మార్కెట్లోకి మారుతీ ఇగ్నిస్‌ 2019 ఎడిషన్‌ | 2019 Maruti Ignis launch price Rs 4.8 L – Prices increased by up to Rs 16k | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి మారుతీ ఇగ్నిస్‌ 2019 ఎడిషన్‌

Published Thu, Feb 28 2019 12:10 AM | Last Updated on Thu, Feb 28 2019 12:10 AM

2019 Maruti Ignis launch price Rs 4.8 L – Prices increased by up to Rs 16k - Sakshi

న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా... ఇగ్నిస్‌ మోడల్‌లో 2019 ఎడిషన్‌ను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. జూలై 1 నుంచి అమలుకానున్న ప్యాసింజర్‌ వాహనాల కొత్త భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఈ కారును రూ పొందించినట్లు కంపెనీ పేర్కొంది. అతివేగాన్ని హెచ్చరించే వ్యవస్థ, రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్, డ్రైవర్‌ పక్కన ఉన్న వ్యక్తి సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకపోతే రిమైండ్‌ చేయడం వంటి భద్రతా ఫీచర్లతో విడుదలైన ఈ హచ్‌బ్యాక్‌ ధరల శ్రేణి రూ.4.79లక్షలు నుంచి 7.14 లక్షలుగా ప్రకటించింది.

ఈ సందర్భంగా సంస్థ  సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) ఆస్‌.ఎస్‌.కల్సి మాట్లాడుతూ.. ‘ప్రయాణికులకు మెరుగైన భద్రతను అందించాలనే లక్ష్యంతో అత్యధిక సేఫ్టీ ఫీచర్లను ఈ కారులో సమకూర్చాం. ఇతర వేరియంట్లలో కూడా ఇదే తరహా ఫీచర్స్‌ను అందిస్తాం’ అని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement