హీరోలేనా..? నేనూ చేస్తా! | Whether your favorite places hero movies? I do | Sakshi
Sakshi News home page

హీరోలేనా..? నేనూ చేస్తా!

Published Thu, Aug 20 2015 12:07 AM | Last Updated on Thu, Oct 4 2018 7:55 PM

హీరోలేనా..? నేనూ చేస్తా! - Sakshi

హీరోలేనా..? నేనూ చేస్తా!

‘‘ఏం... సినిమాల్లో ఫైట్లు హీరోలే చేయాలా? నేనూ చేస్తా’’ అని అంటున్నారు కథానాయిక సోనాక్షీ సిన్హా. మొన్నటి వరకూ గ్లామర్ పాత్రల మీద దృష్టి పెట్టిన సోనాక్షి ఇప్పుడు యాక్షన్  చిత్రాలకు కూడా సై అంటున్నారు.
 
 వాటిలో ‘అకీరా’ ఒకటి. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉంటాయట. దాని కోసం సోనాక్షీ సిన్హా  ఓ  పక్క మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటూనే, చిత్రీకరణలో పాల్గొంటున్నారట. ఇదిలా ఉండగానే,
 
 జాన్ అబ్రహమ్ హీరోగా నటించనున్న ‘ఫోర్స్-2’ చిత్రంలో కూడా ఎఫ్‌బీఐ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారామె. ఈ చిత్రంలో కూడా సోనాక్షీకి కొన్ని యాక్షన్ సన్నివేశాలున్నాయి. ఇలా వరుసగా యాక్షన్ పాత్రలు చేస్తున్నందుకు ఈ ముంబయ్ బ్యూటీ ఉబ్బితబ్బిబవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement