జగన్‌ యూత్‌ ఫోర్స్‌ ఆవిర్భావం | JAGAN YOUTH FORCE FORMED | Sakshi
Sakshi News home page

జగన్‌ యూత్‌ ఫోర్స్‌ ఆవిర్భావం

Published Sun, Mar 19 2017 1:46 AM | Last Updated on Thu, Oct 4 2018 7:55 PM

జగన్‌ యూత్‌ ఫోర్స్‌ ఆవిర్భావం - Sakshi

జగన్‌ యూత్‌ ఫోర్స్‌ ఆవిర్భావం

ఆచంట : ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టేందుకు  విపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరిట ఆచంటలో జగన్‌ యూత్‌ ఫోర్స్‌ ఆవిర్భవించింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లోగోను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మంచి ఆదరణ ఉందని, ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసుగెత్తిపోయారని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేయాలని యూత్‌ ఫోర్స్‌ సభ్యులను కోరారు. జగన్‌ యూత్‌ ఫోర్స్‌ కమిటీ అధ్యక్షుడు వైట్ల కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో యువతను చైతన్యపర్చి ప్రజాసమస్యలపై నిత్యం పోరాటం చేస్తామని, సేవా కార్యక్రమాలు చేపడతామని వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త కౌరు శ్రీనివాస్, పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నరసాపురం నియోజకవర్గ సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు, రాష్ట్ర యువజన కార్యదర్శి కారుమంచి రమేష్‌ చౌదరి పాల్గొన్నారు. కమిటీ సభ్యులుగా ఆరుపల్లి అశోక్, పాలసత్తి రామిరెడ్డి, కర్రి వెంకటరెడ్డి, చింతపల్లి గనిరాజు, పిల్లి రుద్రప్రసాదు, నంబూరి సుబ్రహ్మణ్యం, అరిగెల సురేష్‌బాబు, దొంగ శ్రీనివాసు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్‌ సీపీ నేతలు    వైట్ల కిషోర్‌కుమార్‌ను అభినందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement