శబరిలో స్వామివారి సేవలను బుక్ చేసుకోండిలా.. | Ayyappa Swamy visit booking know in travancore devaswom board | Sakshi
Sakshi News home page

శబరిలో స్వామివారి సేవలను బుక్ చేసుకోండిలా..

Published Mon, Jan 5 2015 11:22 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

శబరిలో స్వామివారి సేవలను బుక్ చేసుకోండిలా.. - Sakshi

శబరిలో స్వామివారి సేవలను బుక్ చేసుకోండిలా..

అయ్యప్ప స్వామి దర్శనానికి లక్షలాది మంది భక్తులు శబరిమలకు తరలివెళ్తుంటారు. వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, కొన్ని కిలోమీటర్లు కాలి నడకన సన్నిధానానికి చేరుకుంటారు. విపరీతమైన రద్దీ కారణంగా స్వామి వారిని తనివి తీరా చూడలేక.. తృప్తిగా సేవలు చేసుకోలేని పరిస్థితి. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ‘ట్రావెన్‌కోర్ దేవసోమ్ బోర్డు’ వారు వివిధ రకాల సేవలను ముందుగానే ఆన్‌లైన్‌ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. తమకు ఇష్టమైన రోజున వివిధ రకాల పూజలను జరిపించవచ్చు. ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయి.. ఏ తరహా సేవలను ఎలా బుక్ చేసుకోవచ్చు అనే వివరాలు మీ కోసం..                         

ఆన్‌లైన్ సేవలను బుక్ చేసుకునే విధానం..
ముందుగా https://www.sabarimalaaccomodation.com/ver1/Poojahome.aspx లింక్‌ను క్లిక్ చేయాలి.
ఇక్కడ అందుబాటులో ఉన్న పది రకాల సేవలు మీకు కన్పిస్తాయి.
సేవలతోపాటుగా వాటికి చెల్లించాల్సిన మొత్తం అక్కడ కన్పిస్తుంది.
మీకు కావాల్సిన పూజ పక్కనే కనిపిస్తున్న ‘బుక్ నౌ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఇక్కడ మీకు సెలక్ట్ డేట్ కనిపిస్తుంది.
మీకు నచ్చిన తేదీని ఎంచుకోవాలి. ఆ రోజు ఖాళీగా ఉంటేనే పూజ బుకింగ్ ఆప్షన్ వస్తుంది.
ఇక్కడ మీ పేరు, మీ జన్మ నక్షత్రం నమోదు చేయాలి.
యాడ్ టూ కార్ట్ క్లిక్ చేస్తే కార్ట్ వివరాలు కనిపిస్తాయి.
ఇక్కడ కనిపిస్తున్న ప్రొసీడ్‌ను క్లిక్ చేస్తే వ్యక్తిగత వివరాల నమోదు విండో కనిపిస్తుంది.
మీ పేరు, చిరునామా, గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేసి గో పేమెంట్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. రుసుమును నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చేయవచ్చు.
కనిపించే ఆప్షన్లలో మీకు ఖాతా ఉన్న బ్యాంక్‌ను ఎంచుకోవాలి.
రుసుము చెల్లించిన తరువాత సంబంధిత పూర్తి వివరాలతో మీకు రశీదు వస్తుంది.
దీన్ని ప్రింట్ తీసుకుని శబరిమల వెళ్లినప్పుడు సంబంధిత అధికారికి అందజేసి మీ పూజలు, సేవలు చేసుకోవచ్చు.
 
గమనిక: మరిన్ని వివరాలకు, శబరిమల అప్‌డేట్స్ కోసం ఫేస్‌బుక్‌లో ‘ట్రావెన్‌కోర్ దేవసోమ్ బోర్డు’, ‘శబరిమల దేవోసమ్’ పేజీలను చూడవచ్చు.
 
ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే పూజలు, సేవలు
అష్టోత్తరార్చన:             రూ.20
భగవతి సేవ:                రూ.1,000
గణపతి హోమం:        రూ.200
స్వయం వరార్చన:       రూ.25
నాగరాజ పూజ:           రూ.25
నవగ్రహ పూజ:            రూ.100
నీరాజనం:                   రూ.75
ఉట్టగ్రహ పూజ:             రూ.20
పుష్పాభిషేకం:              రూ.8,500
సహస్రనామార్చన:        రూ.20

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement