మారుతీ కొత్త కారు లాంచింగ్ అప్పుడేనట! | Maruti Suzuki to launch Ignis on 13th January | Sakshi
Sakshi News home page

మారుతీ కొత్త కారు లాంచింగ్ అప్పుడేనట!

Published Tue, Dec 13 2016 10:50 AM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

మారుతీ కొత్త కారు లాంచింగ్ అప్పుడేనట!

మారుతీ కొత్త కారు లాంచింగ్ అప్పుడేనట!

మారుతీ సుజుకీ నుంచి ఎంతోకాలంగా వేచిచూస్తున్న ఇగ్నిస్ మోడల్ కారు మార్కెట్లోకి వచ్చేస్తోంది. 2016 జనవరి 13న ఈ కారును దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టనున్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. మారుతీ సుజుకీ అధికారిక వెబ్సైట్లో 'ఇగ్నిస్ కమింగ్ సూన్' అనే విషయాన్ని కంపెనీ పొందుపరిచినట్టు తెలిసింది. రిట్జ్కు రీప్లేస్గా ఈ మోడల్ను మారుతీసుజుకీ ప్రవేశపెడుతోంది.  మొదటిసారి 2016 ఆటో ఎక్స్లో ఈ కారును ప్రదర్శించారు. నెక్సా  డీలర్షిప్ ద్వారా ఈ కారును కంపెనీ విక్రయించనుంది. గుజరాత్లో ఏర్పాటుచేసిన కొత్త ప్లాంటులో ఈ కారును కంపెనీ తయారుచేసింది.  మహింద్రా కేయూవీ100కి పోటీగా ఇగ్నిస్ మోడల్ మార్కెట్లోకి రాబోతుంది. 
 
ఇగ్నిస్ మోడల్ ప్రత్యేకతలు...
1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్
1.3 లీటర్ డీజిల్ ఇంజిన్
5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, దాంతో పాటు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్
ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో హెడ్ల్యాంప్స్
నావిగేషన్తో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
ఆపిల్ కార్ప్లే
యూఎస్బీ
ఏయూఎక్స్
భద్రతా పరమైన ఫీచర్లు: యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్
రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ధర
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement