సాక్షి, సిటీబ్యూరో: బల్దియా ఆధ్వర్యంలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల బుకింగ్స్‌ను త్వరలో ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తేనున్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల తరహాలో జీహెచ్‌ఎంసీ పోర్టల్ ద్వారానే ఫంక్షన్ హాళ్లను బుకింగ్ చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మా న్యువల్‌గా జరుగుతున్న బుకింగ్‌లతో నెలలో ఎన్ని రోజులు బుక్ అవుతున్నా యో, ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో ఉన్నతాధికారులకు తెలియడం లేదు.
మరోవైపు జీహెచ్‌ఎంసీ ఫంక్షన్ హాళ్లకు సైతం ఇతర ఫంక్షన్ హాళ్ల మాదిరిగా భా రీ ఫీజులు వసూళ్లు చేస్తున్నారనే ఫిర్యా దులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం ద్వా రా అవతవకలకు తావుండదని, పారదర్శకత ఉంటుందని భావించిన అధికారులు ఈ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు.
వచ్చేనెల నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. పోర్టల్‌లో ఫంక్షన్ హాళ్ల అద్దె ధరలు, అందుబాటులో ఉన్నదీ, లేనిది తదితర వివరాలు తెలుసుకొని బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
రూ.95.70 కోట్లతో 25 ఫంక్షన్ హాళ్లు..
జీహెచ్‌ఎంసీలో 25 మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లకు రూ.95.70 కోట్లు మంజూరై ఏళ్లు గడుస్తుండగా, ఇప్పటి వరకు 9 ఫంక్షన్ హాళ్ల నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. మరో 9 పురోగతిలో ఉన్నాయి. మిగతా ఏడింటి నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
పనులు పురోగతిలో ఉన్నవి..
► హెచ్‌ఎఫ్‌నగర్, రహ్మత్‌నగర్
► అయ్యప్ప క్రీడామైదానం దగ్గర, వెంగళ్రావునగర్
► టీఎస్‌ఐఐసీ కాలనీ, సూరారం
► వాలీబాల్ కోర్టు దగ్గర, తార్నాక
► పాటిగడ్డ, బేగంపేట
► ఆరంభ టౌన్‌షిప్, పాపిరెడ్డికాలనీ
► గోపన్‌పల్లి,గచ్చిబౌలి
► జుమ్మేరాత్‌బజార్ అడ్డగుట్ట, సికింద్రాబాద్
అన్ని ఫంక్షన్లకూ..
పుట్టినరోజు నుంచి పెళ్లిళ్ల వరకు వివిధ రకాల ఫంక్షన్లకు వీటిని అద్దెకిస్తారు. పెద్ద ఫంక్షన్ హాళ్ల ఖర్చులు భరించలేని వారికి సదుపాయం కలి్పంచాలనే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ ఈ మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్లను అందుబాటులోకి తెస్తోంది.
వీటికి నిషేధం..
రాజకీయ సంబంధమైన, రాజకీయ పార్టీలకు సంబంధించిన, మత సంబంధమైన కార్యక్రమాలను ఈ ఫంక్షన్‌హాళ్లలో అనుమతించరు.
హాల్ విస్తీర్ణాన్ని బట్టి.. అద్దె ధరలు రోజుకు
► 2వేల చ.మీ వరకు:రూ.10,000
► 2001–4000 చదరపు మీటర్ల వరకు: రూ.15,000
► 4000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ: రూ.20,000
► ఈ ధరలతో పాటు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
► పారిశుద్ధ్య చార్జీల కింద 20 శాతం చెల్లించాలి.
రోజు మొత్తం కాకుండా షిఫ్టుల వారీగా తీసుకునే సదుపాయం ఉంది. అందుకు సగం ఫీజు చెల్లి స్తే సరిపోతుంది. మొదటి షిఫ్టు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. రెండో షిఫ్టు సాయంత్రం 4.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు.
నిర్మాణం పూర్తయిన మల్టీ పర్పస్ ఫంక్షన్‌హాళ్లు..
► బన్సీలాల్‌పేట కమ్యూనిటీ హాల్
► చైతన్యనగర్, పటాన్‌చెరు
► భగత్‌సింగ్‌నగర్, చింతల్
► కేపీహెచ్‌బీ4 ఫేజ్,భగత్‌సింగ్‌నగర్ గాం«దీనగర్, రామంతాపూర్
► గాంధీ విగ్రహం దగ్గర, చంపాపేట
► నెహ్రూనగర్ పార్క్, మారేడ్‌పల్లి
► వెస్ట్రన్‌హిల్స్, అడ్డగుట్ట
► సీతాఫల్‌మండి, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment