కొత్త ఇంజీన్‌తో ఆకర్షణీయంగా మారుతి ఇగ్నిస్‌ | Auto Expo 2020 | Maruti Suzuki unveils upgraded Ignis  | Sakshi
Sakshi News home page

కొత్త ఇంజీన్‌తో ఆకర్షణీయంగా మారుతి ఇగ్నిస్‌

Published Fri, Feb 7 2020 2:58 PM | Last Updated on Mon, Oct 5 2020 6:55 PM

Auto Expo 2020 | Maruti Suzuki unveils upgraded Ignis  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి  హ్యాచ్‌బ్యాక్ ఇగ్నిస్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. న్యూఢిల్లీలో  శుక్రవారం ప్రారంభమైన ఆటో ఎక్స్‌పో 2020లో  దీన్ని లాంచ్‌ చేసింది.  బీఎస్‌-6 పెట్రోల్  ఇంజీన్‌తో ఇగ్నిస్‌ వాహనాన్ని అప్‌గ్రేడ్‌  చేసింది. ఇది ఏడు వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. ప్రస్తుతం ఉన్న రంగుల పాలెట్‌తో పాటు లూసెంట్ ఆరెంజ్ ,  టర్కోయిస్ బ్లూ అనే రెండు కొత్త రంగులలో  లభ్యంకానుంది. 

సమర్థవంతమైన మన్నిక, విశాలమైన ఇంటీరియర్‌తో ఇగ్నిస్‌ వాహనం 1.1 లక్షలకు పైగా భారత యూజర్లను బాగా ఆకట్టుకుందని  కంపెనీ సీఎండీ కెనిచి ఆయుకావా తెలిపారు. తాజాగా వినియోగదారుల సరికొత్త అంచనాలకనుగుణంగా కొత్త ఇగ్నిస్‌ సిద్ధంగా ఉందని అన్నారు. కాగా మారుతి సుజుకి నెక్సా పోర్ట్‌ఫోలియోలో ఇగ్నిస్‌కు ప్రత్యేక స్థానం ఉంది . ప్రపంచవ్యాప్తంగా కూడా సుజుకి పోర్ట్‌ఫోలియోలో ఇగ్నిస్‌కు ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఇది మొట్టమొదట ఫిబ్రవరి 2016లో జపాన్ మార్కెట్లో లాంచ్‌ చేయగా, తరువాత ఇండియా, ఐరోపా, ఇతర ప్రపంచ మార్కెట్లకు పరిచయం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement