ఆన్‌లైన్ ఈకామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ తన వాటాను పెంచుకున్నప్పటి నుంచి కంపెనీను లాభాలబాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఫ్లిప్‌కార్ట్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ బస్ టికెట్ బుకింగ్ సేవలను ప్రారంభించారు.
ఈమేరకు రాష్ట్ర రవాణా కార్పొరేషన్లు, ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీలు వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతానికి ఈ సేవలు బెంగళూరు, ఛండీగఢ్, దిల్లీ, జైపూర్, ఇందోర్, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు.
ఇదీ చదవండి: లగేజీ తీసుకురావడానికి రూ.25 కోట్ల కాన్వాయ్!
ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ బస్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు టికెట్ ధరతోపాటు ఇతర ఛార్జీలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. అయితే కొత్తగా వచ్చిన ఫ్లిప్‌కార్ట్ బుకింగ్ పోర్టల్‌లో టికెట్ కొంటే ఎలాంటి ఛార్జీలు ఉండవని చెప్పారు. కొత్తసేవలు ప్రారంభించిన సందర్భంగా ఏప్రిల్ 15 వరకు టికెట్ ధరలో 20 శాతం వరకు రాయితీని సైతం పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా రూట్లలో 10 లక్షలకు పైగా బస్సులను అనుసందానిస్తూ ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment