్లే తలవంచి నమస్కరించి "జయహో భారత్" అనేలా చేసింది. పంద్రాగస్టు వేడుకలు సమీపిస్తున్న తరుణంలో నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ధీరవనితలు గురించి తెలుసుకుందామా! బహుశా ఆమే తొలి రేడియో జాకీ..! క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న 22 ఏళ్ల విద్యార్థిని ఉషా మెహతా. ఆమె తన గాత్రంతో నాటి ఉద్యమ పరిస్థితులను వివరిస్తూ బ్రిటిషర్లను గడగడలాడించింది. ఆమె బహుశా బారతదేశపు తొలి రేడియో జాకీ కావచ్చు. మెహతా ఎంత ధైర్యవంతురాలు అంటే భూగర్భ రేడియో స్టేషన్ ద్వారా ఉద్యమాల్లో జరుగుతున్న తాజా పరిణామాలను గురించి దేశాన్ని ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేసేది. వార్తా సంస్థలను అణివేసే వార్తలన్నింటిని ధైర్యంగా ప్రసారం చేసేది. పోలీసుల కళ్లుగప్పి రహస్యంగా సేవలందించేది. తన ఉనికిని కనిపెట్టకుండా జాగ్రత్త పడుతూ.. వివిధ ప్రదేశాల్లోని స్టేషన్లలో దేశభక్తి గీతాలతోపాటు మనోహర్ లోహియా వంటి విప్లవకారుల ప్రసంగాలను ప్రసారం చేసింది. ఈ రేడియో స్టేషన్ ఆగస్టు 27, 1942న 41.72 మీటర్ల బ్యాండ్‌తో ప్రారంభమయ్యింది. ఇది మార్చి6, 1943 వరకు కొనసాగింది. ఇది చివరిసారిగా జనవరి 26, 1944న ప్రసారమయ్యింది. గాత్రంతో కూడా దేశాన్ని రక్షించుకుంటూ వలసవాదుల గుండెల్లో గుబులు తెప్పించొచ్చు అని రుజువు చేసిన ఘట్టం. గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ది ఇండియన్ ఫ్రీడమ్ అరుణ్ అసఫ్ అలీని గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని కూడా పిలుస్తారు. అరుణా అసఫ్ అలీ 1942లో గోవాలియా ట్యాంక్ మైదాన్‌లో త్రివర్ణ భారత జెండాను ఎగురవేశారు. బ్రిటిష్ పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్న తరుణంలో అరుణ్ అజ్ఞాతంలోకి వెళ్లి మరీ స్వాతంత్ర పోరాటం కోసం చేస్తున్న ఉద్యమానికి నాయకత్వం వహించింది. అలాగే ఈ ఉద్యమంపై ప్రజల్లో చైతన్యం తెప్పించేలా భూగర్భ రేడియో స్టేషన్, ఇంక్విలాబ్' అనే పత్రికల సాయంతో ప్రచారం చేసింది. ఆమె క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు, 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది. 1932లో, తీహార్ జైలులోని ఖైదీల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ఆమె నిరాహారదీక్ష చేసింది. ఆ ఉపవాస ఫలితంగా ఆమె శరీరంలలో ఒక్కసారిగా జీవక్రియ స్థాయిలు పడిపోయి పరిస్థితి విషమించి మరణించింది అరుణ్ అసఫ్ అలీ. ఈ ఘటన కొంతమంది బ్రిటిషర్లను కదిలించడమే గాక భారత స్త్రీలు సహనమే ఆభరణంగా చేసుకుని పోరాడగలరనే విషయాన్ని గుర్తించారు. నెత్తురొడ్డుతున్న లెక్కచేయని తెగువ.. వృద్ధారాలు సైతం దేశం కోసం పరాక్రమంతో పోరాడగలదని చెప్పిన ఘట్టం. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాకు చెందిన మాతంగిని హజ్రా అనే 73 ఏళ్ల మహిళ క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అంతగా తెలియని, గుర్తించని నాయకురాళ్లో ఒకరామె. సెప్టంబర్ 29న 6 వేల మంది స్వాతంత్య్ర సమరయోధులను తమ్లుక్ పోలీస్ స్టేషన్‌ను దోచుకున్నారు. ఆసమయంలో కాల్పులు జరగగా..ఆమె బుల్లెట్ల బారినపడ్డప్పటికీ తలెత్తి వందేమాతరం అంటూ జెండాపట్టుకుని మరీ ఊరేగింపులో కొనసాగింది. నెత్తురొడ్డుతున్న లెక్కచేయలేదు. వందేమాతరం అంటూ కన్నుమూసింది. చివరి శ్వాసవరకు దేశం కోసం పోరాడటం అంటే ఏంటో చాటి చెప్పింది హజ్ర. ప్రజల్ని కదిలించిన గొప్ప ఘట్టం అది. మీ డ్యూటీ మీరు చేయండి! అస్సాంలోని గోహ్పూర్ నివాసి కనకలత బారువా. ఆమె 17 ఏళ్ల వయసులో 5 వేల మంది సైన్యానికి నాయకత్వం వహించి ఏకంగా పోలీస్ స్టేషన్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఆ పోలీస్టేషన్‌కి ఇన్చార్జ్గా ఉన్న నాటి ఆఫీసర్ రెబాతి మహన్ సోమ్ దీన్ని ఆపమని బారువాను అభ్యర్థించినా వినలేదు. పైగా మీరు మీ డ్యూటీ చేయండి నేను నా పని చేస్తానని తెగేసి చెప్పింది. ఏ మాత్ర భయం లేకుండా తన పాదయాత్రను కొనసాగించింది. దీంతో పోలీసులు చేసేదేమి లేక ఆమెపై కాల్పలు జరిపారు. ఆ ఫైరింగ్ కారణంగానే ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ ఘట్టం ఒక స్త్రీలోని దాగున్న తెగువతో కూడిన ఆవేశాన్ని తెలియజేసింది. ఈ ఘటన ఒకరకంగా బ్రిటిషర్లను మదిలో భయాందోళలనలను రేకెత్తించిందనే చెప్పాలి. రెండు నెలల పాపతో పోరాటంలోకి దిగిన ఓ తల్లి కేరళలోని అత్యంత ప్రసిద్ధ చెందిన స్వాతంత్య్ర సమరయోధులలో ఒకరు కుట్టిమలు అమ్మ. ఆమె క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ నాయకులలో ఒకరు. స్థానిక మహిళలతో బ్రిటిష్ సైనికులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే కథనాన్ని ప్రచురించినందుకు ప్రభుత్వం ఆమె మాతృభూమి పత్రికను నిషేధించింది. ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అమ్మ మహిళల ఊరేగింపుకు నాయకత్వం వహించింది. ఆమెతో పాటు రెండు నెలల పాప కూడా ఉంది. వెంటనే నాటి బ్రిటిష్ ఆఫీసర్లు ఆమెను బిడ్డతో సహా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారు. అంతేగాదు ఆమె భారత స్వాతంత్య్ర పోరాటాలన్నింటిల్లో చురుగ్గా పాల్గొంది. రెండు సార్లు జైలు పాలైంది కూడా. ఆమె విడుదలైన తదనంతరమే కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైంది కూడా. 1985లో అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచింది. (చదవండి: సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్ బాధితులకు ఉపాధిగా..!) -
108 అడుగుల స్తంభంపై జాతీయ జెండా
విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లాకు గుర్తింపులా 108 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. 20 అడుగులు వెడల్పు, 30 అడుగులు పొడవు ఉన్న ఈ జెండాను కలెక్టర్ హరిజవహర్‌లాల్ గురువారం ఆవిష్కరించారు. ఎయిర్‌పోర్టులు, మరికొన్ని ప్రధాన నగరాల్లో కనిపించే పొడవైన స్తంభాలపై జాతీయ జెండాను తొలిసారిగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని కలెక్టరు నిర్ణయించారు. ప్రభుత్వ అనుమతి లభించడంతో రూ.12.50 లక్షలు వ్యయం చేసి 108 అడుగులు పొడువు ఉండే స్తంభాన్ని ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో గ్యాలవైజ్డ్ ఇనుముతో తయారు చేయించారు. బుధవారం ఆ స్తంభాన్ని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను గురువారం కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టాన్ని గురువారం ఆవిష్కరించడం సంతోషమన్నారు. గుంటూరు తర్వాత విజయనగరంలోనే ఇంత పెద్ద జెండా స్తంభాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జెండా ఆవిష్కరించిన కలెక్టర్.. 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఆవిష్కరించారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన తర్వాత వందనం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పేదరికాన్ని నిర్మూలించేందుకు, అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహకరించాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. మహాత్మగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థతో సాకారం అవుతుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఇన్చార్జి జేసీ–2 సాల్మన్‌రాజ్, డీఆర్వో వెంకటరావు, విజయనగరం ఆర్డీఓ జెవి.మురళి, ఇతరులు పాల్గొన్నారు. రక్షాబంధన్ వేడుకలు.. రక్షాబంధన్ సందర్భంగా కలెక్టరేట్లో వేడుకలు నిర్వహించారు. కలెక్టర్‌కు పలువురు మహిళలు రాఖీ కట్టి సోదర భావాన్ని తెలిపారు. ఆయనతో పాటు పలువురు అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రిలయన్స్ డిజిటల్ భారీ ఆఫర్లు
సాక్షి, హైదరాబాద్ : రిలయన్స్ డిజిటల్ తన బ్లాక్ బస్టర్ డిజిటల్ ఇండియా సేల్కు మరోసారి తెర తీసింది. ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బెస్ట్ టెక్నాలజీ డీల్స్, ఆఫర్లతో 'డిజిటల్ ఇండియా సేల్' ని ప్రకటించింది. తద్వారా వినియోగదారులకు అతిపెద్ద ఆఫర్లను అందిస్తోంది. ఈ బ్లాక్ బస్టర్ డీల్స్ ఆగష్టు 10 నుండి ఆగస్టు 15, 2019 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులపై 15శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి కొనుగోలు చేస్తే అదనంగా మరో 10శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వడంతో పాటు 5 శాతం రిలయన్స్ డిజిటల్ క్యాష్ బ్యాక్ కూడా సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ 360 రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, 2200 మై జియో స్టోర్స్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లు ఆగస్టు 10 నుంచి ఆగస్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ‘రిలయన్స్ డిజిటల్’ ఆన్ లైన్ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. జీరో డౌన్ పేమెంట్, ఈఎంఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్ టాపులు భారీ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా 55 అంగుళాల టీవీ రూ.39,999కు, 65 అంగుళాల టీవీ రూ.59,990కు, 32 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.10,999కే లభించనుంది. దీంతోపాటు ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్లపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు రూ.44,990కే లభిస్తున్నాయి. ఇక ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు.. రూ.16,990కే అందుబాటులో ఉండనుంది. మెజో జీ6 ప్లస్(6జీబీ) స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9.999కే లభించనుంది. అలాగే న్యూ ఒప్పోఆర్17(8జీబీ) రూ.19,999కే అందనుంది. వీటితో పాటు బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా అందిస్తోంది. -
ఆయుష్మాన్ భారత్ ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : దేశ 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని హోదాలో ఐదవ సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మోదీ ప్రకటించారు. ఈ పథకం ద్వారా తొలి విడతగా 10 కోట్ల మందికి ఉచిత ఆర్యోగ సేవలను అందిచనున్నట్లు ప్రధాని తెలిపారు. సెప్టెంబర్ 25 నుంచి ఈ పథకం దేశ వ్యాప్తంగా అమలువుతోందని, దేశంలో ఆరోగ్య సమస్యలను రూపుమాపడం కోసం ఈ పథకం ఉపకరిస్తుందని పేర్కొన్నారు. అభివృద్దిలో దేశం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోందని, యావత్ దేశం విశ్వాసంతో తొణకిసలాడుతోందని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. బాపూజీ నేతృత్వంలో ఎందరో వీరులు దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ‘‘ఎందరో వీరులు ఎవరెస్ట్ శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు చెందిన గిరిజన బిడ్డలు కూడా ఎవరెస్ట్‌పై జాతీయ జెండాను ఎగరవేసి దేశ ఔనత్యాన్ని మరింత ఇనుమడింపచేశారు. జలియన్‌వాలా బాగ్ మహా విషాదానికి వందేళ్లు పూర్తి అయ్యాయి. మన దేశ వీరుల త్యాగాలకు ఆ ఘటన నిదర్శనం. మన స్వేచ్ఛ కోసం పోరాడిన వీరులకు వందనాలు. త్రివర్ణ పతాకం మరింత స్ఫూర్తిని ఇస్తోంది. 125 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవెర్చేందుకు కృషి చేస్తున్నాం. గడిచిన నాలుగేళ్లలో ఎన్నో సవాళ్లును అధిగమించా. దేశంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని పట్టుదలతో ఉన్నాం. దాని కోసం అహర్నిషలు కృషి చేస్తున్నాం. ఇప్పటికి దేశ వ్యాప్తంగా పాఠశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోంది. బాలికలు దేశ గౌరవాన్ని మరింత పెంచుతున్నారు. వారు ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్తు.. దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు’’ మోదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ఇటీవల పార్లమెంట్లో సామాజిక న్యాయం సాధించాం. చారిత్రక బీసీ బిల్లుకు రాజ్యాంగ బద్దత కల్పించాం. దళితులు, మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అణగారిన వర్గల అభివృద్ధికి మేం కృషి చేస్తున్నాం. దేశం నా వెంట ఉంది. కష్ట సమయాల్లో నా వెంటే ఉంటుందన్న నమ్మకం నాకుంది. దేశ యువతి ప్రగతి అర్ధాన్నే సరికొత్తగా నిర్వచించారు. యువత బీ.పీ.ఓలను ప్రారంభిస్తున్నారు. దేశంలో మౌలిక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. మూడు లక్షల గ్రామాల్లో డిజిటల్ ఇండియా కార్యాక్రమాలు జరుగుతున్నాయి. యువత తొడ్పాటుతో దేశం మరితం ముందుకెళ్తోంది. 12 ఏళ్లకు ఒకసారి పుష్పించే నిలగిరి పుష్పంలా దేశం వికసిస్తోంది. దేశ వ్యాప్తంగా ఆహార దాన్యాల ఉత్పతి గణనీయంగా పెరిగింది. ఓ వైపు వర్షాలు పడుతున్నాయన్న అనందం.. మరో వైపు అధిక వర్షాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈశాన్య భారతం ఢిల్లీకి దూరం అన్న భావాన్ని పూర్తిగా చెరిపివేశాం’’ దేశం ఆహార ధాన్యాలతో పాటు మొబైల్ ఫోన్ల్‌ను ఉత్పతి చేస్తోంది. ఎల్పీజీ గ్యాస్, విద్యుత్, మరుగుదొడ్లను నిర్మిస్తున్నాం. ఎవరెన్ని విమర్శలు చేసినా జీఎస్టీని విజయవంతగా అమలుచేశాం. రానున్న 30 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించబోతున్నాం. ప్రపంచ దేశాలు భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. అవినీతిని అరికట్టాం. పౌరసరఫరాల్లో అవకతవకలను నివారించాం. తొలిసారిగా సుప్రీంకోర్టులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఎన్నికయ్యారు. ఇది భారతీయ మహిళా శక్తికి నిదర్శనం. మహిళల పట్ల నేరాలకు పాల్పడే వాళ్లను కఠినంగా శిక్షిస్తున్నాం. చట్టం అన్నింటికన్నా ఉన్నతమైనది’’ అని పేర్కొన్నారు. -
అనంతను అగ్రస్థానంలో నిలుపుదాం
స్వాతంత్ర్య దినోత్సవంలో మంత్రి కాలవ పరేడ్ గ్రౌండ్స్‌లో రెపరెపలాడిన తిరంగా జెండా అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అనంతపురం అర్బన్: త్రికరణ శుద్ధిగా అందరూ సమష్టిగా కృషి చేసి ‘అనంత’ను అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో నిలపుదామని రాష్ట్ర సమాచార, గ్రామీణ గృహనిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన 71వ స్వాతంత్య్ర దినోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. సంక్షేమాభివృద్ధి పథకాల ఫలాలను పేదలందరికీ దక్కేలా జిల్లాలోని ప్రతి ఒక్కరూ యంత్రాగానికి సహకరించాలన్నారు. రైతన్నకు అండగా నిలుస్తాం ప్రభుత్వం రైతన్నకు అండగా నిలుస్తోందని మంత్రి తెలిపారు. రుణ ఉపశమనం కింద రెండు విడుతల్లో రూ.2,728 కోట్లు మంజూరు చేశామన్నారు. ఇప్పటికి రూ.1,479 కోట్లను రైతులకు అందజేశామన్నారు. 6.50 మంది రైతులకు రూ.1,032.42 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేసి పంపిణీ చేస్తున్నామన్నారు. 5.07 లక్షల మంది రైతులకు రూ.419 కోట్లు వాతావరణ బీమాను జమ చేస్తున్నామన్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొన్న నేపథ్యంలో రక్షకతడులిచ్చి ఎండుతున్న వేరుశనగ పంటను కాపాడేందుకు 5,897 రెయిన్గన్లు అందుబాటులో ఉంచామన్నారు. సగ్రమ ఉద్యాన అభివృద్ధి మిషన్, ఆర్కేవీవై పథకాల ద్వారా 25,439 మంది రైతుల లబ్ధిపొందేలా రూ.35.71 కోట్లు ఖర్చు చేశామన్నారు. 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే లక్ష్యంతో పనులు సాగుతున్నాయని మంత్రి కాలవ తెలిపారు. భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణాజలాలు అందించేందుకు రూ.1,171 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. పేరూరు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.813 కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. అలాగే రూ.463.50 కోట్లతో తుంగభద్ర ఎగువ కాలువ వెడల్పు పునులు జరుగుతున్నాయన్నారు. రూ.519 కోట్లతో యాడికి కాలువ పనులు జరుగుతున్నాయనీ, రూ.509 కోట్లతో మిడ్‌పెన్నార్ దక్షిణ కాలువ పనులు త్వరలోనే చేపడతామన్నారు. డ్వాక్రా మహిళలకు చేయూత డ్వాక్రా మహిళలకు చేయూతనిచ్చి వారిని ఆర్థికంగా అభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తున్నామని కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఈ ఏడాది 70,980 సంఘాలకు రూ.1,976 కోట్లు రుణాలు ఇప్పించామన్నారు. పుసుపు–కుంకుమ కింద 81,510 సంఘాలకు రూ.399 కోట్లు, వడ్డీ రాయితీ కింద 56,564 సంఘాలకు రూ.197 కోట్లు అందజేశామన్నారు. నిరుపేదలకు నీడ కల్పిస్తాం ఇల్లులేని నిరుపేదలకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేసి నీడ కల్పిస్తామని మంత్రి తెలిపారు. యూనిట్ విలువ రూ.1.50 లక్షల చొప్పున గత ఏడాది జిల్లాలో 17,400 గ్రామీణ గృహాలను కేటాయించామన్నారు. ఇందులో 4,202 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. ఎన్టీఆర్(గ్రామీణ్) పథకం కింద రూ.2 లక్షలు యూనిట్ విలువతో 1,322 ఇళ్ల నిర్మాణానికి రూ.26.44 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. విద్య, వైద్యం, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు. తాగునీరు, రహదారుల అభివృద్ధి చర్యలు తీసుకున్నామన్నారు. పారిశ్రాకంగా అభివృద్ధి చేస్తాం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద 600 ఎకరాల్లో రూ.13 వేల కోట్లతో కియా కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు. గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద రూ.200 కోట్లతో ఎయిర్‌బస్, సొమందేపల్లి మండలం గుడిపల్లి, కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం వద్ద 2,143 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, పారిశ్రామిక వాడలు, బీకేఎస్ మండలం సిద్దరాంపురం వద్ద 151 ఎకరాల్లో నూనెగింజల పరిశోధన కేంద్రం ఏర్పాటుకు భూములు సేకరించామన్నారు. 12 ఎకరాల విస్తీర్ణంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే భెల్, రాగమయూరి ఎలక్ట్రానిక్స్ పార్క్, జేఎన్టీయూలో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభానికి చర్యలు తీసుకున్నామన్నారు. వేడుకల్లో కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి, జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, అసిస్టెంట్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు హనుమంతరాయచౌదరి, గోనగుంట్ల సూర్యనారాయణ, వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మేయర్ మదమంచి స్వరూప, డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి పాల్గొన్నారు. ఆకట్టుకున్న శకటాలు స్వాతంత్య్ర దినోత్సవ వేడకల సందర్భంగా వివిధ శాఖలు ప్రదర్శించిన ప్రగతి శకటాలు ఆకట్టుకున్నాయి. వీటిలో డీఆర్డీఏ శాఖ ప్రదర్శించిన శకటానికి ప్రథమ బహుమతి, వ్యవసాయ శాఖ శకటానికి ద్వితీయ బహుమతి, డ్వామా శకటానికి తృతీయ బహుమతిని మంత్రి చేతుల మీదుగా ఆయా శాఖల అధికారులు అందుకున్నారు. మైదానంలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సందర్శించారు. అదే విధంగా లబ్ధిదారులకు ఆస్తులను పంపిణీ చేశారు.