ఖరీదైన బైకులను తయారు చేసే బీఎండబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తన 'ఆర్ 1300 జీఎస్ఏ' (R 1300 GSA) లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 22.95 లక్షలు. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా 12 కేజీలు తక్కువ బరువును కలిగి ఉంది.
సుమారు 30 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ఏ 1300 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 7750 rpm వద్ద 145 హార్స్ పవర్, 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఆటోమేటెడ్ షిఫ్ట్ అసిస్టెంట్ కలిగిన ఈ బైక్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.
ఇదీ చదవండి: సరికొత్త బెంజ్ కారు లాంచ్.. ధర ఎంతంటే?
బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ఏ బైక్.. ట్రిపుల్ బ్లాక్, జీఎస్ ట్రోఫీ, ఆప్షన్ 719 కారాకోరం అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. కంపెనీ ఇందులోనే మరో కొత్త వేరియంట్ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Unleash your potential with the all-new BMW R 1300 GS Adventure.
Starting at an introductory ex-showroom price of INR 22.95 Lakhs*.
To know more, head over to the link below 👇 https://t.co/gsXc9UFriJ#BMWR1300GSAdventure #BMWMotorradIndia #R1300GSAdventure #PriceLaunch pic.twitter.com/oU0WWBuRNF— BMWMotorrad_IN (@BMWMotorrad_IN) January 18, 2025
Comments
Please login to add a commentAdd a comment