Multipurpose Function Hall
-
జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాళ్లు ఇక ఆన్లైన్లో.. హాల్ విస్తీర్ణం, అద్దె వివరాలు
సాక్షి, సిటీబ్యూరో: బల్దియా ఆధ్వర్యంలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల బుకింగ్స్‌ను త్వరలో ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తేనున్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల తరహాలో జీహెచ్ఎంసీ పోర్టల్ ద్వారానే ఫంక్షన్ హాళ్లను బుకింగ్ చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మా న్యువల్‌గా జరుగుతున్న బుకింగ్‌లతో నెలలో ఎన్ని రోజులు బుక్ అవుతున్నా యో, ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో ఉన్నతాధికారులకు తెలియడం లేదు. మరోవైపు జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాళ్లకు సైతం ఇతర ఫంక్షన్ హాళ్ల మాదిరిగా భా రీ ఫీజులు వసూళ్లు చేస్తున్నారనే ఫిర్యా దులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ బుకింగ్ సదుపాయం ద్వా రా అవతవకలకు తావుండదని, పారదర్శకత ఉంటుందని భావించిన అధికారులు ఈ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. వచ్చేనెల నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. పోర్టల్‌లో ఫంక్షన్ హాళ్ల అద్దె ధరలు, అందుబాటులో ఉన్నదీ, లేనిది తదితర వివరాలు తెలుసుకొని బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రూ.95.70 కోట్లతో 25 ఫంక్షన్ హాళ్లు.. జీహెచ్ఎంసీలో 25 మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లకు రూ.95.70 కోట్లు మంజూరై ఏళ్లు గడుస్తుండగా, ఇప్పటి వరకు 9 ఫంక్షన్ హాళ్ల నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. మరో 9 పురోగతిలో ఉన్నాయి. మిగతా ఏడింటి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పనులు పురోగతిలో ఉన్నవి.. ► హెచ్‌ఎఫ్‌నగర్, రహ్మత్‌నగర్ ► అయ్యప్ప క్రీడామైదానం దగ్గర, వెంగళ్రావునగర్ ► టీఎస్ఐఐసీ కాలనీ, సూరారం ► వాలీబాల్ కోర్టు దగ్గర, తార్నాక ► పాటిగడ్డ, బేగంపేట ► ఆరంభ టౌన్షిప్, పాపిరెడ్డికాలనీ ► గోపన్‌పల్లి,గచ్చిబౌలి ► జుమ్మేరాత్‌బజార్ అడ్డగుట్ట, సికింద్రాబాద్ అన్ని ఫంక్షన్లకూ.. పుట్టినరోజు నుంచి పెళ్లిళ్ల వరకు వివిధ రకాల ఫంక్షన్లకు వీటిని అద్దెకిస్తారు. పెద్ద ఫంక్షన్ హాళ్ల ఖర్చులు భరించలేని వారికి సదుపాయం కలి్పంచాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ ఈ మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్లను అందుబాటులోకి తెస్తోంది. వీటికి నిషేధం.. రాజకీయ సంబంధమైన, రాజకీయ పార్టీలకు సంబంధించిన, మత సంబంధమైన కార్యక్రమాలను ఈ ఫంక్షన్‌హాళ్లలో అనుమతించరు. హాల్ విస్తీర్ణాన్ని బట్టి.. అద్దె ధరలు రోజుకు ► 2వేల చ.మీ వరకు:రూ.10,000 ► 2001–4000 చదరపు మీటర్ల వరకు: రూ.15,000 ► 4000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ: రూ.20,000 ► ఈ ధరలతో పాటు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ► పారిశుద్ధ్య చార్జీల కింద 20 శాతం చెల్లించాలి. రోజు మొత్తం కాకుండా షిఫ్టుల వారీగా తీసుకునే సదుపాయం ఉంది. అందుకు సగం ఫీజు చెల్లి స్తే సరిపోతుంది. మొదటి షిఫ్టు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. రెండో షిఫ్టు సాయంత్రం 4.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు. నిర్మాణం పూర్తయిన మల్టీ పర్పస్ ఫంక్షన్‌హాళ్లు.. ► బన్సీలాల్‌పేట కమ్యూనిటీ హాల్ ► చైతన్యనగర్, పటాన్చెరు ► భగత్‌సింగ్‌నగర్, చింతల్ ► కేపీహెచ్‌బీ4 ఫేజ్,భగత్‌సింగ్‌నగర్ గాం«దీనగర్, రామంతాపూర్ ► గాంధీ విగ్రహం దగ్గర, చంపాపేట ► నెహ్రూనగర్ పార్క్, మారేడ్‌పల్లి ► వెస్ట్రన్హిల్స్, అడ్డగుట్ట ► సీతాఫల్మండి, సికింద్రాబాద్ -
ఫంక్షన్.. ఉండదిక టెన్షన్
సాక్షి హైదరాబాద్: నగరంలోని ఐమాక్స్ దగ్గరలో అత్యాధునిక మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్ నిర్మించనున్నారు. ప్రజల సదుపాయార్థం హెచ్ఎండీఏకు చెందిన కోట్లాది రూపాయల విలువైన స్థలంలో దీనిని నిర్మించనున్నారు. సంపన్నులు తమ శుభకార్యాలకు వినియోగించే ఫంక్షన్ హాళ్ల మాదిరిగా వివిధ వర్గాల వారికి సైతం తగిన సదుపాయాలతో కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. మంత్రి కేటీఆర్ చొరవతో.. ఐమాక్స్ సమీపంలోని ఇందిరానగర్‌లో డబుల్బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవానికి ఇటీవల హాజరైన మంత్రి కేటీఆర్‌ను స్థానిక ప్రజా ప్రతినిధులు సదరు స్థలాన్ని జీహెచ్ఎంసీకి అప్పగిస్తే మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్ నిర్మించవచ్చని సూచించారు. పేదలు, దిగువ మధ్యతరగతి సైతం సదుపాయంగా ఉంటుందని తెలిపారు. సమ్మతించిన మంత్రి.. ఇందుకోసం కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఫంక్షన్ హాల్ కోసం కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. దాదాపు 7 వేల చదరపు గజాల ఖాళీస్థలంలో కన్వెన్షన్‌హాల్‌ను నిర్మించనున్నారు. అన్ని వర్గాలకూ అందుబాటులో.. పేదలు, సంపన్నులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారికి సదుపాయంగా ఉండేలా నిర్మించే యోచనలో అధికారులున్నారు. అందుకుగాను తగిన డిజైన్లు తదితరమైన వాటి కోసం ‘ఆర్ట్ ఆఫ్ ది స్టేట్‌గా’ ఉండేలా కన్సల్టెన్సీ సేవల కోసం టెండర్లు పిలిచారు. స్ట్రక్చరల్, సివిల్, ఎలక్ట్రికల్‌కు సంబంధించిన ఇంజినీరింగ్ డ్రాయింగ్స్‌తో పాటు ఫైర్‌సేఫ్టీ, ల్యాండ్ స్కేపింగ్ తదితర ఏర్పాట్లన్నీ సవివరంగా, సమగ్రంగా డీపీఆర్ సమర్పించాల్సిందిగా కన్సల్టెన్సీలను ఆహ్వానించారు. ఎన్ని అంతస్తులు, ఎంత వ్యయం కానుంది వంటి వివరాలను సైతం కన్సల్టెన్సీలు అందజేయాలి. డిజైన్ ఖరారయ్యాక పనులు ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు పూర్తయి. ప్రజలకు వినియోగంలోకి వచ్చేంతవరకు ఎంపికయ్యే కన్సల్టెన్సీ సంస్థ పనిచేయాల్సి ఉంటుంది. ప్రముఖ ప్రదేశాలకు చేరువలో.. ఐమాక్స్‌కు ఎదురుగా నిర్మించబోయే మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్‌కు సమీపంలోనే కొత్త సచివాలయం రానుంది. దాని నిర్మాణ పనులు పగలూ, రాత్రి వేగంగా జరుగుతున్నాయి. కన్వెన్షన్ హాల్‌కు దగ్గరలోనే రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్.అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తయిన విగ్రహం కూడా ఏర్పాటు కానుంది. హుస్సేన్‌సాగర్, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు సైతం సమీపంలోనే ఉన్నాయి. (చదవండి: రైళ్లు ఢీకొనకుండా...ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టం ‘కవచ్’) -
ఆశయానికి గ్రహణం
పెండింగ్‌లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు నిధులు లేక నిలిచిపోయిన పనులు ఏడాదిన్నర దాటినా అదే పరిస్థితి జాప్యంతో పెరిగిన వ్యయం సీఎం ఆదేశాలకు అడ్డంకులు బంజారాహిల్స్ రోడ్ నెం.12 ఎన్బీటీనగర్ బస్తీలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జూన్ 5న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాళ్లతో, గుట్టలతో నిండి ఉన్న ఈ ప్రాంతంలో భవన నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ ఇంజినీర్లు వేసిన ప్రణాళికలు అమలుకు నోచుకోలేదు. అధికారుల డిజైన్ మేరకు రాళ్ల ప్రదేశంలో నిర్మాణం సాధ్యం కాక ఏడాది కాలంగా పనులు వాయిదా పడుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ సీఎం వేసిన శిలాఫలకం వెక్కిరిస్తోంది. సిటీబ్యూరో: రాజు తలచుకుంటే డబ్బులకు కొదవుంటుందా..! కానీ మహానగరంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి సూచించిన పనులకే నిధుల కష్టాలు వెంటాడుతున్నాయి. ఏడాదిన్నర గడిచినా ఎక్కడి గొంగడి అక్కడేనన్న చందంగా మారింది. మహానగరంలో సామాన్యులు శుభకార్యం చేయాలంటే తలకుమించిన భారమవుతుంది. ఫంక్షన్ హాళ్లకు చెల్లించే అద్దెలు ఆకాశంలో ఉంటాయి. గతంలో నగరంలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దిగువ మధ్యతరగతి వారికోసం చాలినన్ని ఫంక్షన్‌హాళ్లు లేకపోవడాన్ని గుర్తించి వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌లోని పేద, దిగువ మధ్యతరగతి వారు భరించగలిగే ధరతో శుభకార్యాలు చేసుకునేందుకు అనువుగా మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. అప్పటికప్పుడు రూ.90 కోట్లతో టెండర్లు పిలిచారు. మొత్తం 50 హాళ్లను నిర్మించాలన్నది లక్ష్యం కాగా, తొలుత సర్కిల్‌కు రెండు చొప్పున 18 సర్కిళ్లలో వెరసి 36 నిర్మించాలని భావించారు. స్థలం అందుబాటులో ఉన్న 31 ప్రదేశాల్లో టెండర్లు పిలిచారు. ఇప్పటి వరకు 16 ప్రాంతాల్లో మాత్రమే టెండర్లు పూర్తయ్యాయి. ఒక్కో ఫంక్షన్‌హాల్ అంచనా వ్యయం రూ.2.90 కోట్లుగా ప్రతిపాదించారు. అయితే, ఏడాదిన్నర గడచినా ఒక్క ఫంక్షన్‌హాల్ నిర్మాణం కూడా పూర్తిచేయలేదు. ఇందులో స్థలం అందుబాటులోకి రానివి కొన్నయితే, నిధుల లేమితో నిలిచిపోయినవి మరికొన్ని. పనుల్లో జాప్యం వల్ల అంచనా వ్యయం పెరిగి, రివైజ్డ్ అంచనాలతో అనుమతుల కోసం ఎదురు చూస్తున్నవి ఇంకొన్ని. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, అన్నింట్లోకి నిధుల లేమే పెద్ద సమస్యగా మారింది. ఏడాదిన్నరగా కుంటుతున్న మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్ల పనులపై ‘సాక్షి’ ఫోకస్.. ఒకే నమూనాతో ఉండాలని.. ఫంక్షన్ హాళ్లన్నీ ఒకే నమూనాలో ఉండేందుకు తగిన మార్గదర్శకాలతో ప్రణాళికలు రూపొందించారు. అవి ఒక్కోటి దాదాపు 2 వేల చ.గ.ల విస్తీర్ణంలో ఉండాలి. మూడంతస్తులుగా నిర్మించాలి. ఒక అంతస్తులో పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు, ఒక అంతస్తులో ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు ఉండాలి. మరో అంతస్తులో భోజనాలకు ఏర్పాట్లు.. సెల్లార్లో పార్కింగ్ సదుపాయం.. పెళ్లిళ్లకు కనీసం వెయ్యిమంది కూర్చునే అవకాశం ఉండాలని నిర్ణయించారు. స్థలం లేమితో వీటిలో కొన్నింటికి మినహాయింపులిచ్చారు. శంకుస్థాపన చేసిన ఏడాదికి పనులు సీతాఫల్మండిలో జీహెచ్ఎంసీ అధికారులు నిర్మించ తలపెట్టిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు నిర్మాణ పనులకు 2015 డిసెంబర్ 2న మంత్రి పద్మారావు శంకుస్థాపన చేశారు. అనంతరం దాదాపు ఏడాదికి పనులు ప్రారంభించారు. తొలుత రూ.1.30 కోట్లతో నిర్మించాలనుకున్నారు. మంత్రి సూచన మేరకు మరోమారు జీహెచ్ఎంసీ అధికారులు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో వ్యయం రూ. 1.70 కోట్లకు పెరిగింది. నిర్మాణ పనులు జాప్యం కావడానికి ఇదొక కారణం కాగా, మరొకటి స్థలం బదలాయింపు సమస్య. ఇక్కడ ఫంక్షన్‌హాలు నిర్మించాలని ప్రతిపాదించిన స్థలం రాష్ట్ర కార్మికశాఖకు చెందినది. కార్మికశాఖ నుంచి జీహెచ్ఎంసీకి స్థల బదలాయింపు జరగడంలో ఆలస్యం జరిగింది. కొత్త ప్రతిపాదనలు, స్థల బదలాయింపు సమస్యలు పరిష్కరించే నాటికి ఏడాది కాలం గడిచింది. ఎకరం మేర విస్తీర్ణం కలిగిన ఈ స్థలంలో గతంలో కార్మికశాఖ నిర్మించిన వెల్ఫేర్ సెంటర్ భవనాలు శిథిలావస్థకు చేరడంతో వాటిని కూల్చివేశారు. ప్రస్తుతం నేల చదును పనులు జరుగుతున్నాయి. మరో ఆరు నెలల్లో నిర్మాణం పనులు పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.